దేవి ప్రవర్తన గురించి చిన్మయి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అది చూసిన మాధవ్ తన దగ్గరకి వస్తాడు. నా బిడ్డని ఈ మధ్య దగ్గరకి తీసుకుని కూడా చాలా రోజులు అయింది, తను దేని గురించో బాధపడుతుందని మాధవ్ అనుకుని చిన్మయిని పలకరిస్తాడు. ఏంటి తల్లి అలా ఉన్నావ్ అని అడుగుతాడు. ఈ మధ్య నువ్వు ఎప్పుడు చూసిన ఏదో ఆలోచిస్తూ బాధపడుతున్నట్టు కనిపిస్తున్నావ్ నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పు అని అడుగుతాడు.. నాకేమీ ప్రాబ్లం లేదని చిన్మయి అంటుంది.


చిన్మయి: నాన్న.. నీకు నేనంటే నీకు ఇష్టమేనా.. ఆఫీసర్ అంకుల్ దగ్గరకి తీసుకున్నట్టు నువ్వు ఎందుకు దగ్గరకి తీసుకోవు. ఆఫీసర్ అంకుల్ మాట్లాడినట్టు కూడ నువ్వు ఎందుకు మాట్లాడవ్. ఆ అంకుల్ మా దగ్గరకి వచ్చి మాట్లాడి మమ్మల్ని ఆడిస్తాడు. నువ్వు ఎందుకు మాతో ఎప్పుడు అలా ఉండవు. నిజం చెప్పు నాన్న నేను అంటే నీకు ఇష్టం లేదు కదా


మాధవ్: అయ్యో అలా ఏమి లేదు తల్లి.. నేను కొంచెం పనిలో ఉన్నాను అందుకే ఈ మధ్య నీతో టైమ్ స్పెండ్ చేయడం లేదు. నీ మీద ప్రేమ లేకపోవడం ఏంట్రా


చిన్మయి: ఏమో నాన్న నాకు అలానే అనిపిస్తుంది. నాకు నాన్న ఉన్నా లేనట్టే అనిపిస్తుందనేసి వెళ్ళిపోతుంది


ఆ మాటలు విన్న రాధ మాధవ్ దగ్గరకి వస్తుంది. బిడ్డ బాధ ఇప్పటికైనా అర్థం అయ్యిందా, నీ బిడ్డ నిన్ను నాయన నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగిందంటే ఎంత బాధపడి ఉంటుంది.. ఇప్పటికైనా మారు నువ్వు మనిషిగా చచ్చిపోయి చాలా దినాలు అయింది, ఇప్పటికైనా మారు అప్పుడే నీ బిడ్డ నువ్వు బాగుంటారు అయినా ఇలాగే ఉంటే ఆ దేవుడు కూడా నిన్ను కాపాడలేడు అనేసి రాధ వెళ్ళిపోతుంది.


Also Read: మాళవికకి కమ్మలు తొడిగిన యష్- నన్నెందుకు పెళ్లి చేసుకున్నారని ప్రశ్నించిన వేద


రాధ చిన్మయి గురించి తన బాధని తల్లి భాగ్యమ్మతో పంచుకుంటుంది. జానకిని రామూర్తి చక్కగా రెడీ చేస్తాడు. నాకు ప్రమాదం జరిగింది అంటేనే తట్టుకోలేకపోతున్నారు మాధవ్ వల్లే ఇలా జరిగిందని తెలిస్తే ఈయన ఏమైపోతారో అని జానకమ్మ దిగులుపడుతుంది. అప్పుడే దేవి, చిన్మయి వచ్చి అమ్మతో కలిసి పొలం వెళ్తున్నాం అని చెప్తారు. దేవుడు రాధకి చాలా ఓర్పు ఇచ్చాడని రామూర్తి మురిసిపోతాడు. రాధ నిజంగా మన ఇంటి మహాలక్ష్మి అని అంటాడు. మహాలక్ష్మి అని మనం అనుకుంటున్నాం కానీ తనని కష్టపెడుతున్నాడు మన కొడుకు అది మీకు ఎలా చెప్పాలి నేను చెప్పినది మీకు అర్థం కూడా కావడం లేదని జానకి మనసులోనే బాధపడుతుంది.


రుక్మిణి దేవి, చిన్మయిని తీసుకుని పొలానికి వస్తుంది. కష్టం అంటే ఏంటి అని అడిగారు కదా అది చూపిద్దామని తీసుకొచ్చాను అని రుక్మిణి పిల్లలతో చెప్తుంది. పంట పొలాలు గురించి చెప్తుంది. అవి వేసే విధానం గురించి చెప్తుంది. పంట దున్నాలంటే ట్రాక్టర్ కావాలి అది లేకుండా ఎలా అంటే రుక్మిణీ అక్కడే ఉన్న నాగలి చూపిస్తుంది. దీనితో ఎలా పొలం ఎలా దున్నుతారని చిన్మయి అడిగేసరికి రుక్మిణి పాత రుక్మిణిలా మారి దాన్ని భుజానికి ఎత్తుకుంటుంది.


Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!