Kolkara Doctor Murder Case: కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజ్ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సందీప్ ఘోష్‌ను ఇన్‌స్టిట్యూట్‌లో ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం అరెస్టు చేసింది. సందీప్ ఘోష్ అరెస్ట్ అయిన గంటలోపే సీబీఐ అధికారులు ఆయన సెక్యూరిటీ గార్డును, ఇద్దరు వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. ఆర్ జీ కర్ ఆస్పత్రిలో హత్య కేసు  జరిగిన 24 రోజుల తర్వాత జరిగిన ఈ దారుణ ఘటనలో ఇది రెండో అరెస్ట్. అంతకుముందు, కోల్‌కతా పోలీసు పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్‌ను కోల్‌కతా పోలీసులు అరెస్టు చేసి, వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్య చేసిన కేసులో కేంద్ర ఏజెన్సీకి అప్పగించారు.
   
సీబీఐ కస్టడీ
సీబీఐ వారిని మంగళవారం ప్రత్యేక కోర్టులో హాజరుపరిచింది. ఈ నేపథ్యంలో వారికి ఎనిమిది రోజుల సీబీఐ కస్టడీకి పంపుతూ   ప్రత్యేక కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. అనంతరం సీబీఐ కోర్టు కేసును సెప్టెంబర్ 10కి వాయిదా వేసింది. అయితే ఈ కేసును విచారించేందుకు  పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. అయితే వారిని ఎనిమిది రోజుల కస్టడీకి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. ఈ సందర్భంగా నలుగురిలో ఒకరైన అఫ్సర్ అలీఖాన్ తనకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. ఆగస్టు 9న కోల్‌కతాలోని ఆర్‌జి కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ డాక్టర్ హత్యకు గురయ్యారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. హత్య ఘటన జరిగిన కొన్ని గంటల తర్వాత ప్రొ.సందీప్ ఘోష్ రాజీనామా చేశారు. తరువాత, X ప్లాట్‌ఫారమ్‌లో ఈ హత్య సంఘటనపై స్పందిస్తూ మృతురాలు తన కుమార్తెతో సమానం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకూడదని ఆకాంక్షించారు.


ఆగమేఘాలపై ఆదేశాలు
మరోవైపు ఈ కళాశాల ప్రిన్సిపాల్ పదవికి రాజీనామా చేసిన కొద్ది గంటలకే ప్రొ.మమతా బెనర్జీ ప్రభుత్వం సందీప్ ఘోష్ ను మరో కీలక పదవిలో నియమిస్తూ ఆగమేఘాలపై ఉత్తర్వులు జారీ చేసింది. ట్రైనీ డాక్టర్ హత్య కేసు విచారణ చేపట్టిన కోల్ కతా హైకోర్టు.. సందీప్ ఘోష్ ను సెలవుపై పంపాలని ఆదేశించింది.  మరోవైపు, సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారంటూ సదరు కాలేజీ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అక్తర్ అలీ దాఖలు చేసిన ఫిర్యాదు మేరకు సీబీఐ ఈ చర్యలు తీసుకుంది. హత్య కేసులో ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ట్రైనీ డాక్టర్ ప్రొ.సందీప్ ఘోష్ ను సీబీఐ వరుసగా 15 రోజుల పాటు విచారించింది. అనంతరం ఆర్థిక అవకతవకల కేసులో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.



హిందుస్థాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, అరెస్టయిన ముగ్గురిలో సందీప్ ఘోష్ సెక్యూరిటీ గార్డు అధికారి అలీ ఖాన్, ఇద్దరు హాస్పిటల్ వెండర్లు బిప్లవ్ సింఘా, సుమన్ హజ్రా ఉన్నారు. ఆగస్టు 23న, కలకత్తా హైకోర్టు ఆసుపత్రిలో జరిగిన ఆర్థిక అవకతవకలపై దర్యాప్తును రాష్ట్రం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నుండి సిబిఐకి అప్పగించాలని ఆదేశించింది. 


Read Also : Kolkata woman doctor rape and murder: ముందే చంపి ఆ తర్వాత రేప్ చేశారా ? - కోల్ కతా డాక్టర్ హత్యాచారం కేసులో ఎన్నో అనుమానాలు