ITR Refund Scam: ఇన్ కమ్ టాక్స్ రిఫండ్ భారీ స్కామ్ చేసిన నిందితుల ఆట కట్టించారు అన్నమయ్య జిల్లా మదనపల్లి పోలీసులు. మదనపల్లిలో రూ.13 కోట్ల ఇన్ కమ్ టాక్స్ రిఫండ్ ను కాజేసిన నిందితులను మదనపల్లి పోలీసులుమంగళవారం అరెస్టు చేశారు. నిందితుల అరెస్టుకు సంబంధించి మదనపల్లి డీఎస్పీ కేశప్ప మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. స్థానిక ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్ మెంట్లో టీడీఎస్ రిఫండ్స్ కాజేసి సస్పెన్షన్ లో ఉన్న తంబళ్లపల్లె ఎస్టీఓ శ్రీనివాసులు, బాలమురళి, పీలేరు ఎస్టీఓ ఇంతియాజ్, పుంగనూరు సీనియర్ అసిస్టెంట్ జీవానందంను అరెస్టు చేసినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో ఆడిటర్ శ్రీనాథ్, అతని భార్య వైయస్ రమ్య పరారీలో ఉన్నారు. వారిని సైతం త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు.


కోట్లు కాజేసిన ట్రెజరీ ఉద్యోగులు నలుగురు అరెస్ట్... 
మదనపల్లె డివిజన్లో మోసపూరితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్టుమెంటు నుండి టిడిఎస్ రీఫండ్ కాజేసిన కేసుకు సంబంధించి 15 మంది నిందితుల్లో ఆరు మందిని అరెస్టు చేయడం జరిగిందని డిఎస్పీ కేశప్ప తెలిపారు. నేడు మదనపల్లె డిఎస్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ టిడిఎస్ రీఫండ్ 13 కోట్ల 21 లక్షల 76వేలా 257 రూపాయలను కాజేసిన కేసుకు సంబంధించి నిందితులను అరెస్టు చేయడం జరిగిందన్నారు. వీరిలో సస్పెన్షన్ లో ఉన్న తంబళ్లపల్లి ఎస్టీఓ శ్రీనివాసులు, బాలమురళి, పీలేరు ఎస్టీఓ షేక్ ఇంతియాజ్, పుంగనూరు సీనియర్ అసిస్టెంట్ జీవానందంలను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసులో ఆడిటర్ శ్రీనాథ్, అతని భార్య రమ్య పరారీలో ఉన్నారని, వారినీ త్వరలోనే అరెస్టు చేస్తామని డిఎస్పీ చెప్పారు.


ఇటీవలే హైదరాబాద్ లోనూ సైబర్ మోసం
హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఇటీవలే సైబర్‌ నేరగాళ్లు నిలువునా ముంచేశారు. సోషల్ మీడియా పెట్టే పోస్టులను లైక్ చేస్తే చాలు అంటూ 47 లక్షలు గుంజేశారు. మొదట్లో ఎలాంటి వివరాలు ఇవ్వాల్సిన పని లేదంటూనే మొదలుపెడతారు. క్రమంగా పని కానిచ్చేసి వెళ్లిపోతారు. ఈ ఉద్యోగి కూడా అలానే బోల్తా పడ్డాడు. మొదట్లో నమ్మించడానికి కొంత అమౌంట్‌ ట్రాన్స్‌ఫర్ చేశారు. అది నిజమే అనుకున్నాడు. అక్కడే మరో ట్రిక్ ప్లే చేస్తారు సైబర్ కేటుగాళ్లు. రోజువారిగా వచ్చే ఆదాయం మరింత పెరగాలంటే కొత్త అమౌంట్‌ కట్టాలని చెబుతారు. దీన్ని కంటిన్యూ చేయాలంటే ఓ అకౌంట్ క్రియేట్ చేస్తామని కవర్ చేస్తారు. ఏ రోజు డబ్బులు ఆ రోజు అందులో పడతాయని చెప్పారు. వాటిని నెలకోసారి తీసుకోవచ్చని చెప్పారు. దానికి ఓకే అన్నాడు. ఇలా పని చేస్తున్న కొద్దీ అందులో అమౌంట్‌ పడుతూ ఉంది. కానీ తీసుకోవడానికి మాత్రం వీలుపడటం లేదు. అదే విషయాన్ని అడిగితే ఏదో కారణం చెప్పి కొంత అమౌంట్‌ పే చేస్తే రిలీజ్ అవుతుందన్నారు. దాన్ని నమ్మిన ఆ వ్యక్తి ఆ డబ్బులు కట్టేశాడు. అలా విడతల వారీగా 47 లక్షలు కట్టించుకున్నారు. కానీ ఆ అకౌంట్‌లో ఉన్న డబ్బులు మాత్రం రిలీజ్ చేయలేదు.