Mehbooba Mufti:


కేంద్రంపై ఫైర్..


జమ్ముకశ్మీర్‌లోని పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించనంత వరకూ...ఇక్కడికి ఎన్ని సైనిక బలగాలను పంపినా ఎలాంటి ఫలితాలు చూడలేరని వెల్లడించారు. శ్రీనగర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె...ఈ వ్యాఖ్యలు చేశారు. "ఇక్కడి వారిపై దాడి చేసేందుకు పాకిస్థాన్ నుంచి ఆంగతుకులు వచ్చిన సమయంలో భారత సైన్యం రాలేదు. కశ్మీరీ ప్రజల చేతుల్లో ఆయుధాలు లేకపోయినా...ఆ కుట్రదారులను తరిమికొట్టారు. మీరేదో అటాకర్స్‌గా మారిపోలవాలని చూడకండి. కశ్మీరీలకు అలాంటి వాళ్లను ఎలా తరిమి కొట్టాలో బాగా తెలుసు" అని అన్నారు. రాజ్యాంగబద్ధంగా కశ్మీర్‌ భారత్‌తో ముడి పడి ఉందని గుర్తు చేశారు. కానీ ఆ రాజ్యాంగాన్ని భంగ పరిచారని బీజేపీని విమర్శించారు. "భారతదేశం బీజేపీది కాదు. కశ్మీరీ సమస్యను పరిష్కరించనంత వరకూ ఎన్ని బలగాలు వచ్చినా ఒరిగేదేమీ ఉండదు" అని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యువత పెద్ద ఎత్తున ముందుకొచ్చి పోటీ చేయాలని పిలుపునిచ్చారు. 
"ఇది బీజేపీ ఇండియా కాదు. రాసిపెట్టుకోండి. అలాంటి పరిస్థితులు అస్సలు రానివ్వం" అని తేల్చి చెప్పారు. "ఇండియా అంటే బీజేపీ కాదు. జవహర్ లాల్ నెహ్రూ, గాంధీజీ, మౌలానా అబ్దుల్ కలాం నాటి ఇండియాతో కశ్మీర్ కలిసి ఉంది. ప్రస్తుతం హిందూ ముస్లింల ఐక్యత కోసం రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారు" అని వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 370 ని రద్దు చేయడంపైనా మండి పడ్డారు. "భారత్‌తో హృదయ పూర్వక మైన బంధంఏర్పరుచుకున్నాం. అది రాజ్యాంగబద్ధమైంది కూడా. కానీ...మీరేం(బీజేపీని ఉద్దేశిస్తూ) చేశారు. మా ఐడెంటిటీ, గౌరవంతో ఆడుకున్నారు. మొత్తం రాష్ట్రాన్ని నాశనం చేశారు" అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 






ఇల్లు విడిచి వెళ్లిన ముఫ్తీ..


మెహబూబా ముఫ్తీ తన ఇల్లు విడిచి వెళ్లిపోవాల్సి వచ్చింది. శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్‌లో ఆమెకు పెద్ద బంగ్లా ఉంది. 2005లో మెహబూబా ముఫ్తీ తండ్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్‌ హయాంలో ఈ గెస్ట్ హౌజ్‌ను అప్పగించారు. అప్పటికే ఆయన సీఎంగా మూడేళ్ల పదవి కాలం పూర్తి చేశారు. పీడీపీ, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం అప్పటికి జమ్ము కశ్మీర్‌ను పరిపాలిస్తోంది. 2016 నుంచి 2018 వరకూ సీఎంగా ఉన్న మెహబూబా ముఫ్తీ...ఆ పదవి నుంచి దిగిపోయాక కూడా అదే గెస్ట్‌హౌజ్‌లో నివాసం ఉంటున్నారు. 2018లో పీడీపీ-బీజేపీ ప్రభుత్వం పడిపోయింది. ఆ తరవాత కూడా ఆమె అదే బంగ్లాలో ఉండేందుకు అనుమతి లభించింది. ప్రస్తుతానికి మెహబూబా ముఫ్తీకి ఏ పదవి లేదు. అందుకే...ఆమె ఆ గెస్ట్ హౌజ్‌ని ఖాళీ చేసి వెళ్లిపోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ ఏడాది అక్టోబర్ 15న Estate Department అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే.. మెహబూబా ముఫ్తీ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. పది రోజుల తరవాత అధికారులు మరోసారి నోటీసులు పంపారు. "అనధికారికంగా ఆక్రమించుకుని నివాసం ఉంటున్నారు" అంటూ స్పష్టం చేశారు. 


Also Read: Rajasthan Congress Crisis: గహ్లోట్ వర్సెస్ పైలట్ మ్యాటర్ సెటిల్ అయిపోతుంది - కేసీ వేణుగోపాల్