Kerala HC: భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు: కేరళ హైకోర్టు తీర్పు

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 02 Nov 2022 12:00 PM (IST)

Kerala HC: భర్త అంగీకారం లేకపోయినా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది.

భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవచ్చు: కేరళ హైకోర్టు తీర్పు

NEXT PREV

Kerala HC: భర్త అంగీకారం లేకున్నా ముస్లిం మహిళలు విడాకులకు దరఖాస్తు చేసుకోవచ్చని కేరళ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఇస్లామిక్ చట్టం ప్రకారం ముస్లిం మహిళలు విడాకులు తీసుకోవడానికి భర్త అనుమతి అవసరం లేదని కోర్టు పేర్కొంది.

Continues below advertisement


వివాహాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేసే ముస్లిం మహిళ హక్కును ఇస్లామిక్ చట్టం గుర్తిస్తుందని హైకోర్టు తెలిపింది. ఈ మేరకు జ‌స్టిస్ మ‌హ‌మ్మ‌ద్ ముస్తాక్‌, జ‌స్టిస్ సీఎస్ డ‌యాస్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఓ కేసులో 59 పేజీల తీర్పును ఇచ్చింది. 







భ‌ర్త అంగీకారం లేకున్నా ముస్లిం మ‌హిళలు విడాకుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఆ మ‌హిళ‌ల‌కు భర్త భ‌ర‌ణం కూడా ఇవ్వాలి. భ‌ర్త అంగీక‌రించ‌కున్నా కులా విధానాన్ని అమ‌లు చేయ‌వ‌చ్చు. ముస్లిం మ‌హిళ ఎప్పుడైనా త‌న వివాహ బంధాన్ని బ్రేక్ చేయ‌వ‌చ్చు. ప‌విత్ర ఖురాన్ కూడా ఈ విధానాన్ని అంగీక‌రిస్తుంది. భ‌ర్త అంగీకారం ఉన్నా లేకున్నా విడాకులు తీసుకోవ‌చ్చు.                                                                  -   కేరళ హైకోర్టు


Also Read: ED Summons Jharkhand CM: ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈడీ సమన్లు- అరెస్ట్ చేస్తుందా?

Published at: 02 Nov 2022 11:51 AM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.