Vikarabad Young Man Got Job Offer Worth 2 Crores Package In Amazon: ఏడాదికి రూ.2 కోట్ల వార్షిక వేతనం ప్యాకేజీతో వికారాబాద్ జిల్లా (Vikarabad District) యువకుడు అరుదైన ఘనత సాధించారు. బొంరాస్‌పేట మండలం తుంకిమెట్ల గ్రామానికి చెందిన అర్బాజ్ ఖురేషీ ప్రఖ్యాత ఐటీ కంపెనీ అమెజాన్‌లో రూ.2 కోట్ల వార్షిక వేతనంతో అప్లైడ్ సైంటిస్ట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన సోమవారం విధుల్లో చేరనున్నారు. 2019లో ఐఐటీ పట్నా నుంచి కంప్యూటర్ సైన్స్‌లో బీటెక్ పూర్తి చేసిన ఆయన మూడో ఏడాదిలో ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ మెషిన్ లెర్నింగ్ కోవిదుడు గేల్ డయాస్ వద్ద 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేశారు. అనంతరం బెంగుళూరులోని మైక్రోసాఫ్ట్ రీసెర్చ్‌లో రెండేళ్లు పనిచేశారు. 2023లో అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ మసాచుసెట్స్ నుంచి ఏఐ, మెషిన్ లెర్నింగ్‌లో ఎంఎస్ పట్టా పొందారు. యువకుడి తండ్రి యాసిన్ ఖురేషీ ప్రస్తుతం ఎక్సైజ్ జాయింట్ కమిషనర్‌గా పని చేస్తున్నారు. భారీ ప్యాకేజీతో ఉద్యోగం సాధించడం పట్ల తల్లిదండ్రులు, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Continues below advertisement


Also Read: Chennemaneni Ramesh: మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌కు బిగ్ షాక్ - జర్మనీ పౌరుడేనని తేల్చిచెప్పిన హైకోర్టు, రూ.30 లక్షల జరిమానా