28th November 2022 Daily Horoscope Today: కెరీర్, వ్యాపారం, ఉద్యోగం, ఆర్థిక , వైవాహిక జీవితం పరంగా ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకుందాం.


మేష రాశి
మీ కెరీర్‌కి సంబంధించి మీరు కన్న కలలు నెరవేరతాయి. కార్యాలయంలో పని వేగాన్ని పెంచండి.  వ్యాపార ప్రయోజనాల కోసం చేపట్టిన ప్రయాణం విజయవంతమవుతుంది. కుటుంబ సభ్యుల ముందు పరుష పదాలు వాడవద్దు.


వృషభ రాశి
ఈ రోజు మీకు అనుకూలమైన రోజు అవుతుంది. మీ ప్రియమైన వారిని కలిసే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. చేయాల్సిన పని విషయంలో అప్రమత్తంగా ఉంటారు. కుటుంబంలో చిన్న చిన్న వివాదాలుంటాయి. ఖర్చులు పెరుగుతాయి.


మిధున రాశి
కుటుంబ వ్యవహారాలు, వ్యాపార వ్యవహారాలతో బిజీబిజీగా ఉంటారు. వ్యాపారులకు అనుకూలమైన రోజు. ఉద్యోగంలో మీ స్థాయి పెరుగుతుంది. సమాజంలో గౌరవం పొందుతారు. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి.


కర్కాటక రాశి
ఎలాంటి వ్యక్తులతో అయినా మీరు కలసిపోగలుగుతారు. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఆలోచించండి. వ్యాపార వ్యవహారాల్లో సక్సెస్ అవుతారు...భాగస్వాములతో కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. కుటుంబ సమస్యలు కొంత ఆందోళన కలిగిస్తాయి. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు..అనారోగ్య సమస్యలున్నాయి జాగ్రత్త.


Also Read: ఆర్థిక సమస్యలు తీరుతాయి, అనుకున్న పనులు పూర్తిచేస్తారు, తులా నుంచి మీన రాశి వరకూ వారఫలాలు


సింహ రాశి
ఈ రాశివారు సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు. నూతన వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఇదే మంచి సమయం. మీరు పనులు చేసే విధానాన్ని మార్చుకోండి. వివాహ ప్రతిపాదనలు మనసులో ఉత్సాహాన్ని కలిగిస్తాయి. బంధువుల వల్ల మీ కీర్తి పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి


కన్యా రాశి
కార్యాలయంలోని వ్యక్తులు మీ మాటలకు అట్రాక్ట్ అవుతారు. స్నేహితులు సహాయం చేయవలసి రావొచ్చు. ఈరోజు ఎవరితోనూ లావాదేవీలు జరపవద్దు. వ్యాపారంలో ఊహించని లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అసంపూర్తిగా ఉన్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉంటుంది.


తులా రాశి 
ఒక నిర్దిష్ట పనిని నిర్వహించడంలో స్నేహితులు సహకరిస్తారు. మీ నిర్ణయం వల్ల కుటుంబంలో అసంతృప్తి ఉంటుంది. మనసులో ఉత్సాహం లోపిస్తుంది. ఇంటిని అలంకరించుకోవడంలో సమయం గడుపుతారు


వృశ్చిక రాశి 
ఈ రాశివారు కుటుంబ సభ్యుల దగ్గర కూడా తమ రహస్యాలు చెప్పడానికి సంకోచిస్తారు. కార్యాలయంలో ఉద్యోగులతో టెన్షన్ ఉంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. సామాజిక సేవలో అత్యుత్సాహం మంచిది కాదు


Also Read: ఈ రాశులవారి జీవితంలో ఊహించని మార్పు వస్తుంది, మేషం నుంచి కన్యా రాశి వరకూ వారఫలాలు


ధనుస్సు రాశి
మీ అవగాహన వ్యాపారంలో పురోగతిని కలిగిస్తుంది. రానున్న ఇబ్బందులను మీ తెలివితేటలతో అధిగమిస్తారు.ఆధ్యాత్మిక ప్రయాణం చేసేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. వాహనం జాగ్రత్తగా నడపాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది కానీ మనసులో ఏదో కలవరం ఉంటుంది..


మకర రాశి
ఈ రాశివారు ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. ప్రభుత్వ రంగంలో పనిచేసేవారికి  కొన్ని ఆటంకాలు ఉండవచ్చు కానీ బాగానే ఉంటుంది. విమర్శలకు దూరంగా ఉండండి. పిల్లల వివాహ ప్రతిపాదనలు విజయవంతమవుతాయి.


కుంభ రాశి
వివాహ చర్చలు విజయవంతమవుతాయి. శుభకార్యాల నిర్వహణ గురించిచర్చిస్తారు. కార్యాలయంలో మీపనితీరుతో ఆకట్టుకుంటారు. మీ గౌరవం పెరుగుతుంది. మీకోసం మీరు వాల్యబుల్ సమయం గడుపుతారు


మీన రాశి 
మీ ఆహారపు అలవాట్లను క్రమబద్దీకరించుకోండి. కుటుంబంలో ఎవరితోనైనా విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ప్రశాంతంగా ఉండటం మంచిది. పాత సంబంధాల వల్ల ప్రయోజనం పొందుతారు. పని చేసే ప్రదేశంలో కీర్తిపొందుతారు.నూతన వస్త్రాలు ,ఆభరణాలు కొనుగోలు చేస్తారు


2023 లో మేష రాశివారి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023లో వృషభ రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి


2023 మిథున రాశి వార్షిక ఫలితాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి