Cognizant Ravi Kumar Singisetti earned Rs 186 crore in FY2023: కార్పొరేట్ కంపెనీల్లో యజమానులు ఏ పని చేయకుండా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరక్టర్ పేరుతో జీతాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటి వారు కాకుండా నిజంగా కంపెనీ కోసం పని చేసేవారికి అంత పెద్ద మొత్తంలో జీతాలు రావు కొద్ది మందికి తప్ప. అలాంటి కొద్ది మందిలో ఒకరు రవికుమార్ సంగిశెట్టి. ఈయన జీతం ఏడాదికి 186 కోట్ల రూపాయలు. ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీ కాగ్నిజెంట్ సఈవోగా పని చేస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో జీతం తీసుకునే సీఈవో భారత ఐటీ కంపెనీల్లో కానీ.. మరో కంపెనీల్లో కానీ లేరు.
కాగ్నిజెంట్ ఇండియా సీఈవోగా ఉన్న సంగిశెట్టి రవికుమార్
ఐటీ కంపెనీల్లో కాగ్నిజెంట్ అతి పెద్ద సంస్థల్లో ఒకటిగా ఉంది. ఈ సంస్థకు ఏటా ప్రపంచవ్యాప్తంగా పదిహేను లక్షల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. తెలుగు మూలాలున్న సంగిశెట్టి రవికుమార్ కొల్హాపూర్ లోని శివాజీ యూనివర్శిటీలో చదువుకున్నారు. భువనేశ్వర్ లోని జేవియర్ ఇనిస్టిట్యూట్ ఆప్ మేనేజ్ మెంట్‌లో ఏంబీఎ చేశారు. చదువు అయిపోయిన తర్వాత పలు సంస్థల్లో పని చేశారు. ప్రైస్ వాటర్ హౌస్స కూపర్స్, కేంబ్రిడ్జి టెక్నాలజీ ప్రింటర్స్, ఒరాకిల్ సహా పలు సంస్థల్లో వివిద పొజిషన్లలో పని చేశారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్‌లో చేరి తనదైన ముద్ర వేశారు.
Also Read: మరో 50 ఏళ్లలో అంతరించిపోనున్న సగం దేశాలు - ఎలాన్ మస్క్ హెచ్చరిక - ఇది వంద శాతం నిజం !
పలు ప్రతిష్టాత్మక సంస్థల్లో పని చేసిన రవికుమార్
2016-22 వరకు ఇన్ఫోసిస్‌లో రవికుమార్ సంగిశెట్టిది కీలక పాత్ర. ఆయన ఇన్ఫోసిస్ బీపీఎమ్ బోర్డులో డైరక్టర్ గా ఉన్నారు.తర్వాత బయటకు వచ్చారు. కాగ్నిజెంట్ లో చేరి సీఈవోగా ఎదిగారు. అత్యదిక జీతం తీసుకునే టెకీగా పేరు తెచ్చుకున్నారు. రవికుమార్ సంగిశెట్టి ప్రతిభను మెచ్చి అనేక సంస్థలు తమ బోర్డుల్లో నియమించుకున్నాయి. న్యూయార్క్ అకాడెమీ ఆఫ్ సైన్స్ , యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ డైర్కటర్ గా కూడా వ్యవహరించారు.
రెండో స్థానంలో ఉన్నది విప్రో సీఈవో - కానీ ఆయనకు చాలా తక్కువ జీతం
సంగిశెట్టి రవికుమార్ తర్వాత అత్యధిక జీతం తీసుకునే సీఈవో తియర్రీ డెల్ పోర్టే. ఆయనకు విప్రో ఏడాదికి రూ. 82 కోట్ల జీతం ఇస్తోంది. అంటే దాదాపుగా 90 కోట్లకుపైగా తేడా ఉందన్నమాట. తర్వాత స్థానాల్లో జెరోథా సీఈవో నితిన్ కామత్, ఎల్ అంటీ సీఈవో ఎల్ సుబ్రహ్మణ్యం, పర్‌సిస్టెంట్ సిస్టమ్స్ సందీప్ కల్రా, తరవాతి స్థానాల్లో ఉన్నారు. వీరి జీతాలు 70 కోట్ల నుంచి 80 కోట్ల రూపాయల మధ్యలో ఉంటాయి.