ABP  WhatsApp

Kerala MP Ramya Haridas: ఓ మంచి అబ్బాయిని చూడండి- పెళ్లి చేసుకుంటా: పాటలు పాడుతూ MP రిక్వెస్ట్

ABP Desam Updated at: 02 Aug 2022 01:41 PM (IST)
Edited By: Murali Krishna

Kerala MP Ramya Haridas: ఓ మంచి తమిళ అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటానని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కేరళ ఎంపీ రమ్య హరిదాస్.

(Image Source: Twitter/@RamyaHaridasMP)

NEXT PREV

Kerala MP Ramya Haridas: కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ రమ్య హరిదాస్.. తమిళ పాటలతో హోరెత్తించారు. అంతేకాదు తమిళనాడుకు చెందిన అబ్బాయిని చూస్తే పెళ్లి చేసుకుంటానని ప్రకటించారు. 


తమిళనాడులో ఈరోడ్​లో కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్లకు శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణా కార్యక్రమానికి కేరళ ఎంపీ రమ్య హరిదాస్​తో పాటు పలువురు కాంగ్రెస్​ నాయకులు హాజరయ్యారు. ఆ సభలో మాట్లాడుతూ ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.







నేను ప్రాతినిధ్యం వహిస్తోన్న పార్లమెంట్​ పరిధిలో కొంత భాగం తమిళనాడు సరిహద్దుల్లో ఉంది. అప్పుడప్పుడు పర్యటనల్లో అక్కడకు వెళ్లినప్పుడు.. నేను తమిళంలోనే వారితో మాట్లాడతాను. అందుకే మంచి తమిళ అబ్బాయిని చూడండి. పెళ్లి చేసుకుంటాను.                               - రమ్య హరిదాస్​, కాంగ్రెస్ ఎంపీ


పాటలతో


ఈ కార్యక్రమంలో తమిళ పాటలతో అక్కడున్న సభ్యులను అలరించారు రమ్య. విశ్వ నటుడు కమల్ హాసన్, సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లోని పాటలతో హోరెత్తించారు.​ దీంతో కాంగ్రెస్ కార్యకర్తలంతా చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. 


కేరళలో ఆలతూరు​ లోక్​సభ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నారు రమ్య హరిదాస్​. 2019లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ తరఫున పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి పీకే బిజుపై 1,58,968 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు రమ్య హరిదాస్. ఎన్నికల ప్రచారంలో కూడా రమ్య హరిదాస్ పాటలు పాడి ఓటర్లను ఆకర్షించారు. ఆమె సభలకు పెద్ద ఎత్తున ప్రజలు వచ్చేవారు.


Also Read: National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో ED స్పీడు- దిల్లీలో 10 ప్రాంతాల్లో సోదాలు


Also Read: Biden on Ayman Al-Zawahiri: అమెరికన్ల జోలికొస్తే వెంటాడి, వేటాడి చంపుతాం: బైడెన్ మాస్ వార్నింగ్

Published at: 02 Aug 2022 01:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.