Jawaharlal Nehru Jayanti:  నెహ్రూ మన దేశానికి తొలి ప్రధానిగా సేవలదించారని.. నవంబర్ 14 ఆయన 133వ జయంతి అని అందరికీ తెలుసు. కానీ నెహ్రూలో ఓ సినిమా ప్రేమికుడు ఉన్నాడనేది చాలా మందికి తెలియని విషయం. కానీ ఆ సినిమా ప్రేమకు ఓ రీజన్ ఉంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం.


ఇదీ కథ


లెజండరీ డైరెక్టర్ సత్యజిత్ రే. అప్పటికి యువకుడు. ఓ మూస ధోరణిలో సాగిపోతున్న సినిమాను రియలిస్టిక్ దారి పట్టించే బాధ్యతను ఫస్ట్ సినిమా నుంచే తీసుకున్నారు రే. అలా 1955లో వచ్చిన సినిమానే 'పథేర్ పంచాలి'. ఈ ప్రొడక్షన్ కోసం సత్యజిత్ రే చాలా కష్టపడ్డారు. చాలా అబద్ధాలు కూడా ఆడారు అంటారు. ఎందుకు అంటారా ఈ సినిమాకు ప్రొడ్యూసర్ 'గవర్నమెంట్ ఆఫ్  బెంగాల్'. అదేంటీ గవర్నమెంట్స్ సినిమాలు కూడా తీస్తాయా అంటే..ప్రజలకు ఏవైనా సందేశాలు, ప్రభుత్వ పథకాలు చేరవేసేందుకు డబ్బులు పెడతాయి. కానీ పథేర్ పంచాలి విషయంలో మాత్రం ప్రభుత్వమే నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా టైటిల్ కు అర్థం Song of the little road. అంటే 'దారి పాట' అని అర్థం. దారినపోయేప్పుడు పాడుకునే పాట అని కూడా అనుకోవచ్చు. 


అలా అనుకొని


అప్పటి బెంగాల్ సీఎం బిధాన్ చంద్రరాయ్ ను...ఈ సినిమాకు హెల్ప్ చేయాలని సత్యజిత్ తన తల్లికి తెలిసిన స్నేహితుల ద్వారా రిక్వెస్ట్ పంపించారంట. ప్రభుత్వాలు సినిమాల ప్రొడక్షన్ చేయకూడదన్న సీఎం..కాన్సెప్ట్ ఓ లైన్ లో విని రూరల్ డెవలప్మెంట్ కోసం చేస్తున్న సినిమా అనుకున్నారట. రే ని అడిగినా కూడా అదే  చెప్పటంతో...హోమ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ సినిమా రా ఫుటేజ్ చూసి 6లక్షల రూపాయలు శాంక్షన్ చేశాయంట. పైగా దాన్ని రూరల్ అప్ లిఫ్ట్ కోసం ఉపయోగిస్తున్న ఖర్చుగా రోడ్స్ ఇంప్రూవ్ మెంట్ అని లెక్కలు చూపించాయంట. తీరా సినిమా విడుదలయ్యాక అది ఓ ఫీచర్ ఫిల్మ్ అని తెలుసుకుని సీఎం ఆశ్చర్యపోయారట. పైగా ఆ సినిమా దేశంలోని పేదరికాన్ని స్టైలెజ్డ్ గా చూపించినట్లు ఉన్నదంటూ నర్గీస్ లాంటి సీనియర్ నేరుగా విమర్శలకు దిగారు.  


నెహ్రూకు


కానీ విమర్శలను పట్టించుకోని బంగాల్ సీఎం బిధాన్ చంద్రరాయ్...ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ కోసం కలకత్తాలో 'పథేర్ పంచాలి' స్పెషల్ స్క్రీనింగ్ చేయించారంట. ఆయన ఈ సినిమా చూసి ఎంతలా ఇంప్రెస్ అయ్యారంటే...అందులో పేదరికాన్ని దారుణంగా చూపించారంటూ వచ్చిన విమర్శలను నెహ్రూ పట్టించుకోలేదు. పైగా ఈ సినిమా ఇండియాతో ఆగిపోకూడదని విదేశాల్లో స్పెషల్ స్క్రీనింగ్ వేయిద్దామనే నిర్ణయానికి వచ్చారంట. అప్పటికి ఇంకా ఇండియా ఆస్కార్స్ కు అఫీషియల్ సబ్మిషన్స్ పంపించటం మొదలు పెట్టలేదు కాబట్టి ఈ సినిమాను నెహ్రూ స్పెషల్ ఇంట్రెస్ట్ తో 1956లో కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు పంపించారు.


ప్రపంచవ్యాప్తంగా


ఫిల్మ్ ఫెస్టివల్ ఎండ్ అయ్యే వరకూ ఈ సినిమాను ప్రదర్శించారు. ఫలితంగా పథేర్ పాంచాలి గొప్పదనం ప్రపంచమంతా తెలిసింది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు ఓ ఇండియన్ సినిమా గురించి ఫస్ట్ టైమ్ గొప్పగా చెప్పటం ప్రారంభించాయి. ఎన్నో వందల అవార్డులు...ఇప్పటికీ వరల్డ్ ది బెస్ట్ మూవీస్ అని ఓ లిస్ట్ చేస్తే మొదటి వంద సినిమాల్లో పథేర్ పాంచాలి కి చోటు ఉంటుంది. అంతే కాదు ఇప్పుడు దిగ్గజ దర్శకుడిగా కీర్తి అందుకుంటున్న హాలీవుడ్ డైరెక్టర్ మార్టిన్ స్కోర్సెసీ కూడా తనలో డైరెక్టర్ అవ్వాలని స్ఫూర్తి రగిలించిన సినిమా పథేర్ పాంచాలి అని చెప్పుకున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 


పథేర్ పాంచాలిని నెహ్రూ ఇంతలా ప్రమోట్ చేయటానికి కారణం ఓ ప్యూర్ ఇండియన్ మూవీ పై ఆయనకున్న ప్రేమ ఓ కారణమైతే..బ్రిటీషర్లు మన దేశాన్ని దోచుకుని వదిలి వెళ్లిన తర్వాత ఇక్కడ నెలకొన్న దుర్భిక్షమైన పరిస్థితులను ప్రపంచం మొత్తం తెలియాలని చేయటం నెహ్రూ నిర్ణయాల వెనక కారణమని చెబుతారు. సో ఇదీ నెహ్రూ దగ్గరుండి ప్రమోట్ చేయించిన పథేర్ పాంచాలి కథ.