ఓ వ్యక్తి మర్మాంగం.. ప్లాస్టిక్ బాటిల్‌లో ఇరుక్కుపోయిన షాకింగ్ ఘటన చూసి డాక్టర్లే అవాక్కయ్యారు. ఓ వ్యక్తి తన మర్మాంగం ప్లాస్టిక్ బాటిల్‌లో ఇరుక్కుపోయిందని.. కాపాడాలని ఆసుపత్రికి వచ్చాడు. అయితే రెండు నెలలుగా బాటిల్‌లోనే ఉండటం వల్ల మర్మాంగం తీవ్రంగా దెబ్బతిందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
అసలేమైంది?
నేపాల్‌కు చెందిన ఓ 45 ఏళ్ల వ్యక్తి.. లైంగిక సుఖం కోసం ఓ బాటిల్‌లో అంగాన్ని పెట్టాడు. అయితే ప్లాస్టిక్ బాటిల్‌లో మర్మాంగం ఇరుక్కుపోయి.. ఎంతసేపటికీ రాకపోయేసరికి భయపడి అలానే ఉండిపోయాడు. ఎవరికీ కనబడకుండా రెండు నెలలపాటు గడిపేసిన అతను.. చివరికి నొప్పిని భరించలేక ఆసుపత్రికి పరిగెత్తాడు.
ఆయన పరిస్థితిని పరిశీలించిన వైద్యులు.. కేబుల్ వైర్ కట్టర్లతో బాటిల్‌ను కట్ చేసి మొత్తానికి ఆయన మర్మాంగానికి బయటకు తీశారు. రెండు నెలలుగా మర్మాంగం.. బాటిల్‌లో ఉండిపోవటం వల్ల రక్తప్రసరణ ఆగిపోయిందని.. ఈ ప్రభావం భవిష్యత్తులో కూడా ఉండే ప్రమాదముందన్నారు.
తరచుగా చేసే పనే..
చాలా మంది పురుషులు.. లైంగిక సుఖం కోసం, హస్త్రప్రయోగంతో పాటు ఈ 'పెన్నిస్ స్ట్రాంగ్యులేషన్'కు పాల్పడుతుంటారని వైద్యులు అంటున్నారు. ఇలా బాటిల్‌లో మర్మాంగాన్ని పెట్టడం వల్ల పెన్నిస్ (పురుషాంగం) దెబ్బతినే అవకాశం ఉందని కొయిరాలా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైద్యులు హెచ్చరించారు. దీని వల్ల రక్త ప్రసరణ కూడా ఆగిపోయే ప్రమాదముందని పేర్కొంది.
ఈ కేసును ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ సర్జరీ కేస్ రిపోర్ట్స్‌లో ప్రస్తావించారు. ఇలాంటి కేసుల్లో బాధితులు సిగ్గుపడకుండా త్వరగా వైద్యులను సంప్రదించాలని సూచించారు.
మొదటి పెన్నిస్ స్ట్రాంగ్యులేషన్ కేసు 1755లోనే వెలుగులోకి వచ్చినట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి ఇప్పటివరకు కొన్ని వందల కేసులు వచ్చినట్లు వెల్లడించారు.
Also Read: అమరావతిలో పవన్‌ను కలిసిన అగ్రనిర్మాతలు ! ఒంటరిని చేయలేదని క్లారిటీ ఇచ్చారా?
Also Read:US North Korea: 'కిమ్' అనకుండా బైడెన్ సైలెంట్.. అమెరికా దూకుడు ఏమైంది?
Also Read: Swachh Bharat 2.0: స్వచ్ఛ భారత్ మిషన్-2.0కు ప్రధాని మోదీ శ్రీకారం..ఇదే లక్ష్యం!
Also Read: SC on Farmers Protest: 'రైతులారా ఇక ఆపండి.. నగరానికి ఊపిరాడనివ్వండి'