వేద, యష్ కోర్టుకి చేరుకుంటారు. ఖుషి కోసం మన మధ్య దూరం రాకూడదని వేద యష్ ని మాట ఇవ్వమని అంటుంది. మన మధ్య మూడో వ్యక్తికి చోటు ఉండదు అని యష్ వేద చేతిలో చెయ్యి వేసి మాట ఇచ్చే టైమ్ కి మాళవిక వచ్చి పిలుస్తుంది. దీంతో యష్ ప్రామిస్ చెయ్యకుండానే వెళ్ళిపోతాడు. వేద ఫీల్ అవుతుంది. మాళవిక వేదని కావాలనే రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.


మాళవిక: కోర్టుకి వచ్చేసరికి టెన్షన్ లో ఉన్నట్టు ఉన్నావ్


వేద: ఎందుకు టెన్షన్ న్యాయం నావైపు ఉంది. నీకు గుర్తుందా ఖుషి కోసం వచ్చాను గెలిచాను, ఇప్పుడు మా అమ్మ కోసం వచ్చాను గెలుస్తాను


మాళవిక: ఈసారి ఖచ్చితంగా నువ్వు ఒడిపోతావ్ ఎందుకంటే ఆరోజు నువ్వు గెలిచావ్ అంటే యశోధర్ నీవైపు ఉన్నాడు కానీ ఈరోజు యశోధర్ నావైపు ఉన్నాడు అనేసి వెళ్ళిపోతుంది.


వేద యష్ ప్రామిస్ చేయకుండా వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే మాలిని వచ్చి మాట్లాడుతుంది. నీభర్తతో పోరాడుతున్నానందుకు బాధపడుతున్నావా అని అడుగుతుంది. ఆయన్ని ఎప్పుడు అపార్థం చేసుకొను కానీ అని వేద అంటుంటే మాలిని ఆ మాళవిక గురించి ఎందుకు భయపడుతున్నావ్ అది నీ కాలి గోటికి కూడా సరిపోదు అని ధైర్యం చెప్తుంది. అప్పుడు ఖుషి కోసం ఫైట్ చేశావ్ ఇప్పుడు తల్లికోశం చేస్తున్నావ్ న్యాయం నీవైపే ఉంది నువ్వు గెలుస్తావ్ అని చెప్తుంది. మాళవికని ఖచ్చితంగా జైలుకి పంపించాలి అని మాలిని అంటుంది. అప్పుడే లాయర్ ఝాన్సీ ఎంట్రీ ఇస్తుంది. ఇదంతా జరగాలి అంతే వేద సపోర్ట్ ఫుల్ గా ఉండాలి అని అంటుంది.


Also Read: గుండెలు పగిలేలా రోదించిన అనసూయ- ఉగ్రరూపం దాల్చి తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్న నందు


నేరం చేసిన ఆ మాళవికని ఈ ప్రపంచంలో ఎవరు కాపాడలేరు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని వేద ధైర్యంగా చెప్తుంది. అటు స్కూల్ లో ఉన్న వినాయకుడి దగ్గరకి వెళ్ళి ఖుషి తన తల్లి వేద కేసులో గెలవాలని కోరుకుంటుంది. ఆదిత్య కూడా తన తల్లి మాళవికని కాపాడాలని ప్రేయర్ చేస్తాడు. ఆదిత్య ఖుషి మీద కోప్పడతాడు. మన ఇద్దరికీ అమ్మ మాళవికనే అని అంటాడు. డాడీ మనకి సపోర్ట్ చేస్తున్నాడు వేద ఆంటీ మాత్రం అమ్మకి పనిష్మెంట్ ఇవ్వాలని చూస్తుందని చెప్తాడు. కానీ ఖుషి మాత్రం తనకి అమ్మ వేదనే అని చెప్పేసరికి ఆదిత్య కోపంగా అయితే నీతో కటీఫ్ అనేసి వెళ్ళిపోతాడు. ఖుషి చాలా బాధపడుతుంది.


కోర్టులో ప్రొసీడింగ్స్ స్టార్ట్ అవుతాయి. ఝాన్సీ తన వైపు వాదనలు వినిపిస్తుంది. ఇది యాక్సిడెంట్ కాదు హత్యాప్రయత్నం చేసింది ఎవరో కాదు మాళవిక అని లాయర్ ఝాన్సీ చెప్తుంది. ఆమాటకి యష్ తరఫు లాయర్ ఈ కేసుకి మాళవికకి ఎటువంటి సంబంధం లేదని ఇదొక భోగస్ కేసని కొట్టేయాలని జడ్జిని కోరతాడు. ఇద్దరు లాయర్లు కాసేపు వాదించుకుంటారు. నేరం నేనే చేశాను అని ఎవరు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు నేనే ఒప్పుకుంటున్నా అని మాళవిక కోర్టులో గట్టిగా చెప్పేసరికి వేద షాక్ అవుతుంది.


Also Read: మాళవిక జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాల్సిందేనన్న అభిమన్యు- కోర్టుకి చేరిన వేద, యష్