వివో వై76ఎస్ టీ1 వెర్షన్ సైలెంట్‌గా చైనాలో లాంచ్ అయింది. ఇందులో 6.58 అంగుళాల ఎల్సీడీ వాటర్ డ్రాప్ నాచ్ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందుబాటులో ఉన్నాయి.
వివో వై76ఎస్ (టీ1 వెర్షన్) ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 1,899 యువాన్లుగా (సుమారు రూ.21,800) నిర్ణయించారు. స్టార్ డైమండ్ వైట్, గెలాక్సీ వైట్, స్టారీ నైట్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వివో వై76ఎస్ (టీ1 వెర్షన్) స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో ఈ ఫోన్ లాంచ్ అయింది. 6.58 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 180 హెర్ట్జ్‌గా ఉంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ ఆగ్జిలరీ లెన్స్ కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
ఫోన్ పవర్ బటన్‌ను కుడివైపు అందించారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా పవర్ బటన్‌కే ఇంటిగ్రేట్ చేశారు. దీని బ్యాటరీ సామర్థ్యం 4100 ఎంఏహెచ్ కాగా, 44W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. దీని మందం 0.77 సెంటీమీటర్లు కాగా, బరువు 175 గ్రాములుగా ఉంది.
Also Read: ఐఫోన్ 14 సిరీస్ వచ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?