Karnataka High Court: అభిమానిని హత్య చేసిన కేసులో జైల్లో ఉన్న కన్నడ స్టార్ హీరో దర్శన్‌కు హైకోర్టు ఆరు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ సందర్భంగా పలు షరతులను విధించింది. వెన్నునొప్పి, మూత్రపిండాల సంబంధిత అనారోగ్యం, కాళ్ల నరాల్లో రక్తప్రసరణ లేక ఇబ్బంది పడుతున్నాడని, సర్జరీ చేయించుకునేందుకు బెయిల్ ఇవ్వాలని సెషన్స్ కోర్టులో దర్శన్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆరువారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
దర్శన్ తన పాస్‌పోర్టును ట్రయల్ కోర్టులో సరెండర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. రేణుకాస్వామి అనే అభిమాని హత్య కేసులో దర్శన్ ఏ 2 నిందితుడిగా ఉన్నారు. ఈ హత్య కేసు కర్ణాటకలో సంచలనంగా మారింది. ఈ కేసులో దర్శన్ ను జూన్ 11న అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు స్నేహితురాలు పవిత్ర గౌడ 15 మంది అరెస్ట్ చేశారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్ ను, బెంగళూరు కోర్టు ఆదేశాల మేరకు ఇటీవల బళ్లారి జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ప్రస్తతం బళ్లారి జైలులో దర్శన్ ఉన్నారు. అంతకు ముందు బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో ఉండేవారు. అక్కడ ఆయనకు రాచమర్యాదలు అందుతున్నట్లుగా వీడియో వెలుగులోకి రావడంతో బళ్లారి జైలుకు మార్చారు.
విజయమ్మ ఇచ్చిన షాక్‌తో వైసీపీలో డైలమా - ఎలా స్పందించాలో అర్థం కాని నేతలు ! సైలెంట్
దర్శన్ కన్నడలో స్టార్ హీరో. ఆయన హీరోగా పలు సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి. డెవిల్ అనే సినిమా దాదాపుగా పూర్తయింది.ఆయన ఓ మూడు, నాలుగు రోజులు ఆయన షూటింగ్‌లో పాల్గొంటే పూర్తి అయిపోతుంది. ఇంతకు ముందు దర్శన్ కాటేరా అనే సినిమాలో నటించారు. అది సూప్ర హిట్ అయింది. హిట్ కాంబినేషన్‌గా పేరుతున్న మిలన్ ప్రకాష్, దర్శన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో 'డెవిల్'పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అనారోగ్య కారణాలతో ఆయనకు ఆరు వారాల బెయిల్ వచ్చింది. ఇప్పుడు ఆయన షూటింగ్‌లలో పాల్గొంటే ఆయనకు ఆరోగ్యం బాగానే ఉన్నా తప్పుడు సమాచారంతో బెయిల్ పొందారన్న ఆరోపణలు వస్తాయి. అందుకే ఆయన షూటింగ్‌లో పాల్గొనే అవకాశాలు ఉండవని భావిస్తున్నారు.
విజయమ్మ బహిరంగలేఖతో జగన్‌కు చిక్కులు - ఆస్తుల వివాదం మరింత ముదరడం ఖాయమేనా ?
ఈ కేసులో దర్శన్ తో పాటు హీరోయిన్ పవిత్ర గౌడ కూడా కీలక నిందితురాలిగా ఉన్నారు. ఆమెకు ఫోన్లు చేసి రేణుకాస్వామి అసభ్యంగా మాట్లాడటం.. అశ్లీల ఫోటోలు పంపడంతోనే అసలు గొడవ జరిగిందని రేణుకా స్వామిని ట్రాప్ చేసి బంధించి.. హింసించి హత్య చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.