Mainpuri Bypolls: ఉత్తర్‌ప్రదేశ్‌లోని మెయిన్‌పురి ఉపఎన్నికల ప్రచారం వాడీవేడిగా సాగుతోంది. పార్టీ ప్రచారం కోసం నవంబర్ 27న మెయిన్‌పురి చేరుకున్న యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్‌పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.
డింపుల్ యాదవ్
మరోవైపు మెయిన్‌పురి ఉప ఎన్నికలకు ముందు భాజపా సర్కార్ తమ పార్టీ స్థానిక నాయకులను అణచివేస్తుందని సమాజ్‌వాదీ పార్టీ నేత డింపుల్ యాదవ్ ఆరోపించారు. ఈ ఎన్నికల్లో మెయిన్‌పురి నుంచి బరిలోకి దిగిన డింపుల్ యాదవ్.. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు.
డింపుల్‌కే ఓటు
అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్.. మెయిన్‌పురి ఉప ఎన్నికల బరిలో నిలిచారు. మెయిన్‌పురి లోక్‌సభ నియోజకవర్గానికి జరిగే ఉపఎన్నికలకు డింపుల్ యాదవ్‌ను సమాజ్‌వాదీ పార్టీ రంగంలోకి దింపింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది.
ఈ స్థానానికి తొలుత అఖిలేశ్ బంధువు ధర్మేంద్ర యాదవ్ లేదా ఆయన మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బరిలోకి దిగుతారని అంతా భావించారు. అయితే చివరకు డింపుల్ యాదవ్ పేరును ఖరారు చేశారు. ఈ స్థానానికి డిసెంబరు 5న పోలింగ్ జరగనుంది. ఫలితాలు డిసెంబర్ 8న వెల్లడిస్తారు.
కంచుకోట
మెయిన్‌పురి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉంది. 1996లో ములాయం తొలిసారిగా ఎంపీగా ఎన్నికయ్యారు. ఆయన మరో మూడుసార్లు 2004, 2009, 2019లో ఈ స్థానం నుంచి విజయం సాధించారు. 2014 ఉప ఎన్నికలో అఖిలేశ్ మేనల్లుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ సీటును గెలుచుకున్నారు. ములాయం సింగ్ లేకుండా సమాజ్‌వాదీ పార్టీ ఎదుర్కోబోతున్న తొలి ఎన్నిక ఇదే.
Also Read: Mehbooba Mufti: ఇండియా అంటే బీజేపీ కాదు, ఎలా తరిమి కొట్టాలో కశ్మీరీలకు తెలుసు - మెహబూబా ముఫ్తీ