వేద యష్ కోసం వెతుకుతూ ఉంటుంది. మాళవిక యష్ దగ్గరకి వచ్చి మాట్లాడుతుంది. అక్కడ అందరూ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ యశోధర్ ఏదైనా ముఖ్యమైన రోజుని గుర్తు చేసుకుంటున్నావా.. ఈరోజు డేట్ మర్చిపోయావా అని తను పెట్టుకున్న చెవి రింగ్స్ చూపిస్తుంది. వీటిని నువ్వు నాకు ఎంతో ఇష్టంగా కొనిచ్చావ్ గుర్తుందా అని అనడం వేద విని షాక్ అవుతుంది. నాకు అన్నీ గుర్తున్నాయ్ నువ్వు చేసిన ద్రోహంతో సహా అని యష్ కోపంగా అంటాడు. ఈరోజు ఆదిత్యకి ఎంత ఇంపార్టెంట్ రోజు అనే విషయం నీకు గుర్తుందా అని స్టెప్ సేల్స్ తీసి భధ్రపరిచావ్ మర్చిపోయావా. హాస్పిటల్ అగ్రిమెంట్ రెన్యువల్ చేసే వాడివి కానీ ఈ సంవత్సరం మాత్రం నీకు గుర్తు లేదు కొత్త పెళ్ళాం మోజులో పడి కన్నకొడుకుని పట్టించుకోలేదని మాళవిక అరుస్తుంది.


Also Read: హమ్మయ్య డాక్టర్ బాబు-వంటలక్క మళ్లీ కలసిపోయారు, ఇప్పుడు మోనిత పరిస్థితేంటి!


షటప్ మాళవిక.. ఇంత ముఖ్యమైన విషయం నేను మరచిపోవడం తప్పే కానీ దీని గురించి నువ్వు నాకు లెక్చర్ ఇవ్వొద్దు. బాధ్యత అనే పదం నీ నోటి నుంచి వింటుంటే చండాలంగా ఉందని అంటాడు. సరే నాకు బాధ్యత లేదు కానీ లాస్ట్ ఇయర్ కూడా మనం కలిసి లేము కానీ నన్ను వెతుక్కుంటూ వచ్చి నన్ను హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళావ్ ఆది పేరెంట్స్ గా మనం సైన్ చేశాం మరి ఈ సంవత్సరం ఏంటి ఆది మీద ప్రేమ చచ్చిపోయిందా అని నిలదిస్తుంది. దీన్ని మర్చిపోయి ఉండకూడదు నేను మర్చిపోవడం నా పొరపాటే అని యష్ అంటాడు. నీకు ఇద్దరు పిల్లల్ని ఇచ్చిన నన్ను మాత్రం పట్టించుకోలేదు అలాగే ఆదికి సంబంధించిన విషయం కూడా నువ్వు మర్చిపోయావు అని మాళవిక నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది.


ఆ మాటకి యష్ మాళవికకి క్షమాపణ చెప్తాడు. నువ్వు నా పిల్లలకి తల్లివి, కాదని నేను అనను. ఈ ప్రపంచంలో నాకు ఆది తర్వాతే ఎవరైనా. నేను చచ్చిపోయినా వాడి మీద ప్రేమ మాత్రం పోదని అంటాడు. నా గురించి కాకపోయినా ఆది గురించి ఆలోచిస్తున్నావ్ చాలా థాంక్స్ అని మాళవిక చెప్తుంది. మాళవిక తన చెవికి పెట్టుకున్న రింగ్స్ తీసి యష్ కి ఇస్తుంది. అప్పుడు నా మీద నీకు ప్రేమ ఉన్నప్పుడు కొనిచ్చావ్ ఇప్పుడు లేదు కదా వీటిని తీసుకెళ్ళి నీ కొత్త భార్యకి ఇవ్వమని అంటుంది. యష్ మాత్రం అదేంటి ఇవి నేను నీకు ఆది పుట్టిన తర్వాత వచ్చిన నీ బర్త్ డే కి ఇచ్చాను, వీటి ధర కూడా నాకు గుర్తు ఉంది, నా దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి కొనిచ్చాను అని చెప్తాడు.


Also Read: రాణికి బుగ్గచుక్క దిద్దిన రిషి, మురిసిన వసు, జగతి ఆనందం కోసం మరో అడుగు


ఇవి మన ఆదికి సంబంధించిన తీపి జ్ఞాపకం పెట్టుకో.. మనం ఇద్దరం విడిపోయి ఉండవచ్చు కానీ ఇవి మాత్రం పెట్టుకో అని బతిమలాడతాడు. తాను పెట్టుకోకపోయేసరికి యష్ వాటిని తీసి మాళవిక చెవులకి పెడతాడు. అది చూసి వేద మనసు ముక్కలవుతుంది. నేను నీతో గడిపిన జ్ఞాపకాలు చేదిరిపోయాయి కానీ సంతోషాలు కాదు ఆ సంతోషం ఆది నా లైఫ్ లో వాడి స్థానం వాడిదే, వాడిని క్షేమంగా సంతోషంగా మనం ఇద్దరం చూసుకోవాలని అంటాడు. బహుశా నేను లైఫ్ లో తండ్రిని కాలేను, నన్ను వేరే ఎవరు తండ్రిని చేయలేరు. ఈఈ జన్మకి నేను ఇద్దరి పిల్లల తండ్రినే అని యష్ మాళవికతో చెప్పి వెళ్ళిపోతాడు. యశోధర్ నోటితో వేద ఏ మాటలు అయితే వినకూడదు అనుకుందో ఆ మాటలే యశోధర్ నోటితో అనిపించావ్ శభాష్ అని అనుకుంటుంది.


వేద బాధగా ఒక చోట కూర్చుని ఏడుస్తూ ఉంటే యష్ అక్కడికి వస్తాడు. వేద మాటల ద్వారా మాళవికతో మాట్లాడిన విషయం విన్నట్లు అర్థం చేసుకుంటాడు. గతాన్ని అంత గట్టిగా గుర్తుంచుకున్న వాళ్ళు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారని వేద అడుగుతుంది. నేను అన్నది వేరు, నువ్వు విన్నది వేరు అని యష్ సర్ది చెప్తాడు. కానీ వేద మాత్రం బాధగా మాట్లాడుతుంది. అమ్మ అయ్యే రాత దేవుడు నా నుదుటిన రాయలేదు, ఈ విషయం నేను ఎప్పుడు ఎవరి దగ్గర దాచలేదు. అందరి దగ్గర నేను విన్న మాట ఏదో తెలుసా గొడ్రాలు.. అని చాలా బాధపడుతుంది.