Congress Manifesto:
మేనిఫెస్టో కోసం..
లోక్‌సభ ఎన్నికలకు మరి కొద్ది నెలలు మాత్రమే సమయముంది. అందుకే అన్ని పార్టీలూ స్ట్రాటెజీస్ సిద్ధం చేసుకుంటున్నాయి. వీటితో పాటు మేనిఫెస్టోలపైనా దృష్టి పెట్టాయి. ఈ విషయంలో కాంగ్రెస్ అందరి కన్నా ముందున్నట్టే కనిపిస్తోంది. Lok Sabha Elections 2024 కి సంబంధించిన హామీలను సిద్ధం చేయడానికి ప్రత్యేకంగా మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. సీనియర్ నేత పి. చిదంబరం ఈ కమిటీకి ఛైర్మన్‌గా ఉండనున్నారు. ఛత్తీస్‌గఢ్ మాజీ ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్ దియోకి కూడా కీలక బాధ్యతలు అప్పగించింది హైకమాండ్. మేనిఫెస్టోకి సంబంధించిన ప్యానెల్‌కి కన్వీనర్‌గా చేసింది. మొత్తం 16 మంది సభ్యులతో కూడిన ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఇందులో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ఉన్నారు. ఇటీవలే లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించేందుకు CWC మీటింగ్ నిర్వహించింది అధిష్ఠానం. ఆ సమావేశంలోనే మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు జరిగింది. త్వరలోనే అభ్యర్థులనూ ప్రకటించనుంది. ఈ మేరకు అధికారికంగా ఓ ప్రకటన చేసింది కాంగ్రెస్. మాజీ కేంద్రమంత్రులు ఆనంద్ శర్మ, జైరాం రమేశ్, శశిథరూర్ కూడా కమిటీలో కీలక సభ్యులుగా ఉన్నారు. మిగతా సభ్యులతో చర్చించి త్వరలోనే పార్టీ ఎజెండాని ప్రకటించనున్నారు.
ఐదు రాష్ట్రాల్లో వచ్చిన ఎన్నికల ఫలితాల అనుభవాలతోనే 2024 సార్వత్రిక ఎన్నికలపై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికలను సీరియస్ గా తీసుకొని, పార్టీ గెలుపు కోసం పని చేయాలని నేతలు, కార్యకర్తలకు సూచించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పార్టీకి నిరాశ పరిచాయన్నారు ఖర్గే. అసెంబ్లీ ఎన్నికల తప్పుల నుంచి విలువైన పాఠాలు నేర్చుకున్నామని, ఆ అనుభవాలతో పార్లమెంట్ ఎన్నికల్లో తప్పులు చేయకుండా ముందుకు సాగుతామన్నారు. సార్వత్రిక ఎన్నికలు పమీపిస్తున్నాయన్న మల్లికార్జున ఖర్గే, కార్యాచరణ రూపొందించాలని నేతలకు సూచించారు. కలిసికట్టుగా పార్టీ కోసం పని చేయాలని, ఎవరు అలసత్వం వహించవద్దని స్పష్టం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థిగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో పాటు పలు పార్టీలకు చెందిన సీనియర్ నేతలు ఇండియా కూటమి సమావేశంలో ప్రతిపాదించినట్లు సమాచారం.
Also Read: Covid Cases in India: కొవిడ్ కేసుల్లో 7 నెలల రికార్డు బ్రేక్, ఒక్క రోజే 700 మందికి పైగా కరోనా