Taj Mahal News: తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా? నోటీసులు ఎందుకు వచ్చాయ్?

ABP Desam Updated at: 21 Dec 2022 01:21 PM (IST)
Edited By: Murali Krishna

Taj Mahal News: ఆస్తి పన్ను, నీటి పన్ను కట్టాలని తాజ్ మహల్‌కు నోటీసులు రావడంపై అధికారులు ఏమంటున్నారు?

తాజ్‌మహల్‌కు పన్ను ఉంటుందా?

NEXT PREV

Taj Mahal News: ప్రపంచ ప్రఖ్యాత కట్టడమైన తాజ్‌మహల్‌కు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఆస్తి, నీటి పన్నుగా దాదాపు రూ.2 కోట్లు చెల్లించాలని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్కియాలజికాల్ సర్వే అఫ్ ఇండియాకు పంపింది. 15 రోజుల వ్యవధిలోగా పన్నులు చెల్లించాలని, లేని పక్షంలో ఆస్తులను జప్తు చేస్తామని నోటిసుల్లో పేర్కొంది.


ఆగ్రా మున్సిపల్ అధికారులు ఈ ఏడాది, పోయిన ఆర్ధిక సంవత్సరానికి పన్నులను లెక్కించి రెండు నోటిసులు జారి చేసారు. నోటిసుల్లోని అంశాల ప్రకారం 2022 మార్చి 31 వరకు రూ.88,784  పన్ను మొత్తం కాగా, సమయానికి కట్టలేదు అని రూ.47,983 రూపాయలను వడ్డీ కింద లెక్కించారు. 2022-23 ఆర్దిక సంవత్సరానికి గాను రూ.11,098 ఆస్తి పన్నుగా విధించారు. ఇలా విధించిన మొత్తం పన్నుల విలువ రూ.1,47,826గా ఇండియా టుడే వెల్లడించింది. 


ఎందుకు?


ఈ నోటీసులపై ఆగ్రా మున్సిపల్ కమిషనర్ నిఖిల్ టీ ఫుండేను ప్రశ్నించగా తనకు తెలియదని సమాధానమిచ్చారు.



తాజ్ మహల్‌కు సంబంధించి జారి చేసిన పన్ను నోటిసుల గురించి నాకు తెలియదు. పన్నుల లెక్కింపు కోసం రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్న జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టం (జీఐఎస్) సర్వే లో  భాగంగా నోటిసులు జారీ అయ్యుంటాయి. గవర్నమెంట్ భవనాలు, మతపరమైన ప్రదేశాలు వంటి అన్ని ప్రదేశాలకు వారు బకాయి ఉన్న మొత్తంతో నోటిసులు జారి చేసారు. చట్టపరంగా రాయితీలు ఇస్తున్నాము. తాజ్ మహల్‌కు సంబంధించి నోటిసులు జారి అయ్యుంటే వారిచ్చే సమాధానాన్ని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాము.                                                - నిఖిల్, ఆగ్రా మున్సిపల్ కమిషనర్


తాజ్ మహల్ పన్ను బకాయిలపై ఆగ్రా మున్సిపాలిటీ జారి చేసిన నోటిసులపై ఆర్కియాలజికల్ సర్వే అఫ్ ఇండియా సుపెరింటెండింగ్ అర్కియాలజిస్ట్ రాజ్ కుమార్ పటేల్ స్పందించారు.


తెలియకుండా



ఇది ఆగ్రా మున్సిపాలిటీ వారి తప్పిదం. ఇలాంటి కట్టడాలపై ఆస్తి పన్ను ఉండదు. జీఐఎస్ సర్వే ఆధారంగా పన్నులు విధించే బాధ్యత ఒక ప్రైవేటు కంపెనీకి అప్పగించినట్టు మాకు తెలిసింది. మేము వాణిజ్యపరమైన పనుల కోసం నీటిని వాడుకోము కాబట్టి  నీటి పన్ను కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. పరిసరాల్లో పచ్చదనంకై మొక్కల కోసం నీటిని వినియోగిస్తాము. నీటిపన్ను, ఆస్తిపన్ను అని తాజ్ మహల్‌కు నోటిసులు ఇవ్వడం ఇదే తొలిసారి. పొరపాటుగా పంపించి ఉంటారు.. - రాజ్ కుమార్ పటేల్, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా


ప్రపంచంలోని ఏడు వింతల్లో తాజ్ మహల్ ఒకటి. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్‌పై ప్రేమతో దీన్ని నిర్మించాడు. 1632 సంవత్సరంలో ప్రారంభమై,1653లో పూర్తయిన ఈ నిర్మాణానికి  నాలుగు శతాబ్దాలకు పైగా చరిత్ర ఉంది. ఈ నిర్మాణం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రాలో ఉంది. దీనికి 1983లో యునెస్కో గుర్తింపు కూడా లభించింది .ప్రపంచవ్యాప్తంగా ప్రజలు  దీనిని ప్రేమకు చిహ్నంగా భావిస్తారు.


Also Read: Bharat Jodo Yatra: 'జోడో యాత్రను వాయిదా వేసుకోండి'- రాహుల్ గాంధీకి ఆరోగ్యమంత్రి లేఖ

Published at: 21 Dec 2022 01:21 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.