కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు 3 రోజుల పోలీస్ రిమాండ్ విధిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర్‌ప్రదేశ్ లఖింపుర్ ఖేరి ఘటనలో ఆశిష్ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ కేసుకు సంబంధించి సోమవారం విచారణ చేపట్టింది న్యాయస్థానం.
విచారణకు సహకరించట్లేదు..
ఈనెల 9న 12 గంటల పాటు ఆశిష్‌ను విచారించారు పోలీసులు. అనంతరం ఆశిష్ మిశ్రాను అరెస్ట్ చేశారు. ఆశిష్‌పై సెక్షన్ 302, 304ఏ, 147, 148, 149, 279, 120బీల కింద కేసు నమోదు చేశారు పోలీసులు. అయితే నిందితుడు దర్యాప్తునకు సహకరించట్లేదని పోలీసులు పేర్కొన్నారు. ఈ కారణంగా పోలీస్ రిమాండ్‌కు అనుమతించాలని కోరుతూ కోర్టుకు దరఖాస్తు చేశారు.
ఆశిష్ ఏ తప్పూ చేయలేదని.. ఘటనకు సంబంధించిన 100కు పైగా ఫొటోలను, వీడియోలను పోలీసులకు ఇప్పటికే అందించామని నిందితుడి తరఫు న్యాయవాది తెలిపారు.
ఇదీ ఘటన..
కేంద్రం తీసుకువచ్చిన మూడు సాగు చట్టాలపై నిరసన వ్యక్తం చేస్తోన్న రైతులపైకి ఓ వాహనం దూసుకెళ్లిన ఘటనలో నలుగురు అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. ఆ హింసాత్మక ఘటనలో మరో ఇద్దరు భాజపా కార్యకర్తలు, ఓ డ్రైవర్ సహా ఓ జర్నలిస్ట్ ప్రాణాలు కోల్పోయాడు. ఆగ్ గత ఆదివారం జరిగిన ఈ ఘటన యావత్ దేశాన్నే షాక్‌కు గురి చేసింది.
అయితే రైతులపైకి దూసుకువచ్చిన కారులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ ఆరోపణలను అజయ్ మిశ్రా ఖండించారు.
Also Read: PM Modi Launches ISPA: అంతరిక్ష రంగంలో సంస్కరణలు అందుకే చేశాం: ప్రధాని మోదీ
Also Read: ఈ కాంబినేషన్ ఫుడ్స్‌ని పొరపాటున కూడా కలిపి తినకండి... స్లో పాయిజన్ అయ్యే అవకాశం ఉంది
Also Read: Aryan Khan Drug Case: ఆర్యన్ ఖాన్‌కు మూడోసారి కూడా బెయిల్ నిరాకరణ
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి