కర్ణాటక రాష్ట్రంలో కరోనా కలకలం రేపింది. కోలార్ శ్రీ దేవరాజ్ ఉర్స్ మెడికల్ కాలేజీకి చెందిన 33 మంది వైద్య విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ వచ్చింది. విద్యార్థుల నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపామని, ఫలితాలు కోసం ఎదురుచూస్తున్నారని జిల్లా సర్వైలెన్స్ అధికారిణి డాక్టర్ చరణి తెలిపారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం విద్యార్థుల ప్రయాణ హిస్టరీలేదని తెలుస్తోంది. అయితే బెంగళూరులో ప్రయాణం ఆరా తీస్తున్నట్లు ఆరోగ్య అధికారి తెలిపారు. కళాశాల యాజమాన్యం ప్రకారం గత 45 రోజులుగా ఇంటర్నల్ పరీక్షలు జరుగుతున్నాయని, అందువల్ల విద్యార్థులెవరూ స్వగ్రామాలకు వెళ్లలేదని డాక్టర్ చరణి తెలిపారు. విద్యార్థులు ఉంటున్న బ్లాక్ మొత్తాన్ని కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించారు. వైద్య విద్యార్థులందరినీ ఆర్‌ఎల్‌ జలప్ప ఆసుపత్రిలో ఐసోలేట్‌ చేసి చికిత్స అందిస్తున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తోంది. కోవిడ్ సోకిన విద్యార్థుల ప్రైమరీ, సెంకండరీ కాంటాక్ట్ర్  1192 లను గుర్తించామని వైద్యులు తెలిపారు. 


Also Read: ఒక్క రోజే 122 ఒమిక్రాన్ కేసులు... రాష్ట్రాలను మరోసారి అప్రమత్తం చేసిన కేంద్రం !


కొడగు పాఠశాలలో 26 మందికి కోవిడ్


33 మంది వైద్య విద్యార్థులలో 32 మంది యువతులు, ఒక యువకుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 17వ తేదీన కళాశాలలో మొదటి కేసు నమోదైంది. ఈ జిల్లాలో దీనిని రెండో క్లస్టర్ గా గుర్తించారు. అంతకుముందు కేజీఎఫ్‌లోని ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన నర్సింగ్ విద్యార్థులు కేరళ నుంచి కళాశాలకు తిరిగి వచ్చినప్పుడు కరోనా పాజిటివ్ వచ్చింది. కొడగులోని ఓ విద్యాసంస్థలో మొత్తం 26 మంది విద్యార్థులకు కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. వీరంతా కుశాల్‌నగర్ సమీపంలోని అట్టూరు జ్ఞానగండ రెసిడెన్షియల్ పాఠశాలకు చెందిన విద్యార్థులు. పాఠశాల యాజమాన్యం దాదాపు రెండు రోజుల క్రితం విద్యార్థులకు COVID-19 పరీక్షలు చేసింది. మొత్తం 387 మంది విద్యార్థులు పరీక్షలు చేయదగా వీరిలో 26 మందికి పాజిటివ్ నిర్థారణ అయింది. ‘‘విద్యార్థులు 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నారు. పాఠశాలలో మొత్తం 600 మంది విద్యార్థులను పరీక్షించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సంస్థను కంటైన్‌మెంట్ జోన్‌గా ప్రకటించాం’’ అని తాలూకా ఆరోగ్య అధికారి డాక్టర్ శ్రీనివాస్ ప్రకటించారు. 


Also Read: డెల్టా మరణమృదంగం - రైతు చట్టాల ఉపసంహరణ.. ! 2021లో భారత్‌కు మరపురాని మైలురాళ్లు ఎన్నో...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి