అఖిల భారత అఖాడా పరిషద్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి పరమపదించారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో బాఘంబరీ మఠంలో ఆయన చివరిశ్వాస విడిచారు. దేశంలోని స్వామీజీల అతిపెద్ద సంఘం ఈ అఖాడా పరిషద్.

  






స్వామీజి మృతికి గల కారణాలు తెలియలేదు. ప్రస్తుతం అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆశ్రమంలోని వ్యక్తులను విచారిస్తున్నారు. 


Also Read:Russia University Shooting: రష్యాలో కాల్పుల కలకలం.. 8 మంది మృతి


సహజ మరణమేనా..?


ఇటీవల తన శిష్యుడు స్వామి ఆనంద గిరి, స్వామీజీ నరేంద్ర గిరికి మధ్య వివాదం చెలరేగినట్లు సమాచారం. సన్యాసి నిబంధనలకు విరుద్ధంగా తన శిష్యుడు.. కుటుంబాన్ని తరచుగా కలుస్తున్న కారణంగా ఆయనను బాఘంబరీ మఠం నుంచి బహిష్కరించారు స్వామీజీ. ఆ తర్వాతే ఆయన పరమపదించడం పలు అనుమానాలకు తావిస్తుందని ఆశ్రమవాసులు అంటున్నారు. ఈ ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.


అఖిలేశ్ విచారం..






స్వామీజీ పరమపదించిన ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ విచారం వ్యక్తం చేశారు. ఇది పూడ్చలేని లోటుగా అభివర్ణించారు. ఈ ఘటనపై ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ దర్యాప్తునకు ఆదేశించింది.


Also Read: Chiranjeevi: టాలీవుడ్ నిజంగా కష్టాల్లో ఉందా? చిరు వ్యాఖ్యలపై భిన్న వాదనలు.. భారీ పారితోషకాలు ఎందుకు?