Trinayani Serial Today Episode త్రినేత్రికి గాయత్రీ పాప చేయి తగలగానే నయనిలా మారిపోతుంది. నువ్వు నయని అనడానికి సాక్ష్యం ఏంటని తిలోత్తమ అడిగితే నయని గాయత్రీ పాప చేతిని తిలోత్తమ చేతిని తాకించి మంట వచ్చేలా చేస్తుంది. ఆ విషయం గురించి తెలుసుకొని మైండ్ బ్లోయింగ్ అని పోలీస్ షాక్ అవుతాడు. ఇక అందరూ తను నయని అనే నమ్ముతారు. 


చంద్రశేఖర్: కానీ ఇంకా ఏదో తెలుసుకోవాల్సింది ఉంది అని అనిపిస్తుంది నాకు.
విశాల్: ఉంటుంది సార్ కొన్ని సార్లు నయని త్రినేత్రిలా ఎందుకు ప్రవర్తిస్తుందో తెలుసుకోవాలి.
చంద్రశేఖర్: కరెక్ట్ నయనిలా గతం మర్చిపోయినా త్రినేత్రిలా ఎందుకు గుర్తుంటుందో తెలుసుకోవాలి. 
విశాల్: చీర కట్టుకున్నావ్ అంటే నయనివి లంగావోణి కడితే త్రినేత్రి అంతే కదా నయని 
నయని: అలా అంటారేంటి బాబు నేను ఎప్పటికీ మీ నయనినే.
విశాల్: ఎప్పటికీ కాదు కొన్ని గంటలే అని నాకు నేను అనుకోవాలి. 
నయని: చూశావా గాయత్రీ మీ నాన్న నన్ను తన మాటలతో కలవరపెడుతున్నారు.
విశాల్: నువ్వు మర్చిపోతున్నావ్. నువ్వు త్రినేత్రి అనుకొని పోలీస్ నిన్ను తీసుకెళ్తుండగా గాయత్రీ పాప నీ చేయి పట్టుకోని నిన్ను ఆపింది. దేవీపురంలో మనం ప్రాజెక్ట్ చేయడం ఏమో కానీ నీకు ఆ ఊరికి ఏదో సంబంధం ఉంది.
నయని: మనసులో ఉంది బాబు గారు మీ అందరినీ కాపాడుకోవాలని అనుకున్న నాకు త్రినేత్రి తన ప్రాణాలు వదిలేసుకొని నాకు తన దేహం ఇచ్చింది. 
విశాల్: నయని నీ ఫొటోతో ఆ బామ్మ తన మనవరాలు అని చాలా ఆరాటపడుతూ వెతుకుతుందట.
నయని: పాపం ఎంత వెతికినా దొరకదు కదా బాబుగారు.
విశాల్: ఎందుకు దొరకదు నిన్ను చూపిస్తే సరి. అవును నయని మతి స్థిమితం లేని ఆ బామ్మకు నిన్ను చూపించి నువ్వే త్రినేత్రి అంటే సరిపోతుంది కదా.
నయని: ఎంత మంచిగా చెప్పారు బాబుగారు అలాగే చేద్దాం. మనం ఒకసారి దేవీపురం వెళ్లి ఆ బామ్మకి కలిస్తే. మనసులో త్రినేత్రిగా నేను అక్కడికి వెళ్లి తన ప్రాణాలు తీసిని ముక్కోటి, వైకుంఠం అంతు చూడాలి.
విశాల్: మనసులో దేవీపురం వెళ్లాల్సిందే అన్న విశాలాక్షి మాటలకు అర్థం తెలుసుకోవాలి అంటే మనం వెళ్లాల్సిందే నయని. 


హాల్లో నయని పాపని పట్టుకొని కూర్చొంటే అందరూ అక్కడికి చేరుకుంటారు. నయనిని హాస్పిటల్‌లో చూపిస్దామని రిపోర్ట్స్ తీసుకురమ్మని విక్రాంత్‌తో విశాల్ చెప్తాడు. విక్రాంత్ సరే అంటాడు. ఇక నయని నన్ను ఏ హాస్పిటల్‌లో ఉంచారని అడుగుతుంది. ఉంచడం ఏంటి అని అందరూ షాక్ అయిపోతారు. హాసిని ఓ హాస్పిటల్‌ పేరు చెప్తే తర్వాత వేరే హాస్పిటల్‌కి షిఫ్ట్ చేశారు కదా దాని పేరు ఏంటి అని నయని అడుగుతుంది. దాంతో తెలీదు అంటే నయనిని పట్టించుకోలేని అనుకుంటారని తెలివిగా నయని వదిన తను కోలుకొని వచ్చిన హాస్పిటల్ పేరు చెప్పాలని అంటాడు. దాంతో అందరూ నయనికి చెప్పమని ఇరికించేస్తారు.


నయని: మనసులో.. విక్రాంత్ బాబు మీ పొరపాటుని తెలివిగా నా మీదకు నెట్టేశారు. కోమాలో ఉన్న నా శరీరం ఎక్కడుందో తెలుసుకోవాలని నేను అడిగితే నన్నే ఇరికించేస్తారా.
దురంధర: నయని చెప్పలేవా.
నయని: గుర్తు లేదు పిన్ని.
విక్రాంత్: చచ్చాను ఇప్పుడు నేనేం చెప్పాలి. 


అందరూ విక్రాంత్‌కి చెప్పమని అడిగితే విక్రాంత్ ఓ హాస్పిటల్‌ పేరు చెప్తాడు. దాంతో విక్రాంత్ ఓ పేరు చెప్తే అది పిల్లల హాస్పిటల్ అని విశాల్ అంటాడు. దాంతో అది పిల్లలతో పాటు ఆడవాళ్లని కూడా చూస్తారని అంటాడు. ఇన నయని మనసులో చూద్దాం విక్రాంత్ బాబు  ఎన్ని సార్లు తప్పించుకుంటారో అనుకుంటుంది. ఇక నయని 3 గంటలు అయిపోతుంది ఓ విషయం రాసుకుందామంటే పెన్ను దొరకడం లేదని వెతుకుతుంది. దాంతో విశాల్ పెన్ను ఇచ్చి నీ మనసులో ఉన్నది కాదు నయని నా మనసులో ఉన్నది రాయు అని అంటాడు. ఏంటి అన్నట్లు నయని చూస్తే 3 గంటల తర్వాత ఎందుకు మర్చిపోతున్నావో అది రాయు అని చెప్తాడు. అప్పటికే నయని త్రినేత్రిలా మారిపోతుంది. విశాల్ ఏదో మర్చిపోతే రాయు అని అంటే ఏం రాయాలి అని అంటుంది. దాంతో విశాల్ సడెన్‌గా ఇలా మారిపోయింది ఏంటని అనుకుంటాడు. ఇక త్రినేత్రి పెన్ తీసుకొని విశాల్ బాబుగారు లవ్ త్రినేత్రి అని రాస్తుంది. మరోవైపు వల్లభ సుమన, విక్రాంత్, హాసినిలతో తన తల్లి అఖండ స్వామి దగ్గరకు వెళ్లిందని చెప్తాడు. ఎందుకు అని అడిగితే నయనిని పరీక్షించడానికి వెళ్లిందని చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 



Also Read: అమ్మాయి గారు సీరియల్: రాజుకి గాయం.. అందరికీ షాకిచ్చిన ముత్యాలు ప్రవర్తన.. హారతి, జీవన్‌లను చూసేస్తారా!