Manchu Lakshmi took her share of the property and settled in Mumbai:  మోహన్ బాబు కుటుంబంలో ఏర్పడిన ఆస్తుల వివాదంలో ఎక్కువగా మంచు విష్ణు, మంచు మనోజ్ పేర్లే వినిపిస్తున్నాయి. వీరిద్దరి మధ్యనే ఆస్తుల గొడవలు ఉన్నాయంటున్నారు. మరి మంచు లక్ష్మికి మోహన్ బాబు న్యాయం చేశారా? వీరిద్దరి మధ్యనే తేడాలు వచ్చేలా పంపకాలు చేశారా ? అన్న డౌట్ సామాన్యులకు వస్తోంది. ఆస్తుల్లో తనకు అన్యాయం జరిగిందని మంచు లక్ష్మి ఎప్పుడూ అనుకోలేదు. ఇంకా చెప్పాలంటే కుటుబంంలో గొడవలు రాకుండా ఆమె చాలా ప్రయత్నాలు చేశారు. మనోజ్ పెళ్లిని కూడా కుటుంబం ఏకంగా ఉండేలా తానే చేశారు. 


నిజానికి మంచు మోహన్ బాబు తన పిల్లలకు ఆస్తులను పంచి ఇచ్చేసారు.ఎవరి వాటాలు వాళ్లకు అప్పచెప్పేశారు. కానీ మనోజ్ విద్యాసంస్థల విషయంలో తనకు అన్యాయం జరిగిందన్న అభిప్రాయంతో ఉండటంతో సమస్యలు వచ్చాయి. అయితే మంచు లక్ష్మి మాత్రం తన వాటా తీసుకుని సైలెంట్ గా తన లైఫ్ గడిపేస్తున్నారు. ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్ లోనే ఉండే మోహన్ బాబు నివాసాన్ని మంచు లక్ష్మికి ఇచ్చారు. ఆమె ఆ ఇంట్లో స్వల్ప కాలమే ఉన్నారు. ముంబైకి మకాం మార్చేశారు. 


Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?


ముంబైలో హై ప్రోఫైల్ బాలీవుడ్ పార్టీల్లో మంచు లక్ష్మి తళుక్కున మెరుస్తూ ఉంటారు. తాను కూడా పార్టీలను హోస్ట్ చేస్తూంటారు. ముంబైలో తాను ఉండే లగ్డరీ ఇంటిని హోమ్ టూర్ చేసి కూడా పెట్టారు. తరచూ  గ్లామరస్ ఫోటో షూట్ చేయించుకుని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటారు. చాలా మంది వాటిని చూసి బాలీవుడ్ లో అవకాశాల కోసం మంచు లక్ష్మి ప్రయత్నిస్తున్నారని అందుకే ముంబై మారిపోయారని అనుకుంటున్నారు. కానీ మంచు లక్ష్మి బాలీవుడ్ లైఫ్ టేస్ట్ చేయడానికి వెళ్లారు కానీ అవకాశాల కోసం సీరియస్ గా ప్రయత్నించడానికి కాదని అంటున్నారు. తన ఆస్తి తనకు వచ్చేయడంతో ఆమె మిగతా విషయాల పట్ల అంత ఆసక్తి చూపించడం లేదంటున్నారు. 


Also Readపవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన అల్లు అర్జున్... ఇక మెగా వర్సెస్ అల్లు వివాదానికి ఎండ్ కార్డ్!?


సోదరుల మధ్య ఏర్పడిన ఆస్తి వివాదాల కారణంగా..  మంచు ఫ్యామిలీ విషయాలపై ఎక్కువగా చర్చలు జరుగుతూండటంతో మంచు లక్ష్మి కూడా తన వంతుగా సోదరుల మధ్య రాజీ కుదిర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. అందుకే ముంబై ముంచి హైదరాబాద్ వచ్చారని.. జల్ పల్లిలోని మంచు హౌస్ లో తండ్రి, సోదరుడు మనోజ్ తో చర్చలు జరుపుతారని అంటున్నారు. మనోజ్ తో  మంచు లక్ష్మికి అనుబంధం ఎక్కువ ఉంది. ఈ విషయాన్ని వీరిద్దరు పలుమార్లు చెప్పారు కూడా. మరి ఆ అనుబంధాన్ని ఉపయోగించి అయినా మనోజ్ తో మ్యాటర్ ను మంచు లక్ష్మి సెటిల్ చేస్తారేమో చూడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.