Janaushadhi Kendras: రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే ఇండియన్ రైల్వేస్ ప్రధాన మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాల ఏర్పాటుకు నూతన విధానాన్ని రూపొందించింది. రైల్వే స్టేషన్ల ప్రాంగణ ప్రాంతాల్లో ప్రధాన్ మంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్, తిరుపతి రైల్వే స్టేషన్లలో సహా దేశవ్యాప్తంగా ఉన్న 50 రైల్వే స్టేషన్లు పైలట్ ప్రాజెక్టు కోసం గుర్తించారు. రోజువారీ మిలియన్ల కొద్దీ ప్రయాణించే ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ఈ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రయాణికులకు నాణ్యమైన మందులు, వినియోగ వస్తువులు అందరికీ అందుబాటు ధరలో ఉంచాలనే భారత ప్రభుత్వ మిషన్ ను ప్రచారం చేస్తున్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు, సందర్శకులు జనౌషధి ఉత్పత్తులను సులభంగా అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సరసమైన ధరలకే మందులను అందించడం ద్వారా సమాజంలో అన్ని వర్గాల్లో ఆరోగ్యం, సంక్షేమాన్ని పెంపొందించనున్నారు. అలాగే ఉపాధి అవకాశాలను సృష్టించడం, ఈ కేంద్రాలను తెరవడానికి వ్యవస్థాపకులకు మార్గాలను రూపొందిస్తున్నారు.
వాస్తవానికి ఇది ప్రయాణికులకు ఎంతగానో ఉపయోగపడే అత్యవసరమైన సౌకర్యంగా పరిగణించబడుతోంది. తదనుగుణంగా రైల్వే లైసెన్సుల ద్వారా వాణిజ్య మార్గాల్లో కార్యకలాపాలు నిర్వహించేందుకు, ప్రయాణ ప్రాంగణంలో, స్టేషన్లలో ఫ్యాబ్రికేటెడ్ అవుట్ లెట్ లను అందిస్తోంది. అవుట్ లెట్లు సౌకర్యవంతమైన ప్రదేశాల్లో సర్క్యులేటింగ్ ప్రాంతాలు ఉంటాయి. తద్వారా సందర్శించే ప్రయాణికులు ప్రయోజనాలు పొందుతారు. అయితే రైల్వే డివిజన్ల ద్వారా గుర్తించబడిన ప్రదేశాల్లో పి.ఎమ్.బి.జే.కెలను లైసెన్సుల ద్వారా ఏర్పాటు చేసి నిర్వహిస్తారు. ఐఆర్ఈపీఎస్ ద్వారా సంబంధిత రైల్వే డివిజన్ ల మాదిరిగానే ఈ వేలం స్టాల్స్ అందించబడతాయి. ఈ స్టాల్స్ ను ఎన్ఐడీ అహ్మదాబాద్ డిజైన్ చేస్తోంది. అవుట్ లెట్ల విజయవంతమైన బిడ్డర్లు ఔషధ దుకాణాన్ని నిర్వహించడానికి అవసరమైన అనుమతులు, లైసెన్సులు పొందాలి. అలాగే ఔషధాల నిల్వ కోసం అన్ని రకాల చట్టబద్ధమైన అవసరాలకు అనుగుణంగా ఉండాలి. జనౌషధి స్కీమ్ పి.ఎమ్.బి.జే.కే చే నిర్దేశించినట్లుగా ఒప్పందాన్ని కుదుర్చుకోవాలి.
పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన రైల్వే స్టేషన్లు ఇవే..!
- తిరుపతి - ఆంధ్రప్రదేశ్
- కొత్త టిన్సుకియా - అసోం
- లుమ్డింగ్ - అసోం
- రంగియా - బిహార్
- దర్భంగా - బిహార్
- పాట్నా - బిహార్
- కతిహార్ - బిహార్
- జంజ్‌గిర్-నైలా - ఛత్తీస్ గఢ్
- బాగ్బహరా - ఛత్తీస్ గఢ్
- ఆనంద్ విహార్ - ఢిల్లీ
- అంకలేశ్వర్ - గుజరాత్
- మహేసన ఇన్ - గుజరాత్
- సినీ జూ - జార్ఖండ్
- శ్రీనగర్ - జమ్ము అండ్ కశ్మీర్
- SMVT బెంగళూరు - కర్ణాటక
- బంగారుపేట - కర్ణాటక
- మైసూర్ - కర్ణాటక
- హుబ్బల్లి Jn - కర్ణాటక
- పాలక్కాడ్ - కేరళ
- పెండ్రా రోడ్ - ఛత్తీస్ గఢ్
- రత్లాం - మధ్య ప్రదేశ్
- మదన్ మహల్ - మధ్య ప్రదేశ్
- బినా - మధ్య ప్రదేశ్
- లోకమాన్య తిలక్ టెర్మినస్ - మహారాష్ట్ర
- మన్మాడ్ - మహారాష్ట్ర
- పింప్రి - మహారాష్ట్ర
- షోలాపూర్ - మహారాష్ట్ర
- నైన్‌పూర్ - మధ్య ప్రదేశ్
- నాగభీర్ - మహారాష్ట్ర
- మలాద్ - మహారాష్ట్ర
- ఖుర్దా రోడ్ - ఒడిశా
- ఫగ్వారా - పంజాబ్
- రాజపురా - పంజాబ్
- సవాయి మాధోపూర్ - రాజస్థాన్
- భగత్ కీ కోఠీ - రాజస్థాన్
- తిరుచ్చిరాపల్లి - తమిళనాడు
- ఈరోడ్ - తమిళనాడు
- దిండిగల్ జం. - తమిళనాడు
- సికింద్రాబాద్ - తెలంగాణ
- Pt. దీన్ దయాళ్ ఉపాధ్యాయ జం - ఉత్తర ప్రదేశ్
- విరంగన లక్ష్మీ బాయి - ఉత్తర ప్రదేశ్
- లక్నో - ఉత్తర ప్రదేశ్
- గోరఖ్‌పూర్ జం - ఉత్తర ప్రదేశ్
- బనారస్ - ఉత్తర ప్రదేశ్
- ఆగ్రా కాంట్ - ఉత్తర ప్రదేశ్
- మధుర - ఉత్తర ప్రదేశ్
- యోగ్ నగరి రిషికేష్ - ఉత్తరాఖండ్
- కాశీపూర్ - ఉత్తరాఖండ్
- మాల్డా టౌన్ - పశ్చిమ బెంగాల్
- ఖరగ్పూర్ - పశ్చిమ బెంగాల్