YS family property dispute is likely to escalate further: వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం మరో మలుపు తిరగడం ఖాయంగా కనిపిస్తోంది. షర్మిల చెబుతున్న మాటల్ని సమర్థిస్తూ జగన్ తో పాటు వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి చేస్తున్న ప్రకటనలు అన్నీ అసత్యాలని విజయలక్ష్మి తన బహిరంగలేఖలో తేల్చేశారు. ఆస్తుల వివాదంలో అసలేం జరిగిందో చెప్పారు. ఆమె చెప్పిన దాని ప్రకారం షర్మిలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి తాను షర్మిలవైపు ఉన్నానని చెర్పారు. అంటే ఆస్తుల విషయంలో షర్మిలకు జగన్ అన్యాయం చేస్తున్నారని సొంత తల్లినే నేరుగా చెప్పినట్లయింది. ఇప్పుడీ అంశం ప్రజల్లోకి వెళ్లిపోయింది.
బహిరంగమైన కుటుంబ ఆస్తుల వివాదం
నాలుగు గోడల మధ్య ఆస్తుల పంచాయతీ తేల్చుకుంటే బయట అసలు చర్చ జరిగేదే కాదు. నిజానికి ఇలాగే పరిష్కరించుకున్నారని కానీ జగన్ అడ్డం తిరగడం వల్లే సమస్య వచ్చిందని ఇప్పుడు కోర్టుకు వెళ్లడం వల్ల బహిరంగమయిందని వైఎస్ విజయమ్మ లేఖతో స్పష్టమయింది. మాజీ ముఖ్యమంత్రి ఇంట్లో ఆస్తుల వివాదం పబ్లిక్ లోకి వస్తే ఖచ్చితంగా అది హాట్ టాపిక్ అవుతుంది. ఇప్పుడు అదే జరుగుతోంది. కుటుంబ పెద్దగా ఉన్న విజయమ్మ కూా ఆస్తుల్ని నలుగురు మనవళ్లు, మనవరాళ్లకు సమానంగా పంచాలని లేఖ ద్వారా తేల్చేశారు. కానీ దానికి జగన్ మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఉన్నారు. స్వయంగా ఎన్సీఎల్టీలో కూడా పిటిషన్ వేశారు.
ఆస్తుల వివాదంపై వైఎస్ విజయమ్మ బహిరంగ లేఖ - జగన్‌కు గట్టి షాక్ !
జగన్ తల్లి మాట వింటారా ?
ఇప్పుడు అందరి దృష్టి జగన్ మోహన్ రెడ్డి వైపే ఉంది. ఆస్తుల వివాదాన్ని తన బిడ్డలే పరిష్కరించుకుంటారని విజయమ్మ చెప్పింది. ఇద్దరూ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఈ అంశంపై ఇద్దరూ ఎంత త్వరగా రాజీకీ వస్తే ఇద్దరికీ అంత మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నదే చేసేలా ఉంటుందని ఎవరైనా రాజీపడేలా ఉండదని అనుకోవచ్చు. అన్నీ ఆలోచించిన తర్వాతనే తల్లి విజయమ్మతో పాటు సోదరి షర్మిలపై కోర్టుకెళ్లారని .. ఇందులో ఇక వెనక్కి తగ్గేదేమీ ఉండదని అంటున్నారు. వైఎస్ ఉన్నప్పుడు పంచి నఆస్తులు కాకుండా తన వ్యాపారాల నుంచి ఒక్క రూపాయి కూడా షర్మిలకు ఇవ్వాలని ఆయన అనుకోవడం లేదు. అది తన స్వార్జితం అని అంటున్నారు. అందుకే తల్లి చెప్పినప్పటికీ ఆస్తులు పంచే అవకాశాలు ఉండవని వివాదాన్ని కొనసాగిస్తారని.. కోర్టులోనే తేల్చుకుంటారని అంటున్నారు.
ఏమీ చేయకపోతే రాజ్ పాకాల ఎందుకు పారిపోయారు? - ఫామ్‌హౌస్ కేసుపై రేవంత్ సూటి ప్రశ్న
ఇడుపులపాయలో జగన్ - మీడియా ముందు ప్రకటన చేస్తారా ?
ఆస్తుల వివాదంపై ఇక పార్టీ నుంచి ఎవరూ మాట్లాడవద్దని కోర్టులోనే వాదనలు వినిపిద్దామని వైసీపీ మూడు రోజుల కిందట ప్రకటన చేసింది. అయితే ఇప్పుడు విజయమ్మ బహిరంగ లేఖ రాయడంతో వైసీపీకి కొన్ని చిక్కులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో జగన్ పులివెందుల పర్యటనకు వచ్చారు. అక్కడ కీలకమైన ప్రకటన చేసేందుకే వచ్చారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. విజయమ్మ లేఖపై స్పందించి ఆస్తుల వివాదాన్ని పరిష్కరించకుంటారా లేకపోతే.. తల్లి కూడా సోదరితో జత కలిసి తనపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించి.. తన బాట తనదేనని చెబుతారా అన్నది ఆసక్తికరంగా మారింది.