ABP  WhatsApp

Swachh Bharat 2.0: స్వచ్ఛ భారత్ మిషన్-2.0కు ప్రధాని మోదీ శ్రీకారం..ఇదే లక్ష్యం!

ABP Desam Updated at: 01 Oct 2021 12:40 PM (IST)
Edited By: Murali Krishna

స్వచ్ఛ భారత్ మిషన్-2.0, అమృత్-2.0 కార్యక్రమాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

స్వచ్ఛ భారత్ మిషన్-2.0కు మోదీ శ్రీకారం

NEXT PREV

పట్టణ ప్రాంత ప్రజలకు చెత్త నుంచి విముక్తితో పాటు తాగునీటి భద్రత కల్పించే స్వచ్ఛ భారత్‌ మిషన్- పట్టణ 2.0ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. దీనితో పాటు అమృత్‌ 2.0కు కూడా మోదీ శ్రీకారం చుట్టారు. వేగంగా జరుగుతున్న పట్టణీకరణ సవాళ్లను ఎదుర్కోవడం, 2030 నాటికి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన కోసం కేంద్ర ప్రభుత్వం వీటిని రూపొందించింది. ఈ స్వచ్ఛభారత్‌-2.0కి కేంద్ర ప్రభుత్వం రూ.1.41 లక్షల కోట్లు ఖర్చు చేస్తుంది.







స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 లక్ష్యం.. నగరాల నుంచి చెత్తను నిర్మూలించడమే. నీటి సంరక్షణతో పాటు వ్యర్థాలు.. నదుల్లో కలవకుండా చూడటంపై దృష్టి సారించాం.                                -    ప్రధాని నరేంద్ర మోదీ


ఏం చేస్తారు?



  1. స్వచ్ఛ భారత్‌ (పట్టణ) కింద పట్టణాలను మురుగు నుంచి విముక్తి కల్పిస్తారు.

  2. అమృత్‌ పథకం పరిధిలోకి రాని అన్ని పట్టణ ప్రాంతాల్లో మురికి నీటి నిర్వహణ చేపడతారు.

  3. అన్ని పట్టణ స్థానిక సంస్థలను బహిరంగ మల విసర్జన రహితంగా మారుస్తారు.

  4. ఘన వ్యర్థాలను అవి ఉత్పత్తి అయ్యేచోటే వేరు చేయడంపై దృష్టి సారిస్తారు.

  5. వాటిని తగ్గించడం, పునర్వినియోగించడం, పునఃశుద్ధి చేయడం గురించి ఆలోచిస్తారు.

  6. మున్సిపాల్టీల్లో వెలువడే అన్నిరకాల వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధిచేసి, వాటిని సమర్థవంతంగా వినియోగిస్తారు.


అమృత్ 2.0..


అమృత్‌ 2.0.. కార్యక్రమం కింద దేశవ్యాప్తంగా ఉన్న 4,700 పట్టణ స్థానిక సంస్థల్లో 2.68 కోట్ల నల్లా కనెక్షన్లు ఇచ్చి ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యాన్ని కల్పిస్తారు. 500 అమృత్‌ పట్టణాల్లో ఇళ్లకు మరుగు వ్యర్థాల కనెక్షన్లు ఇస్తారు. దీనివల్ల పట్టణ ప్రాంతాల్లో ఉన్న 10.5 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతుందని ప్రధాన మంత్రి కార్యాలయం పేర్కొంది.


ఉపరితల, భూగర్భ జలాలను సంరక్షించడంతో పాటు, వాటి పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటారు. ఇందుకోసం ప్రపంచస్థాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఈ మొత్తం కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.87 లక్షల కోట్లు కేటాయించింది.


Also Read:Tata Takeover Air India: మళ్లీ టాటా చేతిలోకి ఎయిర్ ఇండియా!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at: 01 Oct 2021 12:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.