TGPSC Group 2 Hall Tickets 2024 Download: హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్ 2 అభ్యర్థులకు అప్ డేట్ వచ్చింది. గ్రూప్ 2 హాల్ టికెట్లను టీజీపీఎస్సీ విడుదల చేసింది. టీజీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అధికారులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని అభ్యర్థులకు కమిషన్ సూచించింది. డిసెంబర్ 15, 16 తేదీల్లో తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,368 కేంద్రాల్లో టీఎస్‌పీఎస్సీ గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించనున్నారు. తెలంగాణ గ్రూప్ 2 హాల్‌ డికెట్ల డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే


ఎగ్జామ్ రోజు ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు మాత్రమే అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించనున్నారు. మధ్యాహ్నం ఎగ్జామ్‌లకు 1.30 నుంచి 2.30 గంటల వరకు అభ్యర్థులను ఎగ్జామ్ సెంటర్ లోకి అనుమతించనున్నారు. గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్ 150 మార్కులకు నిర్వహిస్తారు. మొత్తం 150 ప్రశ్నలు, 150 మార్కులు ఉంటాయి. నాలుగు పేపర్లలో కలిపి 600 మార్కులకు మల్టిపుల్ ఛాయిస్ కింద ఎగ్జామ్ నిర్వహించనున్నారు..


అధికారికంగా ఇచ్చిన వెబ్‌సైట్‌ లింక్‌పై క్లిక్ చేసి హాల్‌ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకునేటప్పుడు మీరు టీజీపీఎస్సీ ఐడీతోపాటు మీ పుట్టిన తేదీని ఎంటర్ చేయాలి. అనంతరం అక్కడ ఇచ్చిన క్యాప్చాను కూడా ఎంటర్ చేయాలి.తర్వాత డౌన్‌లోడ్ హాల్‌టికెట్‌ పీడీపీ ఎఫ్‌ అనే బటన్‌పై క్లిక్‌ చేస్తే మీ హాల్‌టికెట్‌ డౌన్లోడ్‌ అవుతుంది.