Hyderabad Crime : మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పరిధిలోని చింతల్ లో దారుణం జరిగింది. ఇద్దరు యువకుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘర్షణలో ఓ యువకుడు బీర్ సీసా పగలగొట్టి మరో యువకుడిపై దాడి చేశాడు. సోమవారం అర్థరాత్రి ఓ పాన్ వద్ద గౌతమ్(28),షాబాజ్ (30)అనే ఇద్దరు యువకులు సేవిస్తున్నారు. అదే సమయంలో పాన్ షాప్ వద్దకి విద్యాసాగర్(27), సంధీప్(27) అనే యువకులు వచ్చారు. విద్యాసాగర్,షాబాజ్ ల మధ్య ఘర్షణ జరిగింది. షాబాజ్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి విద్యాసాగర్ గొంతులో పొడిచాడు. ఈ దాడిని అడ్డుకున్న సందీప్ కి కూడా గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని చింతల్ లోని ఆర్ఎన్ఆర్ హాస్పిటల్ కి తరలించారు. ఈ దాడిలో విద్యాసాగర్ మెడ నరాలు తెగి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు అంటున్నారు.
అసలేం జరిగింది?
అర్ధరాత్రి మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య తలెత్తిన ఘర్షణ పరస్పర దాడికి దారితీసింది. ఈ దాడిలో ఇద్దరికి గాయాలయ్యాయి. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్ పాషా పాన్ షాప్ వద్ద సోమవారం అర్ధరాత్రి 1.30 మద్యం మత్తులో ఇద్దరు వ్యక్తుల మధ్య ఘర్షణ జరిగింది. పాన్ షాప్ వద్ద గౌతమ్(28), షాబాజ్ (30) లు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో పాన్ షాప్ వద్దకి చేరుకున్న విద్యాసాగర్(35), సంధీప్(27) లు మద్యం సేవిస్తున్న షాబాజ్ తో ఘర్షణ పడ్డారు. వీరిమద్య మాటామాటా పెరగడంతో షాబాజ్ చేతిలో ఉన్న బీర్ బాటిల్ పగలగొట్టి విద్యాసాగర్ గొంతులో పొడిచాడు. గొడవను అడ్డుకునే ప్రయత్నంలో సందీప్ కు సైతం స్వల్పగాయాలు అయ్యాయి. స్థానికులు వీరిని చింతల్ లోని ఆర్ఎన్ఆర్ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో విద్యాసాగర్ మెడనరాలు తెగిపోయాయి. పరిస్థితి విషయంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీరి మధ్య పాతకక్షలేమైనా ఉన్నాయా లేక మద్యం మత్తులో హత్యాయత్నం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకుని చంపిన తండ్రి
దేశాన్నిరక్షించాల్సిన సైనికుడు పైఅధికారులతో గొడవలు పడి పలుమార్లు సస్పెన్డ్ అయ్యాడు. అక్కడితో ఆగకుండా ఇంటికి వచ్చి తన తల్లిదండ్రులకు చిత్రహింసలకు గురి చేశాడు. గ్రామంలోని చిన్నా పెద్దలపై దాడులు చేస్తూ భయాందోళనలు కలిగించాడు. ఇంత సహించి భరించినా చివరకు ఆదివారం వేకువజామున 3.30 గంటలకు తన తల్లిని చావ బాదాడు. ఆ తర్వాత భుజంపై వేసుకుని ఇంటి వెనుక భాగంలో ఉన్న పొలంలో విసిరి పడేశాడు.
స్తంభానికి కట్టేసి కొట్టి
ఇది చూసి తట్టుకోలేని తండ్రి తన కుమారుడ్ని సమీపంలోని కరెంట్ స్తంభానికి తాళ్లతో కట్టి బంధించాడు. తన భార్య పరిస్థితిని గమనించి 108 వాహనంలో శ్రీకాకుళం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాడు. తాళ్లతో కట్టి ఉంచిన కుమారుడు అంతటితో ఆగక తన తండ్రిని దుర్భాషలాడుతూ నువ్వు తిరిగి వచ్చేలోగా అందర్నీ చంపేస్తానని బెదిరించాడు. ఇది సహించలేని తండ్రి ఇనుప రాడ్డుతో బలంగా తలపై కొట్టడంతో అతను అక్కడికి అక్కడే మరణించాడు. వెను వెంటనే తండ్రి పోలీసులకు జరిగిన ఉదంతం అంతా వివరించి లొంగిపోయాడు. ఇది నరసన్నపేట మండలం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం కిల్లాం గ్రామంలో ఈ సంఘటన జరిగింది.
Also Read : పిల్లలతో ప్రిన్సిపాల్ అసభ్య ప్రవర్తన- చితక్కొట్టిన ప్రజలు
Also Read : ఆ నలుగురి ఆత్మహత్య వెనుక ఆ నలుగురు, సూసైడ్ లెటర్‌లో కీలక సమాచారం?