Mohan Babu family issue Updates:  టాలీవుడ్ లో ప్రముఖ ఫ్యామిలీల్లో ఒకటి అయిన మంచు మోహన్ బాబు కుటుంబ సమస్యలు రోడ్డున పడటంతో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆసక్తి అటు సామాన్య ప్రజల్లో.. ఇటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ కనిపిస్తోంది. ఇప్పటి వరకూ అధికారికంగా పోలీసు కేసులు కాలేదు. ఫిర్యాదుల వరకు వెళ్లాయి. మంచు మనోజ్ తనపై జరిగిన దాడి విషయంలో మెడికో లీగల్ కేసుగా మార్చేందుకు వ్యూహత్మకంగా ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత జల్ పల్లిలోని మంచు హౌస్ కు వెళ్లారు. 


జల్ పల్లిలో మంచు హౌస్ పేరుతో మోహన్ బాబుకు అతి పెద్ద నివాసం ఉంది. నాలుగైదు ఎకరాల్లో ఉండే ఆ నివాసంలోనే గొడవ జరిగింది. మోహన్ బాబు అక్కడే నివసిస్తున్నారు. మంచు లక్ష్మి ముంబైకి షిప్ట్ అయిపోగా.. మంచు మనోజ్ మాత్రం వేరే ఇంట్లో ఉంటున్నారు. విష్ణు ఎక్కువగా అమెరికాలో ఉంటున్నారు. కన్నప్ప సినిమా సీజీ వర్క్ చేయిస్తున్నారు. ఈ క్రమంలో మంచు మనోజ్ తో మోహన్ బాబు ఘర్షణ పడటం సంచలనంగా మారింది. సోమవారం ఉదయమే విష్ణుకుస సన్నిహితులు వచ్చి జల్ పల్లి నివాసంలోని సీసీ ఫుటేజీ మొత్తాన్ని .. హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లారు. నలబై మంది బౌన్సర్లను మంచు విష్ణు ఇంట్లోకి పంపి కాపలా పెట్టారు.  


Also Read: ఆస్తుల్లో తన వాటా తీసుకుని ముంబైలో ఎంజాయ్ చేస్తున్న మంచు లక్ష్మి - అన్నదమ్ముల గొడవను అక్క తీర్చే చాన్స్ లేదా ?


అదే ఇంటికి వచ్చిన మంచు మనోజ్.. తనతో పాటు ముఫ్పై మంది బౌన్సర్లను తీసుకు వచ్చారు. మంచు మనోజ్ బయట గార్డెన్‌లోనే బౌన్సర్ల రక్షణలో తిరుగుతున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఇలా ఇద్దరు సోదరులు 70 మంది బౌన్సర్లను తీసుకొచ్చి కాపలా పెట్టడంతో ఘర్షణలు జరుగుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ క్రమంలో ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన మంచు లక్ష్మి జల్ పల్లి హౌస్ కి వెళ్లి తండ్రితో పాటు సోదరుడితో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయారు. మోహన్ బాబు కూడా తన సతీమణితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు. మంచు మనోజ్ మాత్రం అక్కడే ఉన్నారు. 


Also Read: అమెరికాలో విష్ణు... విశ్రాంతిలో మోహన్ బాబు... మనోజ్ కొట్లాట కథనాల్లో నిజమెంత?


వివాద పరిష్కారం కోసం మంచు కుటుంబానికి తగ్గర అయిన పెద్దలు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. మనోజ్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడో తెలుసుకుని సర్ది  చెప్పేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా చెబుతున్నారు. మంచు లక్ష్మికి .. మనోజ్ తో ఎక్కువ అనుబంధం ఉంది. ఈ కారణంగా ఆమె కూడా వచ్చి సోదరుడితో చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. ఇప్పటికి అయితే ఈ ఇష్యూలో మనోజ్ తగ్గలేదని.. అవసరం అయితే కేసులు పెట్టి న్యాయపోరాటానికి అయినా సిద్ధమనేనని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశంలో ఇప్పటి వరకూ ఎవరూ బహిరంగంగా మాట్లాడలేదు. అంతా సెటిల్ చేసుకుని మీడియా ముందుకు వచ్చి ఏమీ జరగలేదని చెప్పాలని మంచు మోహన్ బాబు ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు.