Bigg Boss 6 Telugu: ఎపిసోడ్ ప్రారంభం అవుతూనే బాలాదిత్య కన్నీళ్లతో తన భార్యా బిడ్డల గురించి చెప్పడం చూపించారు. మాట్లాడుతుంటే అతని వెంట కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. ముందు ఎపిసోడ్లో బాలాదిత్య తన భార్య, కూతురితో మాట్లాడారు. ఆడియోకాల్ కోసం ఎక్కువ శాతం బ్యాటరీ వాడినందుకు బాలాదిత్యపై సెటైర్లు వేశాడు ఆర్జే సూర్య. కాగా బాలాదిత్య చాలా ఒత్తిడిలో ఉండి సిగరెట్లు కావాలని కెమెరాల దగ్గరికి వెళ్లి అడిగాడు. ఆదిరెడ్డి అలా పంపరు అని చెప్పాడు. ఇక గీతూ అయితే చాలా పైశాచికంగా ఆనందపడుతూ కనిపించింది. సూర్య, కీర్తితో కోడ్ లాంగ్వేజ్ లో మాట్లాడుతూ కనిపించాడు. ఈ వారం ఎవరు వెళ్లిపోతారో అలా కోడ్ లాంగ్వేజ్ లో చేతిపై రాసి చూపించాడు. ఫోన్లో అమ్మతో మాట్లాడుతున్నట్టు నటించాడు.


రైస్ సరిపోవడం లేదని మధ్యాహ్నం ఎక్కువ అన్నం పెట్టమని అడిగాడు ఆదిరెడ్డి. రేవంత్ అన్నం వేస్టవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పాడు. దానిపై కాస్త వాదించుకున్నారు.  తరువాత బిగ్‌బాస్ బ్యాటరీని వందశాతం రీఛార్జ్ చేసుకునేందుకు చివరి అవకాశం ఇచ్చారు. వాసంతి, రోహిత్‌లలో ఒకరు వచ్చే రెండు వారాలకు సెల్ఫ్ నామినేట్ అవ్వాలని చెప్పారు. వాసంతి ఒప్పుకోకపోవడంతో రోహిత్ నామినేట్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. దీంతో బ్యాటరీ వందశాతం రీచార్జ్ అయ్యింది. 


ఫీలైన రోహిత్
ఫోన్ రింగవ్వగానే ఎవరు అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తారో వారికే సర్‌ప్రైజ్ గిఫ్టు ఉంటుందని చెప్పారు బిగ్ బాస్. ఫోన్ రింగయ్యాక ఎవరు వెళ్లాలన్నది వాసంతి, ఫైమా, సూర్య, కీర్తి, రాజశేఖర్ మాట్లాడుకున్నారు. కానీ రోహిత్, మెరీనాలను మాత్రం అడగలేదు. దీంతో చాలా బాధపడ్డాడు రోహిత్. 


ఫోన్ రింగవ్వగానే రేవంత్ ఫోన్ ఎత్తాడు. అతనికి భార్య వీడియో చూడ్డానికి 20 శాతం, భార్య ఫోటో కోసం 10 శాతం బ్యాటరీ ఖర్చు చేయాలని చెప్పారు. దీంతో రేవంత్ ఫోటో ఎంచుకున్నాడు. సూర్య అమ్మ నుంచి వచ్చిన ఉత్తరాన్ని ఎంచుకున్నాడు. అలాగే వాసంతి తన అక్క కూతురి ఫోటో కావాలని ఎంచుకుంది. రాజశేఖర్ ఆడియోకాల్ ఎంచుకున్నాడు. వాళ్లమ్మతో మాట్లాడాడు. గీతూ, రేవంత్ బాగా ఆడుతున్నారని, గీతూతో అవసరం అయితే ఫైట్ చేయమని చెపారు వాళ్లమ్మగారు.  కీర్తికి మానస్ నుంచి వాయిస్ మెసేజ్ వచ్చింది. కానీ కీర్తి పెద్ద ఆనందంగా ఫీల్ కాలేదు. 


కెప్టెన్సీ కంటెండర్ల టాస్కు...
కెప్టెన్సీ కంటెండర్లుగా అయ్యే అవకాశం అందరికీ ఇచ్చారు బిగ్ బాస్. ఎమినిమి బంతులు పెట్టి వాటిని ఎవరైతే తమ బాస్కెట్లో మొదల వేస్తారో... ఆ ఎనిమిది మంది కెప్టెన్సీ కంటెండర్లుగా మారుతారని చెప్పారు బిగ్ బాస్. బంతులు కోసం చాలా ఫైట్ చేసుకున్నారు. ముందుగా రేవంత్, ఆదిరెడ్డి, శ్రీ సత్య, రాజేశేఖర్ బంతులు దక్కించుకుని తమ పేరున్న బాస్కెట్లో పెట్టారు. సూర్యకు,అర్జున్, వాసంతికి కూడా బంతులు దొరికాయి. 


గీతూ అయితే ఫైట్ చేయకుండా అందరి దగ్గరికి వెళ్లి బంతి ఇచ్చేయమని అడగడం మొదలుపెట్టింది. చివరికి సుదీప బంతిని దక్కించుకుని రోహిత్ బాస్కెట్లో వేసింది.  దీంతో  శ్రీసత్య, రేవంత్, వాసంతి, ఆదిరెడ్డి, సూర్య, రాజ్, అర్జున్, రోహిత్ కెప్టెన్సీ కంటెండర్లుగా మారారు. 


Also read: కీర్తికి మానస్ వాయిస్ మెసేజ్? ఇంటి సభ్యుల కోసం అలాంటి నిర్ణయం తీసుకున్న రోహిత్