టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్‌కు తర్వాతి వెర్షన్‌గా ఫాంటం ఎక్స్2 సిరీస్‌ను కంపెనీ లాంచ్ చేయడానికి సిద్థం అవుతోంది. టెక్నో లాంచ్ చేసిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఇదే. గతేడాది ఏప్రిల్‌లో టెక్నో ఫాంటం ఎక్స్ సిరీస్లాంచ్ అయింది. టెక్నో ఫాంటం ఎక్స్2 సిరీస్‌ను దుబాయ్‌లో కంపెనీ లాంచ్ చేయనుంది. ఈ విషయాన్ని టెక్నో ఒక వెబినార్ ద్వారా వెల్లడించింది. రియల్‌మీ, షావోమీ బ్రాండ్లలోని మిడ్ రేంజ్ ఫ్లాగ్ షిప్ ఫోన్లతో ఇది పోటీ పడనుంది.


ఈ సిరీస్‌లో టెక్నో ఫాంటం ఎక్స్2, ఫాంటం ఎక్స్2 ప్రో స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. డిసెంబర్ 7వ తేదీన ఈ ఫోన్లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. మరింత మెరుగైన కెమెరా ఫీచర్లు ఇందులో ఉండనున్నాయని కంపెనీ తెలిపింది. వీటిలో మీడియాటెక్ డైమెన్సిటీ 9000 ప్రాసెసర్‌ను అందించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.


టెక్నో పోవా 4 ప్రో ఇటీవలే బంగ్లాదేశ్‌లో లాంచ్ అయింది. ఇందులో ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను 26,990 బంగ్లాదేశ్ టాకాలుగా (మనదేశ కరెన్సీలో సుమారు రూ.21,330) నిర్ణయించారు. ఫ్లోరైట్ బ్లూ కలర్ ఆప్షన్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.


ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. ఇది గేమింగ్ ఫోకస్డ్ ఫోన్ కాబట్టి ఇందులో 5 జీబీ వరకు ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌ను వర్యువల్‌గా అందించనున్నారు.


ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. 


దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది. 45W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. కేవలం 24 నిమిషాల్లోనే 50 శాతం చార్జింగ్ ఎక్కుతుందని కంపెనీ అంటోంది. గేమింగ్ ఓరియంటెడ్ ఫీచర్లను కూడా ఇందులో అందించారు. ఆండ్రాయిడ్ 12 ఆధారిత హైఓఎస్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది.


Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?