LGBT Rights in Singapore:
ప్రధాని ప్రకటన..
ఎన్నో సంవత్సరాల డిబేట్ తరవాత సింగపూర్ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. హోమోసెక్సువాలిటీని (Homosexuality) చట్టబద్ధం చేయనుంది. గే సెక్స్‌పై నిషేధం విధించిన 377A చట్టాన్ని రద్దు చేయనుంది. ఇప్పటి నుంచి హోమోసెక్సువాలిటీ లీగల్ కానుంది. ప్రధానమంత్రి లీ సీన్ లూంగ్ ( Lee Hsien Loong) ఆదివారం టెలివిజన్ వేదికగా ఈ ప్రకటన చేశారు. భారత్, థాయ్‌లాండ్, తైవాన్ తరవాత LGBT హక్కులపై ఈ తరహా నిర్ణయం తీసుకున్న దేశంగా రికార్డుకెక్కింది సింగపూర్. ఈ నిర్ణయంపై సింగపూర్ వాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే...హోమోసెక్సువాలిటీని "లీగల్"గా పరిగణించినా...పెళ్లి విషయంలో మాత్రం నిషేధం కొనసాగనుంది. మహిళ, పురుషుడు మాత్రమే వివాహ బంధంతో ఒకటి కావాలని...ఒకే జెండర్‌కు చెందిన వాళ్లు వివాహం చేసుకోవాలన్న అంశంపై సింగపూర్ వాసులు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని స్థానిక మీడియా తెలిపింది. అంటే.. గే మ్యారేజ్‌లు (Gay Marriage) మాత్రం కుదరవు. LGBT యాక్టివిస్ట్‌లు దీనిపైనే కాస్త అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కన్జర్వేటివ్ గ్రూప్ "ప్రొటెక్ట్ సింగపూర్" (Protect Singapore)కూడా అసహనంతో ఉంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని అంటోంది. హెటెరోసెక్సువల్ మ్యారేజ్ (Heterosexual Marriage) అంటే ఏంటో రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించాలని, LGBTని ప్రమోట్ చేసే చట్టాలను రద్దు చేయాలని తెలిపింది.
ఎన్నో రోజులుగా డిబేట్..
సింగపూర్‌లో ఎన్నో రోజులుగా ఈ హోమోసెక్సువాలిటీపై చర్చ జరుగుతోంది. 377Aని రద్దు చేయాలని ఓ వర్గం నుంచి డిమాండ్ వినిపించింది. అయితే...అక్కడి ప్రభుత్వం ఈ చట్టాన్ని రద్దు చేయకుండానే హోమోసెక్సువాలిటీకి సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవాలని భావించింది. కానీ...ప్రధాని లీ సీన్ మొత్తం ఈ చట్టాన్నే రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. "ఇది సరైన నిర్ణయం అని అనుకుంటున్నాను. ఎక్కువ మంది సింగపూర్ వాసులు ఇదే కోరుకుంటున్నారు" అని నేషనల్ డే ర్యాలీ స్పీచ్‌లో అన్నారు. సింగపూర్ వాసులంతా, ముఖ్యంగా యువత "గే" వర్గాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే తాము చట్టాన్ని రద్దు చేశామని, ఈ నిర్ణయం ఆ వర్గానికి సంతృప్తినిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే...ఏ రోజున ఈ చట్టాన్ని రద్దు చేస్తారని మాత్రం ప్రకటించలేదు.
Also Read: Bandi Sanjay Padayatra : ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయండి, బండి సంజయ్ కు పోలీసులు నోటీసులు!
Also Read: Twin Towers : 28వ తేదీన కళ్లార్పకుండా చూడండి - నోయిడాలో 3700 కిలోల బాంబులు పేల్చబోతున్నారు !