మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతతో ఎయిమ్స్‌లో చేరారు. 88 ఏళ్ల మన్మోహన్ రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతున్నారు. సెకండ్ వేవ్ సమయంలో కోవిడ్ బారిన పడ్డారు. అప్పట్లో చికిత్స పొంది కోలుకున్నారు. సోమవారం మన్మోహన్ సింగ్‌కు జ్వరం వచ్చింది. దాన్నుంచి కోలుకున్నా నీరసంగా ఉండటంతో నిన్న సాయంత్రం ఎయిమ్స్‌లో చేరారు. కార్డియోన్యూరో యూనిట్‌లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం మన్మోహన్ సింగ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ..  అబ్జర్వేషన్‌లోఉంచామని ఎయిమ్స్ వైద్యులు ప్రకటించారు.  


Watch Video : స్టేజ్ పై స్కిప్పింగ్ ఆడిన కేంద్ర మంత్రి... నెట్టింట వీడియో వైరల్


మన్మోహన్ సింగ్‌ను పరామర్శించేందుకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఆసుపత్రికి వెళ్లారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.  మన్మోహన్ సింగ్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలుసుకుని త్వరగా కోలుకొని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ప్రధాని నరేంద్ర మోడీ ఆకాంక్షించారు. 


 



 


Also Read: ఈ దంపతులు ఇంటికి తాళం వేయరు... చిప్‌తోనే ఇంటికి లాక్, అన్ లాక్


2004లో కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. సంకీర్ణ ప్రభుత్వాన్ని విజయవంతంగా నడిపించారు. 2009లో యూపీఏ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత మన్మోహన్ సింగ్ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన సారథ్యంలో యూపీఏ అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చింది. ప్రధానిగా వ్యవహరించిన సమయంలోనే ఆయనకు ఒకసారి బైపాస్ సర్జరీ కూడా జరిగింది. కొన్ని నెలల విశ్రాంతి తీసుకున్న అనంతరం.. ఆయన తిరిగి విధుల్లో చేరారు. వయసు పెరిగిపోవడంతో ఇటీవలి కాలంలో రాజకీయాల్లో చురుకుగా లేరు. 


Also Read: పీపీఈ కిట్లు ధరించి గార్భా డ్యాన్స్... కరోనాపై అవగాహన కోసం... మీరూ ఓ లుక్కేయండి


మన్మోహన్ సింగ్ కోలుకోవాలంటూ దేశవ్యాప్తంగా ప్రముఖులు సోషల్ మీడియాలో ట్వీట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఎలాంటి పుకార్లు ప్రచారం చేయవద్దని కాంగ్రెస్ పార్టీ కోరింది. ఆయనకు సాధారణ వైద్యమే జరుగుతోందని.. సమాచారం ఎప్పటికప్పుడు తెలిచేస్తామని ప్రకటించారు. 


Also Read: రోజుకి ఎన్ని అడుగులు వేస్తే మంచిది? అసలు ఎన్ని అడుగులు వేస్తే ఆరోగ్యానికి ఆరోగ్యం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్‌ చేయండి