Stock Market Opening 21 December 2022:
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం స్వల్ప నష్టాల్లో మొదలయ్యాయి. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు వచ్చాయి. దాంతో మదుపర్లు ఆచితూచి కొనుగోళ్లు చేపట్టారు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 38 పాయింట్ల నష్టంతో 18,346 బీఎస్‌ఈ సెన్సెక్స్ (BSE Sensex) 136 పాయింట్ల నష్టంతో 61,565 వద్ద కొనసాగుతున్నాయి.
BSE Sensex
క్రితం సెషన్లో 61,702 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్ నేడు 61,993 వద్ద మొదలైంది. 61,555 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 62,006 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10 గంటలకు 136 పాయింట్ల నష్టంతో 61,565 వద్ద కొనసాగుతోంది.
NSE Nifty
మంగళవారం 18,385 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 18,435 వద్ద ఓపెనైంది. 18,345 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 18,473 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 38 పాయింట్ల నష్టంతో 18,346 వద్ద ట్రేడవుతోంది.
Nifty Bank
నిఫ్టీ బ్యాంక్ స్వల్ప నష్టాల్లో ఉంది. ఉదయం 43,525 వద్ద మొదలైంది. 43,289 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 43,614 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 63 పాయింట్లు పతనమై 43,296 వద్ద చలిస్తోంది.
Gainers and Lossers
నిఫ్టీ 50లో 18 కంపెనీలు లాభాల్లో 31 నష్టాల్లో ఉన్నాయి. దివిస్ ల్యాబ్, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. బ్రిటానియా, అదానీ ఎంటర్‌ప్రైజెస్, హీరోమోటో, ఓఎన్‌జీసీ, భారతీ ఎయిర్‌టెల్ నష్టపోయాయి. ఐటీ, మెటల్, ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, హెల్త్‌కేర్ రంగాలు ఎగిశాయి. బ్యాంకు, ఆటో, ఫైనాన్స్, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, కన్జూమర్ డ్యురబుల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఎరుపెక్కాయి.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే! మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్ల పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి రాబడి మారుతుంటుంది. ఫలానా ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని ఏబీపీ దేశం చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టేముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.