Hyderabad Crime News: చాక్లెట్ దొంగతనం చేశాడనే కోపంతో ఓ యజమాని పదేళ్ల బాలుడిపై అమానుషంగా ప్రవర్తించాడు. చిన్న పిల్లాడు అని కూడా చూడకుండా అతడి బట్టలు విప్పేసి ఒళ్లంతా కారం పొడి చల్లి హింసించాడు. ముఖ్యంగా మర్మాంగంపై కారం పోస్తూ రాక్షసానందాన్ని పొందాడు. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది.


హైదరాబాద్ హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈనెల 19వ తేదీన ఈ దారుణం చోటు చేసుకుంది. అఫ్జల్ సాగర్ కట్టమైసమ్మ దేవాలయానికి దగ్గరలో ఉన్న అబ్రహం కిరాణా దుకాణం ముందు ఓ బాలుడు ఉన్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఆ పదేళ్ల బాలుడు చాలా సేపటి నుంచి అక్కడక్కడే ఆడుకున్నాడు. షాపులోంచి చాక్లెట్లు దొంగిలించావంటూ షాపు యజమాని కృష్ణకాంత్(28) బాలుడిని పట్టుకున్నాడు. సమీపంలోనే ఉన్న తన ఇంటిపైకి తీసుకెళ్లి దుస్తులు విప్పించాడు. కాళ్లు చేతులను తాడుతో కట్టి నగ్నంగా మిద్దెపై కూర్చోబెట్టారు. ఆపై బాలుడి కళ్లల్లో, మర్మాంగంపై కారం చల్లాడు. బాలుడికి ఏడ్చేందుకు కూడా ఓపిక లేక అమ్మా, అమ్మా అంటూ రోదించాడు. 


దండం పెడతాను వదిలేయమంటూ కాళ్లావేళ్లా పడ్డాడు. అయిన అతడు కనికరించలేదు. బాలుడి రోదనను వీడియో తీసి సోషన్ మీడియాలో పెట్టాడు. ఇది కాస్తా వైరల్ అవ్వడంతో విషయం తల్లిదండ్రులకు తెలిసింది. తమ కుమారుడిని ఇంత ఘోరంగా హింసించిన షాపు యజమాని కృష్ణ కాంత్ పై హబీబ్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


తమ కుమారుడిపై అమానుషంగా ప్రవర్తించిన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సెక్షన్ 324, 342, 506, 12 రెడ్ విత్ 11 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మంగళవారం నిందితుడు కృష్ణ కాంత్ ను అదుపులోకి తీసుకొని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు. 


సెల్‌ఫోన్‌లో క్యాసినో ఆట, 92 లక్షలు గోవిందా! ఆ డబ్బులు ఎక్కడివో తెలిస్తే షాక్!


సెల్ ఫోన్ లో క్యాసినో ఆడే కుర్రాడు చేసిన పని తెలిస్తే అంతా ముక్కున వేలేస్కోవాల్సిందే. భూసేకరణ కింద ప్రభుత్వం ఇచ్చిన డబ్బును క్యాసినో గేమ్ ఆడుతూ పోగొట్టుకున్నాడు. వందలు వేళల్లో కాదండోయ్... ఏకంగా 92 లక్షల రూపాయలను స్వాహా చేసేశాడు. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని అలసత్వంగా చేసుకొని కుటుంబాన్ని రోడ్డున పడేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. 


భూసేకరణ కింద 1.05 కోట్లు..


రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన చన్ వళ్లి శ్రీనివాస్ రెడ్డి, విజయలక్ష్మీ దంపతులకు ఇద్దరు కుమారులు.  పెద్ద కుమారుడు శ్రీపాల్ రెడ్డి హైదరాబాద్ లో బీటెక్ చదువుతుండగా, 19 ఏళ్ల చిన్న కుమారుడు నిజాం కళాశాలలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే శ్రీనివాస్ రెడ్డికి ఉన్న పదెకరాల భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ పిల్లలను చదివించుకుంటున్నారు.  ఇటీవల ప్రభుత్వం టీఎస్ఐఐసీకీ ఆ భూములను అప్పగించింది. భూసేకరణ కింద ఎకరాకు రూ.10.5 లక్షలు చొప్పున పరిహారం ఇచ్చింది. శ్రీనివాస్ రెడ్డి కుటుంబానికి దాదాపు రూ.1.05 కోట్లు వచ్చింది. ఈ డబ్బుతో శ్రీనివాస్ రెడ్డి శంషాబాద్ మండలం మల్లాపూర్ వద్ద అర ఎకరా భూమిని కొనుగోలు చేసేందుకు రూ.70 లక్షలకు ఒకరితో బేరం కుదుర్చుకున్నారు. అడ్వాన్సుగా 20 లక్షల రూపాయలను చెల్లించారు. 


ఒకరికి తెలియకుండా ఒకరి నుంచి డబ్బులు తీసుకున్న కుమారుడు





మిగిలిన 85 లక్షల రూపాయలను తన పేరిట, తన భార్య పేరిట రూ.42.5 లక్షల చొప్పున జమ చేశారు. అప్పటికే వారి చిన్న కుమారుడు హర్ష వర్ధన్ రెడ్డి ఫోన్ లో కింగ్ 567 క్యాసినో పేరుతో ఆన్ లైన్ గేమ్ ఆడుతున్నాడు.  పరిహారంగా వచ్చిన డబ్బు విషయం తెలుసుకున్నాడు. కొత్తగా కొనుగోలు చేసిన భూమికి సంబంధించి యజమానికి డబ్బు ఇస్తానని చెప్పి తండ్రి దగ్గర నుంచి రూ.42.5 లక్షలను తన బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకున్నారు. తల్లి విజయలక్ష్మికి కూడా ఇదే విషయం చెప్పడంతో ఆమె బ్యాంకు ఖాతాలోని రూ. 42.5 లక్షలను విత్ డ్రా చేసి ఇచ్చింది. అయితే హర్ష వర్ధన్ ఈ డబ్బును యజమానికి ఇవ్వకుండా... ఆన్ లైన్ గేము లు ఆడేందుకు ఉపయోగించాడు. 


గ్రామస్థుడి వద్ద రూ.7 లక్షల అప్పు


దఫదఫాలుగా ఆన్ లైన్ లో గేమ్ ఆడుతూ.. 42.5 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు. ఆపై తల్లి ఖాతాలో ఉన్న ఈ విషయం ఎవరికీ చెప్పలేదు. ఆ తర్వాత ఇంట్లో ఉంచిన సొమ్మును తన అకౌంట్ లో పలుమార్లు డిపాజిట్ చేసుకొని ఆటలో కోల్పోయాడు. డబ్బు గురించిన గట్టిగా నిలదీసి అడగేసిరికి ఆన్ లైన్ గేమ్ ఆడి పోగొట్టుకున్నట్లు తల్లిదండ్రులకు చెప్పాడు. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ. 7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. అతడు గ్రామంలోని మరొకరి వద్ద రూ.7 లక్షలు అప్పు చేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ నుంచి రూ.92 లక్షలు పోగొట్టుకున్నాడు. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత డబ్బు పోవడంతో ఏం చేయాలో పాలుపోని కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. డబ్బు పోగొట్టినందుకు కన్న కొడుకును ఏమైనా అంటే ఏం చేసుకుంటాడో అని వాళ్లలో వాళ్లే కుమిలిపోతున్నారు.