ITA Awards 2022: ABP న్యూస్ అరుదైన రికార్డ్- వరుసగా రెండో ఏడాది మోస్ట్ పాపులర్ ఛానల్‌గా!

ABP Desam Updated at: 12 Dec 2022 06:14 PM (IST)
Edited By: Murali Krishna

ITA Awards 2022: 'మోస్ట్ పాపులర్ హిందీ న్యూస్ ఛానల్' అవార్డును వరుసగా రెండో ఏడాది ABP నెట్‌వర్క్ సాధించింది.

ABP న్యూస్ అరుదైన రికార్డ్

NEXT PREV

ITA Awards 2022: దేశంలోని ప్రముఖ న్యూస్‌ ఛానల్ ABP న్యూస్.. అరుదైన రికార్డ్ నమోదు చేసింది. వరుసగా రెండో ఏడాది.. 'మోస్ట్ పాపులర్ హిందీ న్యూస్ ఛానల్' అవార్డును గెలుచుకుంది. ముంబయిలో జరిగిన ఇండియన్ టెలివిజన్ అకాడమీ (ITA) అవార్డుల కార్యక్రమంలో సగర్వరంగా ఈ అవార్డును ABP అందుకుంది. GR8 ఎంటర్‌టైన్‌మెంట్ లిమిటెడ్ ఛైర్మన్ & amp; మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ శశి రంజన్,  ప్రఖ్యాత నటి మహిమా చౌదరి ఈ అవార్డును అందజేశారు.


అంతేకాదు


ఈ అవార్డుతో పాటు ABP న్యూస్ యాంకర్లు రుబికా లియాఖత్, అఖిలేశ్ ఆనంద్ కూడా వ్యక్తిగత పురస్కారాలను గెలుచుకున్నారు. 'బెస్ట్ టాక్ / చాట్ షో' పేరుతో ఉత్తర్‌ప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రుబికా చేసిన ఇంటర్వ్యూకు ఈ అవార్డు వచ్చింది.


మరోవైపు అఖిలేశ్ ఆనంద్.. న్యూస్/ కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన బెస్ట్ షోకు అవార్డు అందుకున్నారు. 'నీటి వ్యర్థాల నిర్వహణ'పై చేసిన ఎపిసోడ్‌కు గాను ఈ పురస్కారం దక్కింది. 22వ ITA అవార్డ్స్‌లో విభిన్నమైన, ప్రత్యేక ఎంట్రీలలో అత్యధిక అవార్డులు గెలిచిన ఏకైక వార్తా ఛానెల్‌గా ABP న్యూస్ రికార్డ్ సృష్టించింది. ఈ అవార్డు సాధించడంపై ABP నెట్‌వర్క్ CEO అవినాశ్ పాండే ఆనందం వ్యక్తం చేశారు.


చాలా ప్రత్యేకం



ఈ అవార్డు అందించిన శశి రంజన్, అను రంజన్, ITAకి నా ధన్యవాదాలు. నాణ్యమైన కంటెంట్‌ను అందించడానికి పగలనక, రాత్రనక.. డెస్క్‌లో, క్షేత్రస్థాయిలో పని చేస్తోన్న మా వందలాది మంది జర్నలిస్టులకు ఈ అవార్డు అంకితం. చేసిన పనికి సహోద్యోగుల నుంచి వచ్చే ప్రశంసలు చాలా అమూల్యం. నాణ్యమైన కంటెంట్‌ను అందించాలని ABP నెట్‌వర్క్ బలంగా నమ్ముతుంది. అందుకే మేము నాణ్యత కలిగిన వార్తలనే మా వీక్షకులకు అందిస్తాం. అయితే వీటన్నింటికీ మించి మాపైన ఎనలేని అభిమానం చూపిస్తోన్న మిలియన్ల మంది ప్రేక్షకులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అత్యంత ప్రజాదరణ పొందిన 'హిందీ న్యూస్ ఛానెల్‌'గా ABPకి ఓటు వేయడం ద్వారా వీక్షకులు.. తమ హృదయాల్లో ABP న్యూస్‌కు ప్రత్యేక స్థానం ఉందని మరోసారి నిరూపించారు. అందుకే ఈ అవార్డు మాకు చాలా ప్రత్యేకం.                            - అవినాశ్ పాండే, ABP నెట్‌వర్క్ CEO






ఈ అవార్డును ఇప్పుడు వరుసగా రెండో ఏడాది ABP నెట్‌వర్క్‌ గెలుచుకుంది. ABP న్యూస్‌కు ఉన్న ప్రజాదరణ, నెట్‌వర్క్‌కు ఉన్న బలమైన ప్రోగ్రామింగ్, ఉద్యోగుల అంకితభావం కారణంగా ఇది సాధ్యమైంది. ఖచ్చితమైన, నిష్పాక్షికమైన వార్తలను అందించడంలో ABP ఎప్పుడూ ముందు ఉంటుంది. 


ITA అవార్డులు


ఇండియన్ టెలివిజన్ అకాడమీ అవార్డ్స్‌ను ITA అవార్డ్స్ అని కూడా పిలుస్తారు. భారత టెలివిజన్, ఓటీటీ & సినీ పరిశ్రమలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ప్రతి ఏడాది ITA ఈ అవార్డులను అందజేస్తుంది. దీనిని అను రంజన్, శశి రంజన్ స్థాపించారు. మొట్టమొదటి ITA అవార్డు వేడుక 2001, నవంబర్ 30న జరిగింది. గత రెండు దశాబ్దాలుగా ఈ అవార్డులను అందజేస్తుంది.


ABP నెట్‌వర్క్


ఒక వినూత్న మీడియా, కంటెంట్ క్రియేషన్ కంపెనీగా ABP నెట్‌వర్క్ విశ్వసనీయ పాత్ర పోషిస్తోంది. ప్రసారం & డిజిటల్ స్పియర్, మల్టీ లాంగ్వేజ్ వార్తా ఛానెల్‌లు, వెబ్‌సైట్‌ల రూపంలో ABP.. 535 మిలియన్ల మందికి న్యూస్ చేరవేస్తుంది. ABP నెట్‌వర్క్‌ అనేది ABP సంస్థల సమాహారం. దాదాపు 100 ఏళ్ల వైభవం ABP సొంతం.






Published at: 12 Dec 2022 06:14 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.