ఎవరైనా గంట..రెండు గంటలు నడిస్తేనే అలసిపోతారు. ఇక స్విమ్మింగ్ గంట చేస్తే కళ్లు తేలేస్తారు. కానీ పన్నెండు గంటలు స్విమ్మింగ్ చేయడం అంటే చిన్న విషయం కాదు. అతను చేశాడు. ఇంకా చెప్పాలంటే... స్విమ్మింగ్ చేయడమా..  ప్రాణాలు కోల్పోవడమా..? ఈ రెండు ఆప్షన్లే అతని ముందు ఉన్నాయి.  ప్రయత్నించకుండా చనిపోవడం కన్నా... స్విమ్మింగ్ చేసి..ప్రయ.త్నంలో చచ్చిపోవడం మంచిదనుకుని ప్రయత్నించాడు. కానీ విజయం సాధించాడు.  ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ హీరో మడగాస్కర్ దేశ మంత్రి  . అసలు ఆయన ఎందుకు సముద్రంలో పడిపోయాడు.. అంత డీప్ సీలోకి ఎలా వెళ్లాడు.. అసలేం జరిగింది అంటే.. అదో పెద్ద కథ. 

Also Read: అక్కడ మహిళా సైనికులకు లైంగిక వేధింపులు, మత్తుమందు లేకుండా అబార్షన్లు

మడగాస్కర్ దేశ ప్రభుత్వంలో గిల్లీ ఓ మంత్రి. పోలీసు,..రక్షణ బలగాల వ్యవహారాలు చూస్తూంటారు. ఆయన అధికార పర్యటనలో భాగం హెలికాఫ్టర్‌లో ఓ చోటు నుంచి మరో చోటకు బయలుదేరారు. తనతో  పాటుగా దాదాపుగా నలభై మంది ఉన్నారు. వీరిలో సైనికాధికారులు...పోలీసులు..ప్రభుత్వాధికారులు ఉన్నారు. అయితే సముద్రం మధ్యలోకి  రాగానే  హెలికాఫ్టర్ క్రాష్ అయింది. అచ్చంగా ఇటీవల భారత సీడీఎస్ బిపిన్ రావత్  ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ తరహాలోనే ప్రమాదం జరిగింది. ఆ సమయంలో  గిల్లీ కిందకు దూకేశారు. సముద్రంలోపడిపోయారు. ఆయనతో పాటు మరకొరు కూడా దూకారు.

 

Also Read: Divorce: దుబాయ్ రాజు విడాకులు.. భార్యకు భరణం ఎన్ని కోట్లు చెల్లించాలో తెలుసా

ఎక్కడ దూకారోతెలియదు.. ఎటు వైపు వెళ్తే ఏమివస్తుందో తెలియదు కానీ... ఈదుకుంటూ ఏదో ఓ ఓడ్డుకు చేరుకోకపోతే మాత్రంహెలికాఫ్టర్ క్రాష్ నుంచి తప్పించుకున్నా ... సముద్రానికి బలి కావాల్సిందేనన్న క్లారిటీ మాత్రం వచ్చింది. అందుకే ఈదాడు.. ఈదాడు.. చివరికి ఓ ఒడ్డుకు చేరుకుని స్పృహ కోల్పోయాడు. అతను ఒడ్డున స్పృహ లేకుండా ఉండటాన్ని గమనించిన కొంత మంది కాపాడి సపర్యలు చేశారు.. .కాసేపటికే ఆయనకు స్పృహ వచ్చింది. 

Also Read: YouTube Channels Blocked: పాకిస్తాన్‌కు భారీ షాక్.. 20 యూట్యూబ్ ఛానెళ్లు, వెబ్‌సైట్స్ బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం

గిల్లీని తమ దేశ మంత్రిగా కాపాడిన వారు గుర్తించారు. ఆ హెలికాఫ్టర్ ప్రమాదంలో గిల్లీతో పాటు మరో వ్యక్తి మాత్రమే బయట పడ్డారు. మిగతా అంతా చనిపోయారు. తన చావు ఇంకా లేదని.. అందుకే బయటపడ్డాని గిల్లీ వ్యాఖ్యానించారు. తోటి వారు  చనిపోవడం పట్ల బాధను వ్యక్తం చేశాడు. గిల్లీకి ఇంత ఫిట్‌నెస్... స్విమ్మింగ్ ఎలా వచ్చిందంటే.. ఆయన పోలీసు అధికారిగా ముఫ్పై ఏళ్లు సర్వీస్ చేశాడు. ఆ ఫిట్ నెస్‌ ప్రాణాల్ని కాపాడింది. 

Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 6,317 మందికి కరోనా.. 213కు చేరిన ఒమిక్రాన్ కేసుల సంఖ్య

 ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి