తెలంగాణలోని ములుగు జిల్లాలో ఉన్న ఫారెస్ట్ కాలేజ్ & రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ వివిధ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 27 పోస్టులను భర్తీచేయనున్నారు. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 6 నుంచి ప్రారంభం కానుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుకింద రూ.500 చెల్లించి సెప్టెంబరు 30లోపు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారానే పరీక్ష ఫీజు చెల్లించాలి.    


పోస్టుల వివరాలు...


* టీచింగ్ ఫ్యాకల్టీలు


మొత్తం పోస్టులు: 27


1) ప్రొఫెసర్: 02


విభాగాలు: వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, నేచురల్ రిసోర్స్ మేనేజ్‌మెంట్.


అర్హత:


* 55 శాతం మార్కులతో ఎంఎస్సీ (వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


* పీహెచ్‌డీ (వైల్డ్ లైఫ్ సైన్సెస్/ వైల్డ్ లైఫ్ బయాలజీ/ వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్/ఫారెస్ట్రీ) ఉండాలి.అనుభవం: కనీసం 10 సంవత్సరాలు.


TSPSC Notification: తెలంగాణలో DAO పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, పూర్తి వివరాలు ఇలా!


2) అసోసియేట్ ప్రొఫెసర్: 04


విభాగాలు: అగ్రికల్చరల్ ఎకనామిక్స్, ఫారెస్ట్ యుటిలైజేషన్, సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్.


అర్హత:


* 55 శాతం మార్కులతో  ఎంఎస్సీ (అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్రీ/సాయిల్ సైన్స్ అండ్ అగ్రికల్చరల్ కెమిస్ట్రీ/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/  ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ & ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్) డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.


* పీహెచ్‌డీ (అగ్రికల్చర్/ అగ్రికల్చరల్ ఎకనామిక్స్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్స్/  ఫారెస్ట్ బయోటెక్నాలజీ/ ట్రీ బ్రీడింగ్ & ఇంప్రూవ్‌మెంట్/ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్) ఉండాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి. నెట్/స్లెట్/సెట్ అర్హత ఉండాలి.


అనుభవం: కనీసం 8 సంవత్సరాలు.


3) అసిస్టెంట్ ప్రొఫెసర్: 21


విభాగాలు: జియో ఇన్‌ఫర్మాటిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ట్రీ బ్రీడింగ్ అండ్ ఇంప్రూవ్‌మెంట్, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, వైల్డ్ లైఫ్ మేనేజ్‌మెంట్, అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్, ఆగ్రో ఫారెస్ట్రీ, బోటనీ, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్, ఫారెస్ట్రీ, వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ మేనేజ్‌మెంట్, ఫారెస్ట్ బయాలజీ, ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్, వైల్డ్‌లైఫ్ సైన్స్.


అర్హత:


* 55 శాతం మార్కులతో  ఎంఎస్సీ (జియో-ఇన్‌ఫర్మేషన్ సైన్స్ & ఎర్త్ అబ్జర్వేషన్/జియో స్పేషియల్ టెక్నాలజీ/ఫారెస్ట్రీ/సిల్వీకల్చర్ అండ్ అగ్రో ఫారెస్ట్రీ/ ఫారెస్ట్ జెనెటిక్స్ అండ్ ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ ఫారెస్ట్ జెనెటిక్ రిసోర్సెస్/ ఫారెస్ట్ బయాలజీ & ట్రీ ఇంప్రూవ్‌మెంట్/ప్లాంట్ బయోటెక్నాలజీ/ఫారెస్ట్ మేనేజ్‌మెంట్/వైల్డ్ ‌లైఫ్ మేనేజ్‌మెంట్/ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్/ బోటనీ తదితరాలు..)


అనుభవం: నిబంధనల మేరకు.


TSPSC Notification: 113 అసిస్టెంట్‌ మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టులు..


వయోపరిమితి: 21 నుంచి 61 సంవత్సరాల మధ్య ఉండాలి. 01.07.2001 – 02.07.1961 మధ్య జన్మించి ఉండాలి.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.


ఎంపిక విధానం: నిబంధనల ప్రకారం అభ్యర్థులను ఎంపికచేస్తారు.


జీతం: ప్రొఫెసర్ పోస్టులకు రూ.1,44,200; అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు రూ. 1,31,400; ప్రొఫెసర్ పోస్టులకు రూ.57,700 ఇస్తారు.


ముఖ్యమైన తేదీలు..


* నోటిఫికేషన్ వెల్లడి: 22.08.2022


* ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.09.2022


* ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 30.09.2022


Notification


Website


Also Read: SSC Stenographer Exam: ఇంటర్ అర్హతతో 'స్టెనోగ్రాఫ‌ర్' ఉద్యోగాలు, వెంటనే దరఖాస్తు చేసుకోండి!
SSC Stenographer Exam: స్టాఫ్ సెలక్షన్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) స్టెనోగ్రాఫ‌ర్ ఎగ్జామినేష‌న్ - 2022 ప్రక‌ట‌న‌ను విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ ప్రభుత్వ విభాగాల్లో స్టెనోగ్రాఫ‌ర్ (గ్రేడ్-సి, గ్రేడ్-డి) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇంటర్ విద్యార్హత ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైపింగ్ తెలిసి ఉండాలి. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్, మెడిక‌ల్ ఎగ్జామినేష‌న్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగ నియామకాలు చేపడతారు.
స్టెనోగ్రాఫ‌ర్ గ్రేడ్-సి, గ్రేడ్-డి ఎగ్జామినేషన్-2022 నోటిఫికేషన్ పూర్తి వివరాలు..



Also Read:


బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్‌లో ఉద్యోగాలు, అర్హతలివే!
ముంబ‌యిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్ (బార్క్) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా నర్సు, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్-ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు. సరైన అర్హతలు ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.150 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు సెప్టెంబరు 12 చివరితేదీగా నిర్ణయించారు. 
నోటిఫికేషన్, తదితర వివరాల కోసం క్లిక్ చేయండి..


 


మరిన్ని ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి...