Ammayi garu Serial Today Episode సూర్యప్రతాప్‌ ఫ్యామిలీ మొత్తం గుడికి వస్తారు. ముత్యాలు వాళ్లు కూడా వస్తారు. ముత్యాలు కావాలనే కొడుకు వాళ్లని చూసి దేవుడిని ప్రశాంతంగా మొక్కుకోవడానికి లేదని అంటుంది. ఇక రూప ముత్యాలు మాటలకు మా అత్తయ్యకి ఏం జరిగింది ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలని అనుకుంటుంది. రాజు బాధ పడకు ఆ దేవుడే నిన్ను మీ అమ్మని కలుపుతాడని అంటాడు. ఇక సూర్యప్రతాప్‌ వాళ్లు వెళ్లిపోతుంటారు. ముత్యాలు వాళ్లు వెనక్కి తిరిగి ఏడుస్తారు.


రాజు అంటే అస్సలు పట్టనట్లు ఉన్నారు కానీ రాజుని ఫాలో అవుతున్నారు ఏదో ప్లాన్ చేస్తున్నారని దీపక్ విజయాంబికతో చెప్తాడు. ఈ రోజు వాళ్ల నాటకానికి తెర దించేంద్దాం అని అనుకొని దీపక్ కావాలనే రాజు కాళ్లకి అడ్డంగా కొబ్బరి చిప్ప విసిరేస్తాడు. దాంతో రాజు అమ్మా అని పెద్దగా అరుస్తాడు. ముత్యాలు, అప్పలనాయుడు పరుగున వచ్చి అల్లాడిపోతారు. అందరూ షాక్ అయిపోతారు. అప్పనాయుడు పసుపు తీసుకొచ్చి గాయం మీద పెడితే ముత్యాలు చీర కొంగు చింపు కట్టు కడుతుంది. ఏం కాదులే నాయనా అని ఇద్దరూ ఏడుస్తూ కొడుకుకి చెప్తారు. 


రూప: అత్తయ్యా మామయ్య ఎందుకు ఇలా నటిస్తున్నారు. రాజు మీద ఇంత ప్రేమ దాచుకొని ఎందుకు పైకి అలా కోపంగా నటిస్తున్నారు. రాజుకి చిన్న కొబ్బరి చిప్ప తగిలితేనే మీ గుండెల్లో గునపం గుచ్చుకున్నట్లు బాధ పడుతున్నారు కానీ రాజు ఎదురు పడితే గునపం గుచ్చేలా మాట్లాడుతున్నారు.
అప్పలనాయుడు: వాడి మీద ఎంత కోపం ఉన్నా కన్న ప్రేమ కదమ్మా. 
సూర్యప్రతాప్‌: మీలో ఆపుకోలేనంత ప్రేమ ఉన్నప్పుడు వాడు మీ ఇంటికి రానివ్వకుండా ఎందుకు అడ్డుకున్నారు ముత్యాలు. 
ముత్యాలు: మనసులో మాకు దగ్గరగా రాజు ఉన్నంత వరకు మీకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడు మేం దూరం పెట్టడం వల్లే మీకు దగ్గరయ్యాడు. 
విజయాంబిక: చూశావా తమ్ముడు వీళ్లనాటకం. వీళ్ల నాటకాలు మన ముందు సాగాయి కానీ ఆ దేవుడి ముందు సాగలేదు. రాజుని నీకు దగ్గర చేయడానికి వీళ్లంతా కలిసి ఆడుతున్న నాటకం ఇది తమ్ముడు. ముఖ్యంగా ఆ విరూపాక్షి ఆడిస్తున్న నాటకం ఇది. 
విరూపాక్షి: విజయాంబిక ఎందులో అయినా నాటకం ఆడొచ్చు కానీ పిల్లల విషయంతో తల్లిదండ్రులు నాటకం ఆడరు. పిల్లలతో మాట్లాడనంత మాత్రాన వాళ్లకి ఏం అయినా పట్టించుకోకుండా ఉంటారా. నేను అంటే సూర్యకి ఎంత కోపమో మీ అందరికీ తెలుసు కనీసం నా పేరు తలచుకోవడానికి కూడా ఇష్టపడడు కానీ నాకు పాము కాటేడం వల్ల కాపాడాడు ఎందుకు నా మీద ప్రేమ వల్లనా కాదు మానవత్వం వల్ల. అలాంటప్పుడు రాజు కోసం వాళ్ల తల్లిదండ్రులు స్పందిండం తప్పా.
ముత్యాలు: అమ్మా అన్న పిలుపునకు మనస్సు తరక్కుపోయి చలించాను. ఆ స్థానంలో రాజు కాకుండా ఎవరు ఉన్నా ఇలాగే చేసేదాన్ని పదండి వెళ్దాం. 


రూప వాళ్ల రాజుని తీసుకొని వెళ్లిపోతారు. ముత్యాలు దేవుడికి దండం పెట్టుకొని ఏడుస్తుంది. ఇక హారతి కూడా అదే గుడికి వస్తుంది. రూప రాజు కాళ్లకి ఫస్ట్‌ ఎయిడ్ చేస్తుంది. ఇక హారతి జీవన్‌ని లాక్కొని పక్కకు తీసుకెళ్తుంది. రాజు కాళ్లకి కట్టు కట్టి రూప ప్రేమగా మాట్లాడటం ముత్యాలు వాళ్లు చూసి సంతోషిస్తారు. సూర్యప్రతాప్‌ జీవన్ గురించి అడుగుతాడు. చంద్ర తెలీదని చెప్తాడు. ఇక హారతి, జీవన్ మాట్లాడుకుంటుంటారు. నైట్ ఇంటికి వస్తా నువ్వు వెళ్లిపో అని జీవన్ అంటే దేవుడికి దండం పెట్టుకొని ఆశీర్వాదం తీసుకుందామని హారతి జీవన్‌తో చెప్తుంది. దాంతో జీవన్ సరే అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి మీద కనకానికి ఫీలింగ్స్.. ఆ పని చేస్తూ తల్లికి అడ్డంగా దొరికిపోయిందిగా!