శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని కంపెనీ ఇంతవరకు షేర్ చేయలేదు. అయితే ఫోన్ ఫీచర్లు మాత్రం చాలా సార్లు లీకయ్యాయి. ఇప్పుడు దీనికి సంబంధించిన మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. దీని ప్రకారం ఈ ఫోన్ పీక్ బ్రైట్‌నెస్ 2,100 నిట్స్ నుంచి 2,200 నిట్స్ వరకు ఉండనుంది. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 960 హెర్ట్జ్‌గా ఉంది.


అంటే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా బ్రైట్‌నెస్ ఐఫోన్ 14 ప్రో కంటే ఎక్కువగా ఉండనుందన్న మాట. 2,000 హెర్ట్జ్ లోపు పల్స్ విడ్త్ మాడ్యులేషన్ ఫీచర్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ6 అమోఎల్ఈడీ ఎల్టీపీవో డిస్‌ప్లేను ఇందులో అందించనున్నారు. ఐఫోన్ 14 ప్రో పీక్ బ్రైట్‌నెస్ 2,200 నిట్స్‌గా ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా బ్రైట్‌నెస్ 1,750 నిట్స్‌గా ఉంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా టచ్ శాంప్లింగ్ రేట్ 960 హెర్ట్జ్‌గా ఉంది. దీంతోపాటు స్ట్రాంగెస్ట్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉండనుంది. దీని కెమెరాలకు కూడా గ్లాస్ కవరింగ్ ద్వారా  ప్రొటెక్షన్ అందించనున్నారు. దీని పీడబ్ల్యూఎం (పల్స్ విత్ మాడ్యులేషన్) ఫ్రీక్వెన్సీ 2,000 హెర్ట్జ్ లోపే ఉండనుంది.


శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా స్మార్ట్ ఫోన్ లీక్స్ ఇటీవలే చాలా వచ్చాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ 5జీ ఫోన్‌లో బ్యాటరీ సామర్థ్యాన్ని కంపెనీ పెంచనుందని వార్తలు వస్తున్నాయి. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 ప్లస్‌లో 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండగా, అది గెలాక్సీ ఎస్23 ప్లస్‌కు 4700 ఎంఏహెచ్‌కు పెరగనుందని వార్తలు వస్తున్నాయి. అయితే గెలాక్సీ ఎస్23, గెలాక్సీ ఎస్23ల్లో ఎటువంటి మార్పులు జరగనున్నాయో తెలియరాలేదు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ప్లస్ సైజు కూడా గెలాక్సీ ఎస్22 ప్లస్ తరహాలోనే ఉండనుంది. ఈ ఫోన్‌లో స్టాకింగ్ టెక్నాలజీని కంపెనీ అందించనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?