Manchu House Video: మంచు మోహన్ బాబు, మనోజ్ వివాదంలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తోంది జల్‌పల్లిలోని మంచు మోహన్ బాబు నివాసం. అక్కడే గొడవ జరిగింది. మోహన్ బాబు నివాసం ఫిల్మ్ నగర్‌లో ఉండేది. కానీ ఆయన సినిమాలను తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు శంషాబాద్ సమీపంలోని జల్‌పల్లి అనే గ్రామంలో భారీగా భూమిని కొనుగోలు చేసి అక్కడ ప్యాలెస్ లాంటిని నిర్మించుకున్నారు. మైలార్ దేవుపల్లి మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. మోహన్ బాబు ఇంటి చుట్టూ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉన్నాయి కానీ.. ఇంకా ఎవరూ ఇళ్లు నిర్మించుకోలేదు. అందుకే ఫామ్ హౌస్‌లా.. ఆ ఇళ్లు ఒక్కటే పెద్దగా కనిపిస్తూ ఉంటుంది.                                


సాదారణంగా సెలబ్రిటీల ఎంతో రహస్యం పాటిస్తూ ఉంటారు. తమ ఇళ్లను బయట నుంచి చూడకుండా పెద్ద పెద్ద గేట్లు పెట్టుకుంటారు. అయితే మంచు మోహన్ బాబు మాత్రం దీనికి భిన్నం. ఆయన కుమార్తె మంచు లక్ష్మి తన యూట్యూబ్ చానల్ ద్వారా హోమ్ టూర్ చేయాలనుకుంటే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. మంచు లక్ష్మి ఇప్పటికే తన హైదరాబాద్, ముంబై ఇళ్లను హోమ్ టూర్ చేయించి తన చానల్ వ్యూయర్స్ కి అన్నీ చూపించారు. మోహన్ బాబు ఇంటిని కూడా వదిలి పెట్టలేదు.                                 


Also Read: మంచు హౌస్ దగ్గర బౌన్సర్లతో మనోజ్ - వెళ్లిపోయిన మోహన్‌బాబు- మ్యాటర్ మరింత సీరియస్ ?


రెండేళ్ల కిందటే మోహన్ బాబు ఇంట్లో ప్రతి మూల కనిపించేలా హోమ్ టూర్ చేసి వీడియో పెట్టారు. ఇప్పటికే పదకొండు మిలియన్ల వ్యూస్ వచ్చాయంటే మోహన్ బాబు హౌస్ ఎంత అద్భుతంగా కట్టారో అర్థం చేసుకోవచ్చు. ప్యాలెస్ ను మించిపోయేలా అందులో సౌకర్యాలు ఉంటాయి. గార్డెన్ తో పాటు ఇంటిపైన స్విమ్మింగ్ ఫూల్ ఉంటుంది. పని వాళ్లకు విడిగా ఇళ్లు నిర్మించారు. మంచు లక్ష్మి చేసిన మోహన్ బాబు హోమ్ టూర్ వీడియోను ఇక్కడ  చూడొచ్చు.



అద్భుతమైన వ్యూ ఉండేలా .. మోహన్ బాబు ప్రత్యేకమైన ఆసక్తితో ఇంటిని నిర్మించుకున్నారని మంచు లక్ష్మి చెబుతున్నారు. ఆస్తుల పంపకం తర్వాత ఫిల్మ్ నగర్ ఎంట్రన్స్ లో ఉండే నివాసాన్ని మంచు లక్ష్మికి మోహన్ బాబు ఇచ్చేశారు. అప్పటి నుంచి ఆయన జల్ పల్లి నివాసంలోనే ఉంటున్నారు. ఈ ఇంట్లో కొన్ని సినిమా షూటింగులు కూడా జరుగుతూంటాయి.                              


Also Read: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?