Jammu Kashmir Police Terminated:


జమ్ముకశ్మీర్‌లో..


పోలీస్ శాఖ అంటే ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను మార్చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరీ ముఖ్యంగా జమ్ముకశ్మీర్‌లో పోలీస్ వ్యవస్థను పటిష్ఠం చేయాలని భావించింది. ఇందులో భాగంగానే...పోలీసింగ్‌ చాలా పారదర్శకంగా ఉండాలని ఆ శాఖకు తేల్చి చెప్పింది. అయినా...కొందరు పోలీసులు దారి తప్పారు. ఇది గుర్తించిన కేంద్రం వెంటనే చర్యలు చేపట్టింది. జమ్ముకశ్మీర్‌ పోలీస్ విభాగంలో 36 మంది 
పోలీసులను విధుల నుంచి తొలగించింది. అవినీతికి పాల్పడటం సహా కొన్ని క్రిమినల్ యాక్టివిటీస్‌లోనూ వీళ్ల హస్తం ఉందని తేలటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. ప్రజా సేవకులుగా ఉండాల్సిన వాళ్లు...కోడ్ ఆఫ్ కండక్ట్‌ను ఉల్లంఘించి అవినీతికి పాల్పడ్డారని జమ్ముకశ్మీర్ ప్రభుత్వం వేటు వేసింది. నిజానికి..అక్కడ రికార్డులను పరిశీలించటం...ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించినట్టు అనిపిస్తే వారిపై వేటు వేయటం అక్కడ రెగ్యులర్‌గా జరిగేదే. జమ్ముకశ్మీర్‌లోని సివిల్ సర్వీస్ రెగ్యులేషన్ (CSR)లో ఆర్టికల్‌ 226(2) ప్రకారం ఎవరు రూల్స్ అతిక్రమించినా ఇలాంటి చర్యలే తీసుకుంటారు. అక్రమ కార్యకలాపాల్లో పాలు పంచుకోవటం, విధులకు సరిగా హాజరు కాకపోవటం, సరిగా పని చేయకపోవటం, డిపార్ట్‌మెంట్‌ ఎంక్వైరీల్లో ఎక్కువ సార్లు పెనాల్టీ పడటం, అవినీతి కేసుల్లో హస్తం ఉండటం, క్రిమినల్ ఛార్జ్‌లు ఉండటం. వీటిలో ఏది నిరూపితమైనా విధుల నుంచి తప్పకుండా తొలగిస్తారు. పోలీసుల పని తీరుని సమీక్షించే రివ్యూ కమిటీ ఉంటుంది. ఈ కమిటీ "అసంతృప్తి" జాబితాలో ఎవరినైతే చేర్చుతుందో వారిపైనే వేటు పడుతుంది. 


గతంలోనూ..


ఈ మధ్య కాలంలో...జమ్ముకశ్మీర్‌లో అవినీతి విషయంలో "జీరో టాలరెన్స్"లో భాగంగా కొందరు అధికారులనూ తొలగించింది అక్కడి ప్రభుత్వం. జాతివ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వాళ్లనూ విధుల నుంచి తొలగించారు. అంతే కాదు. ఈ మధ్యే జమ్ము, కశ్మీర్ ప్రభుత్వం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఈ వేటు పడ్డ వారిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ బిట్టా కరాటే భార్య కూడా ఉన్నారు. ఆమెతో పాటు పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రసంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ కొడుకు సయ్యద్ అబ్దుల్ ముయీద్‌నూ తొలగించినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఉగ్ర సంస్థలకు నిధులు సమకూర్చటం సహా..1990ల్లో కశ్మీరీ పండిట్ల హత్యల్లోనూ వీరి హస్తముందన్న కారణంగా...విధుల నుంచి తీసేస్తున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఫారూఖ్ అహ్మద్ అలియాస్ బిట్టా కరాటే ఇప్పటికే ఓ తన నేరాన్ని అంగీకరించారు. సతీష్ టిక్కూ అనే ఓ కశ్మీరీ పండిట్‌ను హత్య చేసినట్టు నేరం ఒప్పుకున్నారు. కశ్మీర్‌ లోయలో ఉగ్రవాదానికి బలి అయిన తొలి వ్యక్తి సతీష్. ఈయన కుటుంబం ఈ ఏడాది మేలో బిట్టా కరాటేకు సంబంధించిన ఓ వీడియోను ప్రభుత్వానికి అందజేశారు. ఈ బిట్టా కరాటే నేరాంగీకారానికి సంబంధించిన ఈ వీడియోను పరిశీలించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. 


Also Read: Gujarat, HP Election 2022 Dates: మోగనున్న నగారా- ఆ రెండు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ నేడే విడుదల!