Viral News in Telugu: కర్ణాటకలోని అగుంబేలోని ఓ ఇంట్లో 9 అడుగుల కింగ్ కోబ్రా అందరినీ వణికించింది. బెడ్‌రూమ్‌లో ఓ పెట్టెలో దాక్కుంది. ఎంత ప్రయత్నించినా అది బయటకు రాలేదు. విషసర్పం కావడం వల్ల ఇంట్లో వాళ్లంతా భయపడిపోయారు. వెంటనే స్నేక్ రెస్క్యూ టీమ్‌కి కాల్ చేశారు. కాసేపటికే ఆ ఇంటికి చేరుకున్న సిబ్బంది చాలా చాకచక్యంగా ఆ పాముని రక్షించి అడవిలోకి వదిలారు. ఇంట్లో వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం...బెడ్‌రూమ్‌లోని షెల్ఫ్‌పై ఉన్న ఓ బాక్స్‌లోకి పాము వెళ్లింది. ఇది గుర్తించిన వెంటనే అటవీ అధికారులకు సమాచారం అందించారు. స్నేక్ రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగి పాముని పట్టుకుంది. ఓ బ్యాగ్‌లోకి దాన్ని పంపించి అడవిలో వదిలేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ పాముని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అంతకు ముందు మరో ఇంట్లోనూ 12 అడుగులు కింగ్ కోబ్రా కనిపించగా ఇదే టీమ్‌ కాపాడింది. 


"ఓ ఇంట్లోని బెడ్‌రూమ్‌లో 9 అడుగుల కింగ్ కోబ్రా కనిపించింది. ఇంటి యజమాని అటవీ అధికారులకు ఫోన్ చేసి చెప్పాడు. అధికారులు స్నేక్ రెస్క్యూ టీమ్‌కి సమాచారం ఇచ్చారు. ఆ ఇంటికి వెళ్లిన వెంటనే ముందుగా అందరికీ కొన్ని సూచనలు చేశాం. పాముని పట్టుకునే క్రమంలో ఏం చేయాలి..? ఏం చేయకూడదో వివరించాం. బెడ్‌రూమ్‌లో తనిఖీలు చేసి పాముని గుర్తించాం. ఆ తరవాత పట్టుకుని ఓ బ్యాగ్‌లోకి పంపించాం. పాములను చంపకూడదని స్థానికులకు అవగాహన కల్పించాం"


- అటవీ అధికారులు


 






Also Read: Viral News: గడ్డం మీసం గీసుకోవాలని జూనియర్‌ని వేధించిన సీనియర్‌లు, ఒప్పుకోలేదని దారుణంగా దాడి