Breaking News Telugu Live Updates: కొత్తగూడెం నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్
Breaking News Telugu Live Updates: ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా, అంతర్జాతీయంగా నేడు జరిగే వార్తల అప్‌డేట్స్, వివరాలు మీకోసం
కొల్లాపూర్ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్.
• జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించిన బండి సంజయ్.
• కొల్లాపూర్ సమగ్రాభివ్రుద్ధి కోరుతూ పాదయాత్ర చేస్తున్న బీజేపీ నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షులు సుధాకర్ రావుతో కలిసి నడుస్తున్న బండి సంజయ్.
• పాదయాత్ర అనంతరం కొల్లాపూర్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్న బండి సంజయ్
మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పర్యటన అనంతరం హైదరాబాద్ బయలు దేరిన ముఖ్యమంత్రి కేసీఆర్. పలు కార్యక్రమాలకు శంకుస్థాపన, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలను, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాయింట్స్..
టీ కాంగ్రెస్ ను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు సమావేశం నిర్వహించారు.
ముంబై బాంబ్ బ్లాస్ట్, మతకల్లోలాలు జరిగిన సమయంలో ఆయన హోంమంత్రిగా పనిచేశారు.
క్లిష్ట పరిస్థితుల్లో హోంమంత్రిగా ఠాక్రే ఎంతో సమర్థవంతంగా పని చేశారు.
వైఎస్ సీఎం గా ఉన్నప్పుడు హోంమంత్రిగా జానారెడ్డిలా... శరద్ పవార్ హయాంలో ఠాక్రే అంతటి సమర్థవంతంగా పనిచేశారు.
సమస్యలను పరిష్కరించడంలో తనదైన శైలి ప్రదర్శిస్తారని ఆయనకు గుర్తింపు ఉంది.
హాత్ సే హాత్ జోడో యాత్ర నేపథ్యంలో పార్టీలో అందరితో ఆయన మాట్లాడారు.
21న మరోసారి పర్యటించి పూర్తి స్థాయిలో హాత్ సే హాత్ జోడో యాత్ర కమిటీలను ప్రకటిస్తారు.
మాణిక్ రావు ఠాక్రే, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్
రెండు రోజులపాటు రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీలో పరిణామాలపై చర్చించాం
సీనియర్ నేతలతో మాట్లాడి, సమాచారం తీసుకున్నాం అందరూ కలిసికట్టుగా పని చేయాలని సూచించాం.
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. కార్యకర్తలు, నాయకులు బలంగా ఉన్నారు.
నేతలు, కార్యకర్తలు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు సమిష్టిగా కృషి చేయాలి.
తెలంగాణ లో ఇప్పుడు చాలా కీలకమైన సమయం..
భారత్ జోడో యాత్ర దేశంలో విజయవంతంగా నడుస్తుంది
భారత్ జోడో యాత్ర పూర్తయ్యాక కొనసాగింపుగా దేశంలో హాత్ సే హాత్ జోడో యాత్ర జనవరి 26 నుంచి ప్రారంభం అవుతుంది.
భారత్ జోడో యాత్ర లో రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని ప్రతి ఇంటికి చేర్చాలని ప్రణాలిక చేసాము.
రాహుల్ సందేశాన్ని దేశంలో ప్రతీ ఇంటికి చేరవేసేందుకె హాత్ సే హాత్ జోడో యాత్ర.
జనవరి 26 నుంచి రెండు నెలలపాటు హాత్ సే హాత్ జోడో యాత్ర కొనసాగుతుంది.
తెలంగాణలో ప్రతీ ఇంటికే రాహుల్ గాంధీ సందేశాన్ని చేరవేయాలి.
హాత్ సే హాత్ జోడో యాత్రకు మద్దతుగా అంతా కలిసిరండి.
ప్రతీ జిల్లా, ప్రతీ బ్లాక్ లో రెండు నెలలపాటు యాత్ర కొనసాగుతుంది.
ప్రతి ఇంటికి భారత్ జోడో యాత్ర పోస్టర్, ప్రతి చేతికి రాహుల్ గాంధీ సందేశాన్ని చేర్చే విదంగా హాత్ సే హాత్ అభియాన్ యాత్ర సాగుతుంది.
ఈ కార్యక్రమంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త,నాయకులు పాల్గొనాలి.
నిజామాబాద్ జిల్లాలో బాలయ్య అభిమానులు సందడి చేశారు. వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ సందర్భంగా బోధన్ నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో అభిమానులు సినిమా చూసేందుకు తరలివచ్చారు. దాదాపు 150 కార్లలో వీర సంహారెడ్డి జెండాను వేసుకుని వచ్చారు. స్పెషల్ షో టికెట్స్ మొత్తం బోధన్ బాలయ్య అభిమానులు బుక్ చేసుకున్నారు. సినిమా హాల్ లో బాలయ్య అభిమానులు సందడి చేశారు.
శ్రీవారి దర్శనం సామాన్యులకు నరకం.. ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానిక సామాజిక వేత్తలు
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఈ మధ్య కాలంలో సామాన్యులకు నరకప్రాయం అయిందని, స్థానిక సామాజిక వేత్తలు మాంగాటి గోపాల్ రెడ్డి , జగన్నాథం నాయుడు , సుధాకర్ రెడ్డి , కన్నారెడ్డి , పార్థసారధి లు ఆగ్రహం వ్యక్తం చేశారు.. గురువారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు.. ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి పర్వదినాలలో స్వయంగా శ్రీవారి దర్శనానికి వెళ్లి క్యూ కాంప్లెక్స్ లో వీరు అనుభవించిన నరకాన్ని మీడియా ముందు వెల్లడించారు.. ఒకప్పట్లో వైకుంఠ ఏకాదశి అంటే రెండు రోజులు మాత్రమే వైకుంఠ ద్వార దర్శనం కలుగజేసే వారని, కానీ నేడు పది రోజులు ఏకధాటిగా దర్శనాలు కల్పిస్తామని, గొప్పలు చెప్పి వీఐపీల సేవలో తరిస్తూ క్యూ కాంప్లెక్స్లో భక్తుల ప్రాణాలతో చలగాటం ఆడారని ఆరోపించారు.
టీటీడీ పాలకమండలి యాజమాన్యం అసలు హిందూ ధర్మాన్ని పాటిస్తున్నారా లేక వేరే మతాన్ని ప్రోత్సహిస్తున్నారా అని ప్రశ్నించారు.. ఈ ఏకాదశి పర్వదినాలలో టోకెన్లు కట్టుకున్న వారిని ఉసిగొలిపేలా రన్నింగ్ క్యూ అని ప్రచారం చేసి , జన భక్తసంద్రం తరలివచ్చేలా చేసి వారి అనారోగ్యానికి కారుకులయ్యారని దుయ్యబట్టారు.. తిరుపతిలో ఉచిత దర్శనాల కోసం దాదాపు తొమ్మిది కౌంటర్లను ఏర్పాటు చేసి టోకలను జారీ, దర్శన భాగ్యం కల్పించే కోణంలో పూర్తిగా టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు.. వీఐపీల సేవలో పడి గంటల తరబడి సామాన్యులను క్యూ కాంప్లెక్స్ పడవేయడం దారుణమన్నారు స్వామి వారి దర్శనానికి వెళ్లిన ఎందరో స్థానికులు కథలు కథలుగా వారి కష్టాలను చెప్పుకుంటున్నారన్నారు.. అధికారులు ఇకనైనా తీరు మార్చుకొని, మరోసారి ఇది పునరావృతం కాకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు..
కడప జిల్లా : బ్రహ్మంగారిమఠం మండలం లోని నర్సిరెడ్డి పల్లె గ్రామంలో గడపగడప మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యేకి చేదు అనుభవం ఎదురయింది
గడపగడప కార్యక్రమానికి ఎమ్మెల్యే వస్తున్నారని తెలుసుకున్న ప్రజలు ఇంటికి తాళాలు వేసి, ఊర్లో లేకుండా వెళ్ళిపోయారు. కొన్ని సంవత్సరాలుగా ఈ ఊరికి రోడ్డు లేదని ఆ ఊరి ప్రజలకు రోడ్డు వేస్తామని ప్రజా ప్రతినిధులు మాట ఇచ్చి మాట తప్పారని ఆ ఊరి ప్రజలు వాపోయారు, ఇలా చేయడం ఇది మొదటిసారి కాదని గతంలో కూడా ఎంపీపీ జడ్పిటిసిలు దేవుని దగ్గర ప్రమాణం చేసి మీ ఊరికి అంతా మంచి చేస్తామని చెప్పి మాట తప్పారు మౌలికవసతులు కల్పించడంలో విఫలమయ్యారని అని ఊరి ప్రజలు వాపోయారు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన వివాదాస్పద జీవో నెంబర్ 1ను ఈ నెల 23వ తేదీ వరకూ సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం ప్రకటించింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 20వ తేదీకి వాయిదా వేసింది. రోడ్లపై సభలు, ర్యాలీలు నిషేధిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తూ జీవో నెంబర్ 1 విడుదల చేసింది. ఈ జీవో నెంబర్ 1పై సీపీఐ కార్యదర్శి రామకృష్ణ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు విన్పించారు. ఈ పిల్ దాఖలు చేయటంపై తమకు ఎటువంటి సమాచారం లేదని అడ్వకేట్ జనరల్ తెలిపారు.
Background
తెలుగు రాష్ట్రాల్లో చలి తగ్గుముఖం పడుతోంది. గత వారం రోజులతో పోల్చి చూసుకుంటే చలి తీవ్ర కాస్త తగ్గింది. వారం పది రోజుల పాటు గజగజ వణికిపోయిన జనాలు ఇప్పుడు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఏర్పడిన పొడిగాలులు కర్ణాటకవైపు వెళ్లిపోవడంతో చలి తీవ్రత తగ్గింది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి ఇన్ని రోజులు పొడిగాలులు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నందున రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. మూడేళ్ల కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
పొడిగాలులు కర్ణాటకలోకి ప్రవేశించడంతో కర్ణాటకకు ఆనుకొని ఉన్న ప్రాంతాల్లో చలి తీవ్రత కాస్త పెరిగింది. మిగతా ప్రాంతాల్లో చలి తీవ్రత తక్కువగా ఉంది. విశాఖ నగరంలో చలి గత నాలుగు రోజులతో పోలిస్తే కొంచెం తగ్గిందనే చెప్పుకోవాలి. విశాఖ నగరంతోపాటుగా నగర పరిసర ప్రాంతాల్లో అన్ని చోట్లలో ప్రస్తుతం 20 డిగ్రీల సెల్సియస్‌కి పైగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఒక్క కైలాసగిరి తప్ప మిగతా ప్రాంతాల్లో నార్మల్ వెదర్ ఉంది. ఈ ఉష్ణోగ్రతలు రానున్న రోజుల్లో ఇంకా పెరగనున్నాయి. వచ్చే వారం నుంచి చలి తీవ్రత పూర్తిగా తగ్గిపోనుంది.
మత విద్వేషాలు రెచ్చగొడితే దేశం ఆప్ఘనిస్థాన్‌లా అవుతుందని..దీనిపై యువత ఆలోచన చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మహబూబాబాద్ కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన తర్వాత బహిరంగసభలో మాట్లాడారు. కేంద్రం అసమర్థ విధానాలతో ఎంతో నష్టపోతున్నామని సీఎం కేసీఆర్ అన్నారు. కేంద్రం తీరుతో జీఎస్డీపీ వెనుకబడిందన్నారు. మహబూబాబాద్ బహిరంగ సభలో మాట్లాడిన కేసీఆర్.. దేశ అభివృద్ధిపై యువకులు చర్చిచాలన్నారు. యువకులు ముందుకు వస్తేనే దేశం బాగుపడుతుందన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని వ్యాఖ్యనించారు. 20 ఏండ్లు గడిచినా కృష్ణా ట్రిబ్యునల్ తీర్పులు రావటం లేదని ఆరోపించారు.
గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో మహబూబాబాద్ కు వచ్చినప్పుడు తుంగతుర్తి, పాలకుర్తి, వర్ధన్నపేటలో కాల్వలు సగం గీకి, తీసినవి ఉన్నాయన్నారు. వీటిని చూసి ఈ జన్మలో నీళ్లు రావనుకున్నా. మంచిర్యాల, ములుగుకు వచ్చినప్పుడు చిల్లర వేసి మా నేలకు నీళ్లు రావాలని కోర్టుకున్నా. ఇక రాష్ట్రం సాకారం కావాలని కురవి వీరభద్ర స్వామిని కోరుకున్నా. అందుకే బంగారు మీసాలు చేయిస్తానని మొక్కుకొని తీర్చాను. మహబూబాబాద్ గతంలో చాలా వెనకబడ్డ ప్రాంతాలు. కానీ ఇప్పుడు జిల్లాగా మారి అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు.
దేశంలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన అత్యంత వేగంగా ప్రయాణించే వందే భారత్ ఎక్స్ ప్రెస్ తొలిసారిగా విశాఖ కు చేరింది. కానీ కొందరు అల్లరిమూక వందే భారత్ రైలుపై బుధవారం సాయంత్రం మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడికి పాల్పడటం కలకలం రేపింది. వెంటనే రంగంలోకి దిగిన విశాఖ పోలీసులతో పాటు ఆర్పీఎఫ్ అధికారులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో వందేభారత్ రైలుపై దాడిచేసి కిటికీలు ధ్వంసం చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని విశాఖపట్నం పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు.
నిందితులు మద్యం మత్తులో ఉన్నారని, అందుకే ఈ దాడి చేసి ఉంటారని ప్రాథమికంగా భావిస్తున్నారు. నిందితులపై రైల్వే చట్టం కింద కేసు నమోదు చేసి ఆర్పీఎఫ్ అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పారు. ట్రయల్ రన్ కోసం చెన్నై నుంచి విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును మర్రిపాలెం యార్డుకు తీసుకెళ్తుండగా కంచరపాలెం వద్ద రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో రెండు బోగీల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై డీఆర్ఎం అనూప్ సత్పతి విచారణకు ఆదేశించారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -