Jammu Kashmir Encounter: 12 గంటలపాటు సాగిన ఎన్‌కౌంటర్.. ఐదుగురు ఉగ్రవాదులు హతం

ABP Desam Updated at: 30 Jan 2022 01:18 PM (IST)
Edited By: Murali Krishna

కశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్‌కౌంటర్లలో మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్

NEXT PREV

జమ్ము కశ్మీర్​ తుపాకీ తూటాలతో మార్మోగింది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎన్​కౌంటర్​ మొత్తం ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ ఉన్నట్లు అధికారులు తెలిపారు.






రెండు చోట్ల..


కశ్మీర్​లోని బుడ్గాం జిల్లాలోని చరర్​ ఐ షరీఫ్ ప్రాంతంలోవ ఓ ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో కూడా ఉగ్రవాదులకు భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.


భారీగా ఆయుధాలు..


ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాల నుంచి భారీ ఎత్తున ఏకే-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నాయి బలగాలు. మృతి చెందిన వారు జేఈఎం, ఎల్​ఈటీ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. 







కశ్మీర్​లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్ జరిగింది. ఈ ఎన్​కౌంటర్ దాదాపు 12 గంటలపాటు జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లరో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నాం. మృతుల్లో జేఈఎం కమాండర్ జాహిద్ వానీ ఉన్నాడు.                                          -        కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ 


Also Read: Covid Update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. పెరిగిన మరణాలు.. ఒక్కరోజులో 893 మంది మృతి


Also Read: Canada PM Justin: అజ్ఞాతంలోకి ఆ దేశ ప్రధాని.. వ్యాక్సిన్ వ్యతిరేక ఆందోళనలతో కెనడా ఉక్కిరిబిక్కిరి

Published at: 30 Jan 2022 01:18 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.