Revanth Reddy Chit Chat: ‘మాకు దీపావళి అంటే చిచ్చు బుడ్లు.. వాళ్లకు మాత్రం సారా బుడ్లు’’ అని బీఆర్ఎస్ నేతల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సెటైర్ వేశారు. మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఫామ్ హౌస్ కేసు విషయం ప్రస్తావనకు వచ్చింది. రాజ్ పాకాల ఇంట్లో జరిగినది దీపావళి దావత్ అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వాదనను ఎద్దేవా చేశారు.  దీపావళి దావత్‌ అలా చేస్తారని తమకు తెలియదని  ... ఏమీ చేయకపోతే రాజ్‌ పాకాల ఎందుకు పారిపోయారు? అని ప్రశ్నించారు. ముందస్తు బెయిల్‌ ఎందుకు అడిగారో చెప్పాలన్నారు.  ఇంటి దావత్‌లో క్యాసినో కాయిన్స్‌, విదేశీమద్యం ఎందుకుంటాయని రేవంత్  ప్రశ్నంచారు.


ఫామ్‌హౌస్ కేసులో రాజకీయం ఎక్కువ -మ్యాటర్ తక్కువ ! మానసిక దాడి చేయడమే వ్యూహమా ?


మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఎక్స్‌పైరీ మెడిసిన్ అని  రేవంత్ తేల్చేశార. ఏడాదిలో  కొడుకు చేత తండ్రిని ఫినిష్ చేశానని  ఆ తర్వాత బావతో బామ్మర్దిని ఫినిష్ చేస్తానని  సెటైర్ వేశారు.  ఆ తర్వాత హరీష్‌రావును ఎలా డీల్ చేయాలో తనకు తెలుసని చెప్పుకొచ్చారు.  మూసి విషయంలో వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తానని  కేటీఆర్ , హరీష్ రావు కూడా తనతో కలిసి రావాలని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్ విసిరారు. పాదయాత్రలోనే మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదామన్నారు.


రెండు రోజుల కిందట కేటీఆర్ సతీమణి  సోదరుడు రాజ్  పాకాల తన ఫామ్ హౌస్‌లో విందు ఏర్పాటు చేశారు. ఆ విందుపై పోలీసులు రైడ్ చేశారు. అక్కడ విదేశీ మద్యంతో  పాటు పోకర్ ఆడే కాయిన్స్ లభించాయి. అలాగే ఆ విందులో పాల్గొన్న ఒకరికి కొకైన్ పాజిటివ్ రావడంతో కేసు నమోదు చేశారు. ఆ కొకైన్ ఇచ్చింది రాజ్ పాకాలనేనని విజయ్ మద్దూరి చెప్పడంతో రాజ్ పాకాలను ఏ వన్ గా చేర్చి పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత వారి ఇళ్లల్లో సోదాలు చేశారు. అది వివాదాస్పదం అయింది. తర్వాత రాజ్ పాకాల హైకోర్టులో పిటిషన్ వేయడంతో విచారణకు హాజరయ్యేందుకు రెండు రోజుల సమయాన్ని హైకోర్టు ఇచ్చింది. 


సన్ బర్న్ ఫెస్టివల్స్ నుంచి ఫామ్ హౌస్ పార్టీల వరకూ ఆయన పేరు ఫేమస్ - రాజ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ పెద్దదే !


రెండు రోజుల తర్వాత రాజ్ పాకాల పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయనకు డ్రగ్ టెస్టులతో పాటు విజయ్ మద్దూరికి ఇచ్చిన కొకైన్ ఎక్కడి నుంచి తెచ్చారో కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. అయితే ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసుగా బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఫ్యమిలీ దావత్ చేసుకుంటే దాన్ని రేవ్ పార్టీగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. దీనికే రేవంత్ కౌంటర్ ఇచ్చారు.