Liquor Seized: బిహార్‌లో కల్తీ మద్యం తాగి ప్రజలు మరణిస్తూనే ఉన్నా పరిస్థితులు మారడం లేదు. 2016 ఏప్రిల్ నుంచే బిహార్‌లో మద్య నిషేధం అమలవుతోంది.. కానీ రాష్ట్రంలో తరచుగా ఎక్కడో ఒక చోట లిక్కర్ లభిస్తూనే ఉంది. తాజాగా అధికార పార్టీకే చెందిన ఓ నాయకుడు ఇంట్లో భారీ సంఖ్యలో మద్యం సీసాలు లభించాయి.
ఇంట్లో
మర్హౌరాలోని అధికార జేడీయూ నాయకుడు, స్టేట్ కౌన్సిల్ సభ్యుడైన కామేశ్వర్ ఇంటిపై పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా దేశీయ, విదేశీ బ్రాండ్‌లకు చెందిన మద్యం సీసాలు లభించాయి. దీంతో అధికారులు వాటిని సీజ్ చేశారు.
సరోజ్ మహ్తో అనే వ్యక్తి తన భార్యతో పాటు ఆ ఇంట్లో రెంట్‌కు ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఒక మహిళను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
నాకు తెలియదు
ఈ ఘటనపై జేడీయూ నేత కామేశ్వర్ వింతగా సమాధానమిచ్చారు. ఈ ఘటన గురించి మీడియా ద్వారానే తనకు తెలిసిందన్నారు.
పరిహారం ఇవ్వం
గత వారం అక్రమ మద్యం తాగడంతో రాష్ట్రంలో 70 మందికిపైగా మరణించారు. బిహార్‌లో చప్రా, సివాన్ జిల్లాల్లో కల్తీ మద్యం తాగి పదుల సంఖ్యలో ప్రాణనష్టం జరిగింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ అంశంపై అసెంబ్లీలో భాజపా, నితీశ్ సర్కార్ మధ్య ఇటీవల వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఈ మరణాలన్నీ...అంటూ భాజపా తీవ్ర స్థాయిలో విమర్శించింది. అటు ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కూడా గట్టిగానే బదులిచ్చారు.
Also Read: Taj Mahal News: తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా? నోటీసులు ఎందుకు వచ్చాయ్?