Kolkata doctor autopsy reveals she was throttled to death :  నన్ను ఉరి తీసుకోండి అని కోల్‌కతా జూనియర్ వైద్యురాలి హత్య కేసులో అరెస్టు అయిన నిందితుడు పోలీసులకు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. నిజానికి ఉరి అనేది అతనికి చాలా చిన్న శిక్ష  అవుతుందని.. జూనియర్ వైద్యురాలిని చంపిన వైనం చూస్తే.. ఎవరికైనా అర్థమవుతుంది. అంత కంటే ఎక్కువ కోపం వస్తుంది. ఓ మనిషి ఇంత క్రూరంగా మరో మనిషిని హింసించి చంపగలరా అనేలా.. చంపాడని అటాప్సీ రిపోర్టులో బయటపడింది. 


ట్రైనీ డాక్టర్ శరీర భాగాలన్నింటిలనూ  గాయాలు 


కోల్‌కతాలోని ఆర్జీకర్ ఆస్పత్రిలోని జూనియర్ వైద్యురాలు హత్యకు గురైన అంశంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా ఆమె అటాప్సీ రిపోర్టు వెలుగులోకి వచ్చింది. ఆ జూనియర్ వైద్యురాలి ప్రతి భాగంలోనూ గాయాలున్నట్లుగా గుర్తించారు. చిటికెన వెలు నుంచి పెదవుల వరకూ ప్రతి భాగంలోనూ గాయాలు ఉన్నట్లుగా అటాప్సీలో వెల్లడయింది. నోరు, ముక్కులపై తీవ్ర స్థాయిలో దాడి జరగడంతో బలంగా గాలయ్యాయి. రెండు కళ్లు, నోరు, ప్రైవేటు భాగాల నుంచి కూాడ రక్తస్రావం అయినట్లుగా గుర్తించారు. చివరికి కాళ్లు, చేతుల వెళ్ల గోళ్లపైనా కూడా గాయాలున్నాయి.             


గ్రౌండ్‌లో క్రికెట్ ఆడుతూ పోల్ పట్టుకున్న బాలుడు, ఎలక్ట్రిక్ వైర్ తగిలి అక్కడికక్కడే మృతి


చనిపోయిన తర్వాత రేప్, హింసకు పాల్పడ్డాడా ?           


హతురాలి తల్లితో పాటు ఇద్దరు సాక్షుల సమక్షంలో అటాప్సీ నిర్వహించారు. అలాగే మొత్తం వ్యవహారాన్ని వీడియో తీశారు. తీవ్ర గాయాలు అయిన తర్వాతనే ఆ వైద్యురాలు చనిపోయి ఉండదని.. ముందుగా హత్య చేసి ఆ తర్వాత హింసించి ఉంటారని.. అత్యాచారం కూడా ఆమె చనిపోయిన తర్వాతనే చేసి ఉంటారని వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. సైకో బారిన పడిన యువతి అంత తీవ్రమైన వేదన అనుభవించి ఉంటుందో కదా అన్న వేదన అందరిలోనూ వ్యక్తమవుతోంది. 


దేశవ్యాప్తంగా నిరసనలు             


మహిళా వైద్యురాలి హత్యపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. వర్క్ ప్లేస్ లో రక్షణ ఉండాలని వైద్యులు దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల వైద్య సేవల్ని నిలిపి వేస్తున్నారు. విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలోనూ వైద్యులు అత్యవసర సేవలు మినహా ఓపీ సేవల్ని నిలిపివేశారు.                          


ఎర్రకోట పైనే ప్రధాని జెండా ఎందుకు ఎగరేస్తారు- చరిత్ర, ప్రాముఖ్యత తెలుసా ?


కేసును సీబీఐకి అప్పగించాలన్న డిమాండ్లు  


ఈ కేసులో కోల్ కతా పోలీసులు సంజయ్ రాయ్ ను అరెస్టు చేశారు. పోలీసులు దర్యాప్తును పూర్తి చేయకపోతే సీబీఐకి అప్పగించేందుకు మమతా  బెనర్జీ సిద్ధమయ్యారు. నిందితుడికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులో శిక్ష వేయాలని మమతా బెనర్జీ ప్రభుత్వం భావిస్తోంది.