ABP  WhatsApp

Jawed Habib Spitting Video: హెయిర్ స్టైలిష్ హబీబ్‌పై ఎఫ్ఐఆర్.. మహిళ తలపై ఉమ్మేసి హెయిర్ స్టైలింగ్

ABP Desam Updated at: 07 Jan 2022 03:19 PM (IST)
Edited By: Murali Krishna

హెయిర్ స్టైలిష్ దిగ్గజం జావేద్ హబీబ్‌పై తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఓ మహిళ తలపై ఉమ్ము వేసి హెయిల్ స్టైల్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది.

జావేద్ హబీబ్‌పై కేసు నమోదు

NEXT PREV

ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ జావేద్ హబీబ్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. ఇటీవల హబీబ్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అయింది. ఇందులో హెయిర్ స్టైలింగ్ చేసే సమయంలో ఓ మహిళ తలపై హబీబ్ ఉమ్ము వేశారు. దీనిపై మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు హబీబ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) కూడా హబీబ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.






ఇప్పటికే ముజఫర్‌నగర్ పోలీసులు హబీబ్‌పై నమోదు చేసిన కేసు వివరాలను అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 


క్షమాపణలు..


తనపై విమర్శలు వెల్లువెత్తడంతో హబీబ్.. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్షమాపణలు కోరారు. కేవలం నవ్వించడం కోసమే తాను ఇలా చేశానని.. ఎవరినైనా నొప్పించి ఉంటే మన్నించాలన్నారు.



నేను ఒక విషయం చెప్పదలచుకున్నాను. ప్రొఫెషనల్ వర్క్‌షాప్‌లు నిర్వహించే సమయంలో అందులో పాల్గొనేందుకు మా రంగంలో ఉన్నవారు చాలా మంది వస్తారు. ఆ వర్క్‌షాప్‌లు సుదీర్ఘంగా జరుగుతాయి. వారిని కాస్త నవ్వించాల్సి వస్తుంది. కానీ నేను చేసిన దానికి ఎవరైన నొచ్చుకొని ఉంటే.. మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నా. ఐ యామ్ సారీ.                                             - జావేద్ హబీబ్, హెయిర్ స్టైలిస్ట్


వైరల్ వీడియో..


ఉత్తర్‌ప్రదేశ్ ముజాఫర్‌నగర్‌లో జరిగిన హబీబ్ వర్క్‌షాప్‌లో ఈ ఘటన జరిగింది. ఈ వీడియోలో జావేద్ హబీబ్.. ఓ మహిళ తలపై ఉమ్ము వేసి హెయిర్ స్టైలింగ్ చేశారు. "తలపై వేయడానికి నీళ్లు తక్కువ ఉంటే లాలాజలం ఉపయోగించండి" అని జావేద్ అన్నారు.


వీడియో వైరల్‌ కావడంతో నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్.. ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులకు ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని కోరింది. 


హబీబ్ జావేద్‌కు భారత్‌లోని మొత్తం 115 నగరాల్లో 850 హెయిర్ సెలూన్లు, 65 హెయిర్ అకాడమీలు ఉన్నాయి.


Also Read: DigiLocker: యూనివర్సిటీలకు UGC కీలక ఆదేశాలు.. ఇక ఆ సర్టిఫికెట్లకు చెల్లుబాటు


Also Read: Covid Cases Today: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు







ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి







 

Published at: 07 Jan 2022 03:19 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.