Joshimath Crisis:


ఊరే కుంగిపోద్ది..


హిమాలయాల్లో అందంగా కనిపించే ఆ ఊరు ఇప్పుడు కళ్ల ముందే కుంగిపోతోంది. ఒకటి కాదు రెండు కాదు గడచిన పన్నెండుల్లో రోజుకు 5.4 సెంటీమీటర్ల మేర లోపలికి కుంగిపోయింది ఆ ఊరు మొత్తం. ఇళ్లన్నీ పగుళ్లు..గోడలన్నీ నెర్రెలిచ్చుకుపోయాయి...రోడ్ల మీద ఎక్కడ చూసినా భారీ గోతులు...ఎంతో ప్రేమగా కట్టుకున్న ఇళ్లను వదల్లేక..మనసు రాక కొన్ని వందల మంది కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చమోలీ జిల్లా జోషి మఠ్ దీన అవస్థ ఇది. ఏ క్షణమైనా ఊరు ఊరంతూ కుంగిపోతుంది. ఇదేమీ ఆషామాషీగా చెబుతోంది కాదు భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఆధ్వర్యంలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హైదరాబాద్ వాళ్లు విడుదల చేసిన శాటిలైట్ ఫోటోలు ఇవి. గడచిన ఏడు నెలలుగా 8.9 సెంటీమీటర్లు కుంగిపోయిన జోషిమఠ్....లాస్ట్ పన్నెండు రోజుల్లోనే 5 సెంటీమీటర్లు లోనికి కుంగిపోయింది. అసలు ఓ ఊరు ఊరంతా ఇలా కుంగిపోవటానికి కారణాలేంటీ...వాళ్ల వేదనకు అసలు రీజన్ ఏంటీ...టాప్ 5 పాయింట్స్ ఏంటో చూద్దాం.


1. జోషి మఠ్ అనేది ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలోని హిమాయాల  ఏటవాలు ప్రాంతంలో కట్టిన ఊరు. ఒక అన్ ప్లాన్డ్ సిటీ ఇది. అసలు ఈ ప్రాంతం భారీ నిర్మాణాలు చేపట్టడానికి వీలే లేని ప్రాంతం. అలాంటిది అక్కడ ఓ సిటీ డెవలప్ అయిపోయింది. 


2. జోషి మఠ్ కు అసలు డ్రైనేజీ సిస్టమ్ లేదు. ఎక్కడా నీరు పోయే మార్గం లేదు. ఉన్న నీరంతా ఆ ఇళ్ల కిందకు చేరుకోవాల్సిందే. ఆలోచించండి ఉన్న నీరంతా భూమిలోకి ఇంకుతోంది. పైగా అది మంచుకొండల ఏటవాలు ప్రాంతం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 3898 కుటుంబాలు జోషీ మఠ్ లో నివసిస్తున్నాయి.  16వేల 709 మంది జనాభా ఉన్నారు పన్నెండేళ్ల క్రితమే. ఆ తర్వాత టూరిజం సెంటర్ గానూ మారి పెద్ద ఎత్తున హోటళ్లు...రిసార్ట్ లు వచ్చాయి. వందేళ్లలో ఎంత మార్పు వచ్చిందో జోషి మఠ్ లో ఈ ఫోటో చూడండి. కుంగిపోవటానికి మొదటి కారణం ఇది.


3. జోషి మఠ్ ఉన్న చమోలి జిల్లా భూకంపాల ప్రాంతం. భారత్ సెసిమిక్ మ్యాప్ లో ఈ చమోలి జిల్లా జోన్ 5 లో ఉంది. సో అక్కడి భూమిలో కదలికలు ఏర్పడే అవకాశాలు చాలా ఎక్కువ. అలాంటప్పుడు ఇలాంటి ఏటవాలు ప్రాంతం అకస్మాత్తుగా కుంగిపోయే అవకాశం ఉంటుంది. చమోలీ జిల్లా కానీ అందులోని జోషి మఠ్ కానీ ఇవన్నీ హిమాలయా పర్వతాల రేంజ్ లో ఉన్నవే. హిమాలయాలు ప్రపంచంలోనే అత్యంత యంగ్ ఏజ్ లో ఉన్న పర్వత శ్రేణుల్లో ఒకటి. సో హిమాలయాలు ఆక్టివ్ లీ సెసిమిక్, అన్ స్టేబుల్, ఈజీలో బ్రేకబుల్ అన్నమాట. 


4. అసలే ఫ్రాగైల్ జోన్ లో పెద్ద ఎత్తున టన్నెల్ లను నిర్మించటానికి కూడా కేంద్రం అనుమతులు ఇచ్చింది. జోషి మఠ్ కు కిలోమీటరు దూరంలో 12 కిలోమీటర్ల పొడవైన హెడ్ రేస్ టన్నెల్ ను నిర్మిస్తున్నారు. తపోన్ విష్ణుగఢ్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ లో భాగంగా ఈ టన్నెల్ ను అది కూడా భూమి లోపల 600 మీటర్ల దిగువన ఈ టన్నెల్ ను నిర్మిస్తున్నారు. ఆ భారీ డ్రిల్లింగ్స్ జోషి మఠ్ కుంగిపోవటానికి ఓ కారణంగా భావిస్తున్నారు. ఇంత జరిగాక ఇప్పుడు జల్ శక్తి మంత్రిత్వ శాఖ ఈ టన్నెల నిర్మాణాల మీద హయ్యెండ్ కమిటీ ని టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయమని నియమించింది. 


5. క్లైమేట్ ఛేంజ్ కూడా జోషి మఠ్ పరిస్థితికి ఓ కారణం. హిమాలయాల్లో పెరిగిపోతున్న టూరిజం కారణంగా కాలుష్యం పెరిగి...అక్కడ మంచు పర్వతాలన్నీ ఊహించన దానికంటే ఎక్కువగా దెబ్బ తింటున్నాయి. ఫలితంగా వాతావరణ సమతుల్యం దెబ్బతిని...అకాలవర్షాలు కురుస్తున్నాయి. ఫలితంగా అకస్మాత్తుగా వరదలు, భారీ వర్షాలు, కొండ చరియలు విరిగిపడటం లాంటి విపత్తులకు కారణం అవుతున్నాయి.


 ఈ కారణాలన్నీ కలిసి ఇప్పుడు జోషి మఠ్ శాశ్వతంగా కాలగర్భంలో కలిసిపోయేందుకు కారణం అవుతున్నాయి. ఇస్రో అంచనాల ప్రకారం మరికొద్ది రోజుల్లోనే జోషి మఠ్ లో పూర్తిగా కుంగిపోయి కొండల ఏటవాలు ప్రాంతం నుంచి జారిపోనుంది. అక్కడి ప్రజల జీవిత కాల కష్టం మంచు కొండల్లో కరిగిపోనుంది.


Also Read: MV Ganga Vilas Launch: గంగా విలాస్‌ క్రూజ్‌ స్పెషాల్టీస్ అన్నీ ఇన్నీ కావు, పేరుకు తగ్గట్టే విలాసం